ఇందుకూరి రామకృష్ణంరాజు

వికీపీడియా నుండి
(రాజశ్రీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇందుకూరి రామకృష్ణంరాజు
ఇందుకూరి రామకృష్ణంరాజు
జననంఇందుకూరి రామకృష్ణంరాజు
ఆగష్టు 31, 1934
విజయనగరం
మరణంఆగస్టు 14, 1994
ఇతర పేర్లురాజశ్రీ
వృత్తిసినిమా పాటల రచయిత
ప్రసిద్ధితెలుగు సినిమా రచయితలు
తండ్రిఇందుకూరి అప్పలరాజు,
తల్లినారాయణమ్మ.

రాజశ్రీ (ఆగష్టు 31, 1934 - ఆగస్టు 14, 1994) తెలుగు సినిమా లలో అనువాద రచనలో ప్రముఖులు.

జననం

[మార్చు]

వీరు ఆగష్టు 31, 1934 సంవత్సరం విజయనగరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు ఇందుకూరి అప్పలరాజు, నారాయణమ్మ.

వీరు విజయనగరం మహారాజా కళాశాల నుంచి బి.ఎస్సీ. పట్టా పొందారు. వీరు తొలినుంచి నాటక సాహిత్యాభిలాషి. వీరి 'వదిన', 'ఆంధ్రశ్రీ' నాటకాలు రాఘవ స్మారక కళాపరిషత్తులో ఉత్తమ రచనలుగా ఎన్నుకోబడ్డాయి. విశాఖ జిల్లా బోర్డు కార్యాలయంలో స్టెనో టైపిస్టుగా కొంతకాలం పనిచేశారు.

చలనచిత్ర రంగానికి తరలి వెళ్ళి పినిశెట్టి శ్రీరామమూర్తి, మానాపురం అప్పారావు వద్ద సహాయ దర్శకునిగా చేరారు. తరువాత తమిళ చిత్రసీమ వీరిని కథకునిగా పరిచయం చేసింది.

రాజశ్రీ (సినీ రచయిత)

[మార్చు]

రాజుశ్రీగా ప్రసిద్ధులైన ఇందుకూరి రామకృష్ణంరాజు ప్రముఖ సినీ రచయిత. 1934 ఆగష్టు 31విజయనగరంలో అప్పలరాజు, నారాయణమ్మలకు జన్మించాడు. ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాశాడు. బి.యస్సీ ఫిజిక్సు పూర్తి చేసి ఆ తర్వాత రెండు మూడేళ్ళు విజయనగరం తహసిల్దారు వద్ద పి.ఏ.గా చేసి, అక్కడ నచ్చక మద్రాసు వెళ్ళిపోయారు. అక్కడ ఎం.జి.ఆర్.ని కలిసి ఆయన కోసం రాసిన ఒక కథను వినిపించారు. అది ఎం.జి.ఆర్. గారికి నచ్చడంతో "తేడివంద మాప్పిళ్ళై"పేరుతో సినిమా తీశారు. అది విజయవంతం అయ్యింది. ఆ తర్వాత దాదాపు 10 వరకు తమిళ చిత్రాలకి కథ, స్క్రీన్ ప్లే అందించారు. సుమారు 1000 చిత్రాలకు రచన చేశారు. అంతే కాకుండా ఎం‌కన్న బాబు, మామా కోడలు, పెళ్ళిచేసి చూపిస్తాం , "పుదియ సంగమం" అనే తమిళ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు. చదువు సంస్కారం, నిజం నిద్రపోదు (1976), ఓ ప్రేమ కథ (1987) చిత్రాలకు దర్శకత్వం వహించారు. మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకే ఒక చిత్రం గీతాంజలికి మాటలు రాశారు. మట్టిలో మాణిక్యం, బంగారు గాజులు చిత్రాలకు బంగారు నంది బహుమతులు అందుకున్నారు. రాజశ్రీ రచించిన చివరి చిత్రం ప్రేమికుడు. 1994 ఆగస్టు 14 న నిదురలోనే మరణించాడు.

అతని కుమారుడు రాజశ్రీ సుధాకర్ ఏవిఎమ్ వారి విక్రమ్ నటించిన జెమిని, సూర్య నటించిన వీడొక్కడే, లక్ష్మి గణపతి ఫిలిమ్స్ వారి అర్జున్ నటించిన సింగమలై వంటి కొన్ని తమిళ అనువాద చిత్రాలకు, మరి కొన్ని ఆంగ్ల అనువాద చిత్రాలకు మాటలూ,హృతిక్ రోషన్ నటించిన క్రిష్ , జోధా అక్బర్, ధూమ్-2, అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో రేస్, వంటి ఎన్నో హిందీ అనువాద చిత్రాలకు మాటలు-పాటలు రాశాడు.

చిత్రసమాహారం

[మార్చు]

కొన్ని ముఖ్యమైన చిత్రాలు

[మార్చు]

కొన్ని ఆణిముత్యాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.

యితర లింకులు

[మార్చు]