స్వప్న
| స్వప్న (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | దాసరి నారాయణరావు |
| తారాగణం | రాజా , స్వప్న, రాంజీ, చాట్ల శ్రీరాములు |
| సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
| నిర్మాణ సంస్థ | శ్రీ లలిత ఎంటర్ప్రైజెస్ |
| భాష | తెలుగు |
"స్వప్న "దాసరి నారాయణరావు దర్శకత్వంలో.1980 నవంబర్ 14 న విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా సినీనటి స్వప్న పరిచయం చేయబడింది. రాజా, స్వప్న, రాంకీ, నటించిన ఈ చిత్రానికి సంగీతం చెళ్లపిళ్ల సత్యం సమకూర్చారు.
సంక్షిప్త చిత్రకథ
[మార్చు]స్వప్నని రాజా ప్రేమిస్తాడు. అది చెప్పే లోపలే ఆమె తండ్రి స్వప్నకి రాంజీతో పెళ్ళి నిశ్చయం చేస్తారు. రాంజీ అన్ని విధాల తగిన వాడు అని స్వప్న కూడా ప్రేమలో పడుతుంది. ఈ లోపల స్వప్న తండ్రి మరణిస్తారు. స్వప్న ఆస్తి మొత్తం కోర్టు గొడవల్లో ఉండటంతో రాంజీ ఇంకో డబ్బున్న అమ్మాయి వెనకాల పడతాడు. ఆ అమ్మాయి రాంజీ స్వభావం తెలిసి వదిలేస్తుంది. రాంజీ తిరిగి స్వప్న దగ్గరకి వస్తాడు. స్వప్న ఛీకొట్టి రాజాతో వెళ్ళిపోతుంది.
తారాగణం
[మార్చు]- రాజా
- స్వప్న
- రాంజీ
- చాట్ల శ్రీరాములు
- జవ్వాడి రామారావు
- జయబాబు
- డాక్టర్ రామకృష్ణ
- రాగిణి
- రీనా
- పి. జె. శర్మ
- పుష్ప కుమారి
- అతిలి లక్ష్మి
సాంకేతిక వర్గం
[మార్చు]1.దర్శకుడు: దాసరి నారాయణరావు
2.సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
3.నిర్మాణ సంస్థ:శ్రీ లలితా ఎంటర్ ప్రైసెస్
4.సాహిత్యం: దాసరి నారాయణరావు, రాజశ్రీ
5.నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, ఎం రమేష్, జి ఆనంద్, ప్రతివాద భయంకర శ్రీనివాస్
6.ఛాయ గ్రహణం: కె.ఎస్.మణి
7.కూర్పు: కృష్ణంరాజు
8.కళా దర్శకుడు: శ్రీనివాసరాజు
9.నిర్మాత: ఎన్.జి.జగదీశ్ చంద్ర
10.నిర్మాణ: శ్రీ లలితా ఎంటర్ ప్రైజెస్
11.విడుదల:14:11:1980.
పాటలు
[మార్చు]- అంకితం, నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం ! ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ., రచన: దాసరి నారాయణరావు.
- అందాలు రాశిగా పోసి ఆ రాశికి ప్రాణం పోసి
ఆ బ్రహ్మ చేసిన బొమ్మ నీవు, నీకు జోహారు, స్వప్నా, స్వప్న! ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి - ఇదే నా మొదటి ప్రేమలేఖ, రాసాను నీకు చెప్పలేక
ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేతకాక, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, రచన: రాజశ్రీ - ముద్ద ముద్ద మందారాలు, లేత బుగ్గ సింగారాలు, శిష్ట్లా జానకి, ఎం రమేష్, జి ఆనంద్ కోరస్, రచన: దాసరి నారాయణరావు
- శ్రీరస్తు అబ్బాయి, శుభమస్తు అమ్మాయి, పులపాక సుశీల, పి. బి.శ్రీనివాస్ బృందం, రచన : రాజశ్రీ
- మల్లెమొగ్గ పూచిందంట ఎక్కడో ప్రేమ, ఎస్.జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, రచన: దాసరి నారాయణరావు.
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.