Jump to content

దళపతి

వికీపీడియా నుండి
దళపతి
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం మణిరత్నం
నిర్మాణం ఆర్.వి.రావు
తారాగణం రజనీకాంత్,
మమ్ముట్టి
సంగీతం ఇళయరాజా
గీతరచన రాజశ్రీ
కళ తోట తరణి
కూర్పు గౌతంరాజు
భాష తెలుగు

దళపతి తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. దీనికి మూలం తమిళంలో మణిరత్నం దర్శకత్వం వహించిన "తళపతి" చిత్రం. మహాభారతం లోని దుర్యోధన, కర్ణ, అర్జున పాత్రలను ఆధారంగా చేసుకుని తీసిన సాంఘిక చిత్రం.

భోగి పండుగ రోజున చిన్నవయసులోనే పెళ్ళి కాకుండానే గర్భవతి అయిన ఒక అమ్మాయి తన పుట్టిన పసికందును లోకానికి వెరసి ఒక గూడ్సు బండిలో వదిలేస్తుంది. ఆ బిడ్డను కొంతమంది పిల్లలు ఒక కాలనీకి చేర్చగా వారే అతన్ని పెంచి పెద్ద చేస్తారు. అతను సూర్య అనే పేరుతో పెరిగి పెద్దవాడవుతాడు. తమ కాలనీలో జరిగిన అన్యాయాన్ని ఎదిరిస్తుంటాడు. ఒకసారి ఊర్లో పేరుమోసిన వ్యక్తి అయిన దేవరాజ్ మనిషి అయిన రమణ అనే వ్యక్తిని చితక్కొడతాడు సూర్య. అది తెలిసిన దేవరాజ్ రమణ కనుక బ్రతికి రాకపోతే అతన్ని అంతమొందిస్తానని చెబుతాడు. సూర్య కూడా దేవరాజ్ ను ఎదిరించి ధైర్యంగా మాట్లాడతాడు. రమణ ఆసుపత్రిలో మరణిస్తాడు. పోలీసులు సూర్యను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేస్తారు. దేవరాజ్ మనిషి వచ్చి సూర్యను విడిపిస్తాడు. సూర్య ధైర్యం, నిజాయితీ నచ్చి దేవరాజ్ అతన్ని తన ముఠాలో చేర్చుకుంటాడు. అనాథగా జైలులో మగ్గిపోవలసిన తనను విడిపించినందుకు సూర్య కృతజ్ఞతగా జీవితాంతం అతని స్నేహితుడిగా, దళపతిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. దేవరాజ్ ఒకప్పుడు సర్వారాయుడు అనే రాజకీయ నాయకుడి నీడలో ఉంటాడు. తర్వాత తన ప్రాబల్యం పెంచుకుని బయటికి వస్తాడు. ఇది సర్వారాయుడికి గిట్టదు. అతను సూర్యను దేవరాజ్ ను వదిలి తన దగ్గరకు రమ్మని అడుగుతాడు. సూర్య అందుకు ఒప్పుకోడు. సర్వారాయుడు దేవరాజ్ మీద హత్యా ప్రయత్నం చేయిస్తాడు. కానీ దేవరాజ్ ఆ ప్రమాదం నుంచి బ్రతికి బయట పడతాడు.

సూర్యను చిన్నతనంలోనే వదిలేసిన అతని తల్లి కళ్యాణి ఇప్పటికీ ఆ దుస్సంఘటనను గుర్తు చేసుకుని కుమిలిపోతూ ఉంటుంది. ఆమెకు అర్జున్ అనే మరో కొడుకు ఉంటాడు. అతని దేవరాజ్, సూర్య ఉన్న ఊరికి కలెక్టరుగా వస్తాడు. అతనికి దేవరాజ్, సూర్య అక్కడ పెత్తనం చెలాయిస్తూ ఉండటం నచ్చక వారికి అదంతా ఆపేయమంటాడు. కానీ వారు అందుకు ఒప్పుకోరు. ఈ లోగా దేవరాజ్ మీద హత్యాప్రయత్నం చేసిన ఒకడిని సూర్య ఇంకొంతమంది వ్యక్తులు కలిసి పెట్రోలు పోసి కాల్చి చంపుతారు. ఇది చూసి అర్జున్ పోలీసులను ఈ అన్యాయాల్ని ఆపాలని అడగ్గా దేవరాజ్, సూర్యకు వ్యతిరేకంగా అక్కడ ఎవరూ సాక్ష్యం చెప్పరని చెబుతాడు. అప్పుడు హత్యాస్థలంలో ఉన్న అర్జున్ తండ్రి సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తాడు. కానీ పోలీసులు అతన్ని పిలిచే ముందే సూర్య తన భార్య చిన్నతనంలో వదిలేసిన బిడ్డ అని తెలుస్తుంది. పోలీసుల ముందు తాను హంతకుడిని తాను గుర్తు పట్టలేనని చెబుతాడు. అర్జున్ తండ్రిని నిలదీస్తాడు. కానీ అయన సూర్యకు అంతకుముందే ఇచ్చిన మాట కోసం అర్జున్ తో అసలు నిజం చెప్పడు. దేవరాజ్ గూండాగిరీని ఎలాగైనా అడ్డుకోవాలని అర్జున్ అతను, అతని అనుచరులను అరెస్టు చేయిస్తాడు. ఆక్రమంలో దేవరాజ్ భార్యకు గర్భవిచ్ఛిత్తి అవుతుంది. ఈలోగా అర్జున్ తల్లి సూర్య తన బిడ్డే అని తెలుసుకుని అతని దగ్గరకు వచ్చి అర్జున్ కి ఏమీ హాని చేయవద్దని కోరుతుంది. దేవరాజ్ కోపంతో ఎలాగైనా అర్జున్ మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అందుకు సూర్య అంగీకరించడు. దేవరాజ్ అతన్ని నమ్మకాన్నే శంకించడంతో అర్జున్ తన తమ్ముడని చెబుతాడు. అర్జున్ తన తమ్ముడైనా సూర్య తన పక్కనే ఉన్నాడని తెలుసుకుని ఇద్దరూ కలిసి అర్జున్ దగ్గర లొంగిపోదామని అతని ఇంటికి వెళతారు. కానీ వారిద్దరి వల్ల తనను బదిలీ చేస్తున్నారనే కోపంతో వారిద్దరినీ ఎలాగైనా చంపేయమని పోలీసు అధికారితో చెబుతాడు. అది చట్టబద్ధంగా కుదరదని ఆ పోలీసు అధికారి సర్వారాయుడికి చెబుతాడు. ఇదంతా విన్న కళ్యాణి అర్జున్ కి సూర్య అన్న అనే నిజం చెప్పి దాన్ని ఎలాగైనా ఆపమంటుంది. కానీ సర్వారాయుడి మనిషి వచ్చి దేవరాజ్, సూర్య ఇద్దరి మీద కాల్పులు జరుపుతాడు. దేవరాజ్ మరణిస్తాడు. సూర్య గాయాలతో బయటి పడి సర్వారాయుడు, అతని అనుచరుల్ని అంతమొందించి అర్జున్ దగ్గర లొంగిపోతాడు. పోలీసులు సాక్ష్యాలు లేక సూర్యను వదిలేస్తాడు. బదిలీ అవుతూ వెళుతున్న అర్జున్, తన తల్లిని తమతో పాటు రమ్మని కోరగా ఆమె సూర్య దగ్గరే ఉంటానని చెప్పడంతో కథ ముగుస్తుంది.

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దళపతి&oldid=4701326" నుండి వెలికితీశారు