గీత (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గీతా కాదంబి
గీత
జననం (1962-07-14) 1962 జూలై 14 (వయసు 62)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1979 – 1997
2004 – ప్రస్తుతం
జీవిత భాగస్వామివాసన్ తథమ్(వి.1997)
పిల్లలు1

గీత కాదంబి (జ. 14 జూలై 1962) ఒక భారతీయ చలనచిత్ర నటి. ఈమె తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషా చిత్రాలలో నటించింది. ఈమె భైరవి అనే తమిళ చిత్రంతో సినీ రంగప్రవేశం చేసింది. ఆ సినిమాలో హీరో రజనీకాంత్‌కు చెల్లెలుగా నటించింది. అప్పటి నుండి సుమారు 200కు పైగా అన్ని దక్షిణ భారతీయ చిత్రాలలో, కొన్ని హిందీ చిత్రాలలో నటించింది.[1][2] ఈమె కొన్ని టెలివిజన్ సీరియళ్లలో కూడా నటించింది. ఈమెకు రెండు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు, ఒక కర్ణాటక రాష్ట్ర ఫిలిం అవార్డు, ఒక కేరళ రాష్ట్ర ఫిలిం అవార్డు లభించాయి.[3]

వృత్తి

[మార్చు]

గీత తన సినీరంగ ప్రవేశం 1978లో తమిళ సినిమా భైరవి చిత్రంలో టైటిల్ పాత్రను పోషించడంతో ఆరంభించింది. ఈ చిత్రంలో ఈమె రజనీకాంత్‌కు చెల్లెలుగా నటించింది. ఆ సమయంలో ఈమె 7వ తరగతి చదివే విద్యార్థిని.[4] ఈమెకు సినిమా అవకాశాలు వరుసగా రావడంతో 8వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పి సినిమానటనపై దృష్టి పెట్టింది.[5] 1986లో వచ్చిన మలయాళం సినిమా పంచాగ్నిలో ఈమె నటించిన ఇందిర పాత్ర [6] కె.అజిత అనే విప్లవకారికి నిజజీవితం ఆధారంగా మలచబడింది. ఆ పాత్రలో గీత నటన ప్రేక్షకుల ఆదరణను పొందడమే కాక ది హిందూ దినపత్రిక ఈమెను మలయాళ సినిమా హీరోయిన్లలో ఒక మైలురాయిగా అభివర్ణించింది.[4] అదే యేడు ఈమె సుఖమో దేవి, క్షమించు ఎన్నోరు వక్కు, అవనళి, గీతమ్‌ మొదలైన పలు సినిమాలలో నటించి మలయాళ సినిమాలో పాపులర్ నటిగా గుర్తించబడింది.[4] 1989లో ఒరు వదక్కన్ వీరగాథ సినిమాలో నటనకు ద్వితీయ ఉత్తమనటిగా కేరళ రాష్ట్ర పురస్కారం [4] గెలుచుకుంది. మమ్ముట్టి, మోహన్ లాల్ లతో ఈమె ఎక్కువ చిత్రాలలో జంటగా నటించింది.

కన్నడ సినిమాలలో ఈమె రాజ్‌కుమార్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, అంబరీష్ వంటి పేరుమోసిన నటుల సరసన నటించింది. ధ్రువతారె, దేవత మనుష్య, అనురాగ అరళితు, శృతి సేరిదాగ, ఆకస్మిక, ఎరడు రేఖెగళు, మరెయద మాణిక్య, మృగాలయ, వీరాధివీర, మిథిలెయ సీతెయరు, నెనపిన దొణి, భైరవి, శివ మెచ్చిద కన్నప్ప, గిరిబాలె, రామణ్ణ శామణ్ణ, గూండా గురు, నిగూఢ రహస్య, రమాపురద రావణ, ప్రచండ కుళ్ళ, హృదయ పల్లవి, దాదా, ఆరాధనె, శబరిమలే స్వామి అయ్యప్ప, అరుణరాగ మొదలైనవి ఈమె నటించిన కొన్ని కన్నడ చలనచిత్రాలు. అంబరీష్‌తో ఈమె 15పైగా సినిమాలలో జంటగా నటించింది.

1980వ దశకంలోను, 90వ దశకం మొదటిలోను ఈమె దక్షిణ భారతదేశపు అందమైన సినీతారలలో ఒకరిగా పలువురిచే గుర్తింపు పొందింది.

1997లో ఈమె వాసన్ తథమ్ అనే చార్టెడ్ అకౌంటెంట్‌ను వివాహం చేసుకుంది. వివాహం అయ్యాక కొన్నాళ్ళు ఈమె నటన వృత్తి మానివేసి భర్తతో అమెరికాలోని న్యూజెర్సీలో నివసించింది.[7] తర్వాత కొన్నేళ్లకు సినీరంగ పునఃప్రవేశం చేసి తల్లిపాత్రలు వంటి సహాయ పాత్రలలో నటిస్తున్నది.

పురస్కారాలు

[మార్చు]
కర్ణాటక రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డులు
  • ఉత్తమ నటి - అరుణ రాగ (1986)
కేరళ రాష్ట్ర ఫిల్మ్‌ అవార్డులు
  • ద్వితీయ ఉత్తమ నటి - ఒరు వదక్కన్ వీరగాధ (1989)
ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు (దక్షిణ)
  • ఉత్తమ నటి కన్నడ - శృతిసేరిదాగ[8][9]
  • ఉత్తమ నటి మలయాళం - ఆధారం
సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులు
  • ఉత్తమ నటి మలయాళం - వైశాలి (1988)

గీత నటించిన తెలుగు చిత్రాలు

[మార్చు]

మలయాళ సినిమాలు

[మార్చు]

టెలివిజన్ కార్యక్రమాలు

[మార్చు]

ఈమె సినిమాలలోనే కాక జీ తెలుగు వారి బతుకు జట్కాబండి కార్యక్రమంలోనూ, ఈటీవీలో తేనెమనసులు అనే ధారావాహికలోను పాల్గొనింది.

మూలాలు

[మార్చు]
  1. "Geetha Profile". Jointscene. Archived from the original on 11 July 2010. Retrieved 14 February 2020.
  2. "Geetha is to play Vijay's mother". IndiaGlitz. 18 మే 2005. Archived from the original on 6 జూన్ 2008. Retrieved 5 మే 2010.
  3. M., Athira (26 November 2015). "Playing women of substance". The Hindu. Retrieved 21 July 2019.
  4. 4.0 4.1 4.2 4.3 Kumar, P. K. Ajith (3 అక్టోబరు 2013). "Evergreen Acts". Archived from the original on 21 మే 2014. Retrieved 9 మే 2018 – via www.thehindu.com.
  5. "എന്റെ സിനിമകള് ഭര്ത്താവ്‌ കാണാറില്ല". mangalam.com. Archived from the original on 28 ఆగస్టు 2015. Retrieved 24 ఆగస్టు 2015.
  6. "Manorama Online Latest Malayalam News. Breaking News Events. News Updates from Kerala India". manoramaonline.com. Archived from the original on 19 March 2014. Retrieved 9 May 2018.
  7. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-30. Retrieved 2020-02-14.
  8. "35th Annual Filmfare Awards South Winners : Santosh : Free Download &…". archive.org. 5 February 2017. Archived from the original on 5 February 2017. Retrieved 9 May 2018.
  9. "Geetha Won Filmfare Best Kannada Actress Award Special : Free Downloa…". archive.org. 6 February 2017. Archived from the original on 6 February 2017. Retrieved 9 May 2018.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గీత_(నటి)&oldid=4356488" నుండి వెలికితీశారు