Jump to content

నిప్పురవ్వ

వికీపీడియా నుండి
నిప్పురవ్వ
దర్శకత్వంఎ.కోదండరామి రెడ్డి
నిర్మాతఎం. వి. శ్రీనివాస ప్రసాద్
తారాగణంనందమూరి బాలకృష్ణ
విజయశాంతి
నిళల్ గళ్ రవి
శోభన
సంగీతంబప్పిలహరి
రాజ్ - కోటి (రండి కదలి రండి పాటకు)
ఎ.ఆర్.రెహమాన్ (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
సెప్టెంబరు 3, 1993 (1993-09-03)
భాషతెలుగు

నిప్పురవ్వ ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో 1993లో విడుదలైన చిత్రం. ఇందులో నందమూరి బాలకృష్ణ, విజయశాంతి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాను ఎం. వి. శ్రీనివాస ప్రసాద్ యువరత్న ఆర్ట్స్ పతాకంపై నిర్మించాడు. బప్పీలహరి పాటలు స్వరపరచగా, ఎ. ఆర్. రెహమాన్ నేపథ్య సంగీతాన్ని సమకూర్చాడు. రాజ్ కోటి కూడా ఒక పాట స్వరపరిచారు.

సింగరేణి బొగ్గు కార్మికుల నేపథ్యంలో ఈ సినిమా తీశారు. చిత్రీకరణలో ఒక ప్రమాదం జరిగింది. దీంతో ఈ చిత్రం విడుదల వాయిదాపడి బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు చిత్రం తో సమానంగా ఒకే రోజు విడుదలై పోటీ పడాల్సి వచ్చింది

నటవర్గం

[మార్చు]

విడుదల

[మార్చు]

ఈ సినిమా 1993, సెప్టెంబరు 3 న విడుదలైంది. ఇదే రోజున బాలకృష్ణ నటించిన బంగారు బుల్లోడు సినిమా కూడా విడుదలయ్యింది. ఈ రెండింటిలో నిప్పురవ్వ సరిగా ఆడలేదు కానీ బంగారు బుల్లోడు మాత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచింది. నిప్పురవ్వ సినిమాను చిత్రీకరిస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. దాంతో ఈ సినిమా విడుదలను నిలుపు చేయాలని కొంతమంది కోర్టుకెక్కారు. అందుకని ఈ చిత్రం విడుదల ఆలస్యమయ్యి బంగారు బుల్లోడు చిత్రంతో సమానంగా ఒకే రోజు విడుదలై పొటీ పడాల్సి వచ్చింది.[1]

సాంకేతికవర్గం

[మార్చు]

సంగీతం

[మార్చు]

ఈ చిత్రానికి బప్పీలహరి సంగీత దర్శకత్వం వహించాడు. రండి కదలిరండి అనే ఒక్క పాట మాత్రం రాజ్ కోటి స్వరపరిచారు. ఎ. ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించాడు. ఇలా ఒకే సినిమాకు నలుగురు సంగీత దర్శకులు కలిసి పనిచేయడం అరుదైన సంఘటన.[1]

టైమ్ ఎంత , రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

కాముని పట్నం , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

హాయ్ షబ్బ, రచన :సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

రావయ్యా రావయ్యా, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం . ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

గులేబకావలి కావాలి కదో , రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,కె ఎస్ చిత్ర

రండి కదలిరండి , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "బాలయ్య అరుదైన రికార్డుకు 25 ఏళ్లు". News18 Telugu. 2018-09-03. Archived from the original on 2020-07-10. Retrieved 2020-07-10.

బయటి లంకెలు

[మార్చు]