వెంకీ మామ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకీ మామ
వెంకీ మామ సినిమా పోస్టర్
దర్శకత్వంకె.ఎస్.రవీంద్ర
రచనజనార్ధన మహర్షి
కె.ఎస్.రవీంద్ర
కోన వెంకట్
నిర్మాతసురేష్ బాబు
టి.జి. విశ్వ ప్రసాద్
వివేక్ కూచిభొట్ల
తారాగణంవెంకటేష్
నాగ చైతన్య
రాశీ ఖన్నా
పాయల్ రాజ్‌పుత్
ఛాయాగ్రహణంప్రసాద్ మూరెళ్ళ
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
విడుదల తేదీ
13 డిసెంబరు 2019 (2019-12-13)
దేశంభారతదేశం
భాషతెలుగు
బాక్సాఫీసు45.5 crore (US$5.7 million)(తొలి 3 రోజులు)[1]

వెంకీ మామ 2019, డిసెంబరు 13న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. సురేష్ ప్రొడక్షన్స్[2] పతాకంపై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి కె.ఎస్. రవీంద్ర దర్శకత్వం వహించాడు.[3][4] వెంకటేష్, నాగ చైతన్య, రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందించాడు.[5] ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది.[6]

పేరుమోసిన జ్యోతిష్యుడు రామనారాయణ (నాజర్‌) కూతురు జాతకాలతో సంబంధం లేకుండా ప్రేమ వివాహం చేసుకుంటుంది. కానీ, ఆ దంపతులిద్దరు రోడ్డు యాక్సిడెంట్‌లో చనిపోతారు. జాతకం దృష్ట్యా వారి ఏడాది కొడుకును చేరదీయడానికి రామనారాయణ నిరాకరించగా, జాతకాల కన్నా ప్రేమ గొప్పదని భావించే మేనమామ వెంకటరత్నం (వెంకటేశ్‌) ఆ చిన్నారిని చేరదీసి, తాను పెళ్లికూడా చేసుకోకుండా పెంచి పెద్ద చేస్తాడు. మరోవైపు మామ కోసం లండన్‌లో మంచి ఉద్యోగాన్ని, ఆఖరికీ ప్రేమను కూడా తిరస్కరించడానికి కార్తీక్‌ (నాగచైతన్య) సిద్ధపడతాడు. ఈ క్రమంలో మామకు పెళ్లి చేయడానికి కార్తీక్‌, కార్తీక్‌ ప్రేమించిన అమ్మాయిని మళ్లీ కలుపడానికి వెంకటరత్నం ప్రయత్నిస్తారు. కానీ, కార్తీక్‌ జాతక ప్రభావం వెంకటరత్నాన్ని వెంటాడుతుంది. ఈ క్రమంలో మామకు దూరంగా వెళ్లిపోయిన కార్తీక్‌ ఆర్మీలో మేజర్‌గా చేరుతాడు. తనకు దూరంగా ఉన్న కార్తీక్‌ను వెతుక్కుంటూ వెంకటరత్నం వెలుతాడు. అక్కడ ఏం జరిగిందన్నది ఇది మిగతా కథ.

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

మహేష్ బాబుతో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, రామ్ తో మసాలా, పవన్ కళ్యాణ్ తో గోపాల గోపాల, వరుణ్ తేజ్ తో F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ వంటి మల్టీస్టారర్ సినిమాలు తీసిన వెంకటేష్, ఈసారి తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ఈ మల్టీస్టారర్ సినిమాలో నటించాడు. ఈ సినిమాకంటే ముందు నాగచైతన్య నటించిన ప్రేమమ్ సినిమాలో వెంకీ అతిథి పాత్ర చేయగా, మొదటిసారిగా ఈసినిమాలో ఇద్దరూ కలిసి పూర్తి నిడివి గల పాత్రలు చేసారు.[7]

హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో సినీ దర్శకుడు వి.వి. వినాయక్ అతిథిగా ఈ చిత్రం అధికారికంగా ప్రారంభించబడింది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.[8]

నటీనటుల ఎంపిక

[మార్చు]

వెంకటేష్‌కు జోడిగా శ్రియా సరన్,[9] నాగచైతన్యకు జోడిగా రకుల్ ప్రీత్ సింగ్[10] నటించబోతున్నారని మొదట ప్రకటించారు. కానీ, ఇద్దరూ హీరోయిన్స్ మార్చబడ్డారు. రకుల్ ప్రీత్ సింగ్ స్థానంలో నభా నటేష్ నటించబోతుందని వార్తలు వచ్చాయి.[11] ఆఖరికి, ఈ చిత్రంలో హీరోయిన్స్ గా రాశీ ఖన్నా,[12][13] పాయల్ రాజ్‌పుత్[14] నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది.

చిత్రీకరణ

[మార్చు]

2019, ఫిబ్రవరి 24న గోదావరి నది[15] తీరంలో చిత్రీకరణ ప్రారంభమై, రాజమండ్రిలో మొదటి షెడ్యూల్ పూర్తయింది.[16] 2019, ఏప్రిల్ 8న హైదరాబాదులో రెండవ షెడ్యూల్ ప్రారంభమయింది.[17] హైదరాబాద్‌లో రెండవ షెడ్యూల్‌ను పూర్తిచేసిన తరువాత 2019, జూన్ 13[18] వరకు దాదాపు ఒక నెలరోజులపాటు కాశ్మీర్‌[19] షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి. కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసిన తరువాత బృందం విశాఖపట్నంకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు చిత్రీకరించింది.[20] అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో వెంకటేష్, పాయల్ రాజ్‌పుత్‌లతో పాట చిత్రీకరణ జరిగింది.[21] పోరాట సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడు వెంకటేష్ గాయపడగా, రెండు వారాలు విశ్రాంతి తీసుకున్నాడు.[22]

పాటలు

[మార్చు]

ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.[23] 2019, నవంబరు 7న ఈ చిత్రంలోని వెంకీ మామ (మొదటి పాట) విడుదల చేయబడింది. శ్రీకృష్ణ, మోహన భోగరాజు పాడిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాశాడు. మామ (వెంకటేష్), అతని మేనల్లుడు (చైతన్య)ల మధ్య ఉన్న బంధాన్ని ఈ పాట తెలియజేస్తుంది.[24] శ్రీమణి రాయగా పృథ్వీ చంద్ర, ఎస్. తమన్ పాడిన ఎన్నేళ్ళకో (రెండవ పాట) సంగీత దర్శకుడు ఎస్. తమన్ పుట్టినరోజు సందర్భంగా 2019, నవంబరు 19న విడుదలైంది.[25] కాసర్ల శ్యామ్ రాయగా, అదితి భావరాజు, రమ్య బెహరా, సింహా, హనుమాన్ పాడిన కోకా కోలా పెప్సి (మూడవ పాట) 2019, డిసెంబరు 4న విడుదల చేయబడింది.[26]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."వెంకీ మామ (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిశ్రీకృష్ణ, మోహన భోగరాజు4:15
2."ఎన్నేళ్ళకో (రచన: శ్రీమణి)"శ్రీమణిపృథ్వీ చంద్ర, ఎస్. తమన్3:36
3."కోకా కోలా పెప్సి (రచన: కాసర్ల శ్యామ్‌)"కాసర్ల శ్యామ్‌సింహా, రమ్య బెహరా, అదితి భావరాజు, హనుమాన్3:41
4."నువ్వు నేను (రచన: శ్రీమణి)"శ్రీమణిఅనురాగ్ కులకర్ణి, నందిత4:02
మొత్తం నిడివి:15:34

విడుదల

[మార్చు]

మొదటగా ఈ చిత్రాన్ని 2019, అక్టోబరు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు.[27] 2019, డిసెంబరు 7న ఈ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికేట్ వచ్చింది.[28] వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా 2019, డిసెంబరు 13న విడుదలచేశారు.[29]

మార్కెటింగ్

[మార్చు]

2019, ఏప్రిల్ 6న ఉగాది సందర్భంగా వెంకటేష్,నాగచైతన్యల ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో ఇద్దరూ గ్రామీణ నేపథ్యంలో ముఖం మీద చిరునవ్వుతో వరి సంచులపై కూర్చున్న ఫోటో ఉంది.[17] 2019, ఆగస్టు 1న దర్శకుడు కె.ఎస్. రవీంద్ర పుట్టినరోజు సందర్భంగా ప్రీ-టీజర్ విడుదలైంది.[30] 2019, సెప్టెంబరు 2న వినాయక చవితి సందర్భంగా పండుగ పోస్టర్ విడుదలైంది. ఇందులో వెంకటేష్, నాగచైతన్యలు సాంప్రదాయ దక్షిణ భారత దుస్తులైన పంచకట్టులో ఉన్నారు.[31] 2019, అక్టోబరు 7న ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలైంది. ఇందులో వెంకటేష్, నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్‌పుత్ ఒక ట్రాక్టర్ పై కూర్చునివున్న ఫోటో ఉంది. ఇందులో చిత్ర విడుదల తేదీని ప్రకటించారు.[32] 2019, అక్టోబరు 8న విజయదశమి సందర్భంగా మొదటి టీజర్ విడుదలై,[33] మంచి స్పందన అందుకుంది.[34] గడ్డంతో వెంకటేష్, పారామిలట్రీ దుస్తుల్లో నాగచైతన్య ఉన్న పోస్టర్ 2019, అక్టోబరు 26న దీపావళి సందర్భంగా విడుదలైంది.[35]

2019, నవంబరు 23న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా అల్లుడు పుట్టినరోజు టీజర్ విడుదలైంది, దీనిలో చైతన్య పాత్ర సరదాగా ప్రేమించే బాలుడిగా, ఆర్మీ ఆఫీసర్‌గా ఉంది.[36] 2019, నవంబరు 30న రాశీఖన్నా పుట్టినరోజు సందర్భంగా రాశీఖన్నా పుట్టినరోజు టీజర్ విడుదల చేయబడింది.[37] 2019, డిసెంబరు 5న పాయల్ రాజ్‌పుత్ పుట్టినరోజు సందర్భంగా విషింగ్ అవర్ టీచర్ (పాయల్ రాజ్‌పుత్) ఏ వెరీ హ్యాపీ బర్త్డే అంటూ ఒక పోస్టర్ విడుదల చేయబడింది.[38]

2019, డిసెంబరు 4న పత్రికా సమావేశం జరిగింది. ఇందులో చిత్రబృందం పాల్గొన్నారు.[39] 2019, డిసెంబరు 7న ఖమ్మంలో చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది.[40] దీనికి చిత్రబృందం మొత్తం హాజరయ్యారు.[41] అదే రోజున చిత్రం ట్రైలర్ కూడా విడుదలైంది.[42] 2019, డిసెంబరు 10న జెఆర్‌సి కన్వెన్షన్స్‌లో వెంకీ మామ మ్యూజికల్ నైట్ ఈవెంట్ జరిగింది, పూర్తి సౌండ్‌ట్రాక్ ఆల్బమ్ విడుదలై ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, దీనికి సినీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అతిథిగా వచ్చాడు.[43]

స్పందన

[మార్చు]

బాక్సాఫీస్

[మార్చు]

తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 16.5కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది.[44][45] రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా 14కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది.[46] మూడోరోజు ప్రపంచవ్యాప్తంగా 14.5కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది.[1] మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా 45కోట్ల గ్రాస్ కలెక్షన్ సంపాదించింది.[47]

రేటింగ్

[మార్చు]

ప్రేక్షకులు, విమర్శకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది.[48]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Venky Mama box office collection: Venkatesh-Naga Chaitanya film earns Rs 45 crore worldwide". The Indian Express. 16 December 2019. Retrieved 16 December 2019.
  2. ""Venky Mama" Speculations Are Fake #Suresh Production Official". Telugu Bullet. Retrieved 13 December 2019.
  3. "Venkatesh-Naga Chaitanya film to be titled 'Venky Mama'?". The Times of India. Retrieved 13 December 2019.
  4. "Bobby to direct Venky and Chai, 'Venky Mama' as Title". AP NEWS CORNER. Archived from the original on 13 December 2019. Retrieved 13 December 2019.
  5. "Finally! Venky Mama gets a release date, to hit screens on Venkatesh's birthday". International Business Times. 3 December 2019. Retrieved 16 December 2019.
  6. "Venky Mama Review: Venkatesh's Movie Receives Mixed Reviews From Audiences". Republic World. 13 December 2019. Retrieved 13 December 2019.
  7. "Venky Mama Preview: Venkatesh-Naga Chaitanya together on-screen for the first time". Times of India. 13 December 2019. Retrieved 13 December 2019.
  8. "Venkatesh, Naga Chaitanya's multi-starrer film launched in style at Ramanaidu Studios". ibtimes. Retrieved 13 December 2019.
  9. "Venky Mama: Venkatesh, Naga Chaitanya's Telugu comedy to hit floors in February". timesnownews. Retrieved 13 December 2019.
  10. "Rakul Preet to join 'Venky Mama' sets from February". thenewsminute. Retrieved 13 December 2019.
  11. "'Venky Mama' starts rolling! Did Rakul Preet Singh get replaced?". timesofindia. Retrieved 13 December 2019.
  12. "Raashi Khanna Photos From Venky Mama Movie Musical Night". RitzyStar. Retrieved 15 December 2019.
  13. "Raashi roped in for Venky Mama". Telangana Today. Retrieved 13 December 2019.
  14. "Payal Rajput confirms being part of 'Venky Mama'". zeenews. Retrieved 13 December 2019.
  15. "Venky Mama shoot begins on the banks of Godavari river". timesofindia. Retrieved 13 December 2019.
  16. "Venky Mama to take off in Rajahmundry". thehansindia. Retrieved 13 December 2019.
  17. 17.0 17.1 "Victory Venkatesh and Naga Chaitanya's 'Venky Mama' First Look". thehansindia. Retrieved 13 December 2019.
  18. "Venkatesh Daggubati to wrap up Kashmir schedule of Venky Mama soon". zeenews. Retrieved 13 December 2019.
  19. "Venkatesh and Chaitanya fly to Kashmir for Venky Mama". zeenews. Retrieved 13 December 2019.
  20. "'Venky Mama' team to begin shooting in Visakhapatnam". thenewsminute. Retrieved 13 December 2019.
  21. "Venky Mama: Venkatesh, Paayal Rajput shoot for a romantic number in the film". timesofindia. Retrieved 13 December 2019.
  22. "Venkatesh gets injured on the sets of 'Venky Mama' while shooting an action sequence". timesofindia. Retrieved 13 December 2019.
  23. "Venky Mama is a very emotional film: S Thaman". The Indian Express. 9 December 2019. Retrieved 13 December 2019.
  24. "Venky Mama Title Song: Soothing number showcasing the deep bond between a uncle and his nephew". Times of India. 7 November 2019. Retrieved 13 December 2019.
  25. "Yennallako from Venky Mama: Venkatesh and Payal Rajput nail the retro look in the peppy number". Times of India. 16 November 2019. Retrieved 13 December 2019.
  26. "Venky Mama New Lyrical Video: Mama, Alludu Sexy". GreatAndhra. 4 December 2019. Retrieved 13 December 2019.
  27. "'Venky Mama's' release postponed to November to avoid clash with 'Sye Raa'". The News Minute. 23 August 2019. Retrieved 16 December 2019.
  28. "Venky Mama Censor Inside report info gets UA Certificate". Tollywood.NET. 7 December 2019. Retrieved 16 December 2019.
  29. "Confirmed: 'Venky Mama' to hit the theaters on Venkatesh's birthday (December 13)". Times of India. 2 December 2019. Retrieved 13 December 2019.
  30. "'Venky Mama' pre-teaser released on director Bobby's birthday!". Times of India. Retrieved 13 December 2019.
  31. "Venky Mama Festival Poster: Venkatesh and Naga Chaitanya look blazing in 'Pancha Kattu'". Times of India. Retrieved 13 December 2019.
  32. "Venky Mama first look: Venkatesh, Naga Chaitanya feature alongside Raashi Khanna, Paayal Rajput". Firstpost. Retrieved 13 December 2019.
  33. "'Venky Mama' first glimpse: Shows off Venkatesh & Naga Chaitanya's mama-alludu chemistry". Times of India. Retrieved 13 December 2019.
  34. "'Venky Mama' gets good response". TheHansIndia. Retrieved 13 December 2019.
  35. "Venky Mama poster raises the curiosity". TheHansIndia. Retrieved 13 December 2019.
  36. "Venky Mama teaser: Naga Chaitanya's character will remind you of Vicky Kaushal in Uri". The Indian Express. 24 November 2019. Retrieved 13 December 2019.
  37. "Watch: Chay's Proposal To Birthday Girl". Great Andhra. 30 November 2019. Retrieved 13 December 2019.
  38. "Happy Birthday Paayal Rajput: Makers of Venky Mama wish the actress by unveiling her beautiful poster". Times of India. 5 December 2019. Retrieved 13 December 2019.
  39. "'Venky Mama' press meet: Victory Venkatesh's hilarious speech is the major highlight". Times of India. 4 December 2019. Retrieved 13 December 2019.
  40. "Venky Mama pre-release event". Times of India. 5 December 2019. Retrieved 13 December 2019.
  41. "Inside Venky Mama pre-release event". The Indian Express. 8 December 2019. Retrieved 13 December 2019.
  42. "[VIDEO] Venky Mama trailer: Venkatesh and Naga Chaitanya's action entertainer looks promising". Times Now. 7 December 2019. Retrieved 13 December 2019.
  43. "Venky Mama Musical Night function". Idlebrain.com. Retrieved 13 December 2019.
  44. "Venky Mama gets off to a flying start at the box-office; mints Rs 16.5 crore on Day 1". The Times of India. 14 December 2019. Retrieved 15 December 2019.
  45. Suresh Productions [@SureshProdns] (13 December 2019). "Day 1 is HUGE 🤙🏻🤙🏻 🔥🔥 #VenkyMama #BlockbusterVenkyMama" (Tweet). Retrieved 15 December 2019 – via Twitter.
  46. "Venky Mama box office collection: Venkatesh and Naga Chaitanya's film earns Rs 30.5 crore worldwide". The Indian Express. 15 December 2019. Retrieved 15 December 2019.
  47. "Venky Mama box-office: Venkatesh starrer mints Rs 45 cr in opening weekend". Hindustan Times. 16 December 2019. Retrieved 16 December 2019.
  48. "Venky Mama Twitter review: Naga Chaitanya, Venkatesh Daggubati's comedy drama gets a mixed response". Times Now. 13 December 2019. Retrieved 13 December 2019.
  49. "Venkatesh and Naga Chaitanya's Venky Mama Movie Review & Rating". The Hans India. 13 December 2019. Retrieved 13 December 2019.3/5 stars
  50. "వెంకీమామ మూవీ రివ్యూ". Samayam. 13 December 2019. Retrieved 13 December 2019.3.5/5 stars
  51. "Venky Mama Movie Review : Mama-Alludu combo let down by a stereotypical plot". Times of India. 13 December 2019. Retrieved 13 December 2019.2.5/5 stars
  52. "Venky Mama Movie Review: Venkatesh and Naga Chaitanya film is a colossal disappointment". India Today. 13 December 2019. Retrieved 13 December 2019.2.5/5 stars
  53. "'Venky Mama' review: Venkatesh-Naga Chaitanya film has no logic but is a crowd-pleaser". The News Minute. 13 December 2019. Retrieved 13 December 2019.2/5 stars
  54. "Venky Mama movie review: Venkatesh, Naga Chaitanya's chemistry is heartwarming in an otherwise bland drama". Firstpost. 13 December 2019. Retrieved 13 December 2019.2.5/5 stars
  55. "Venky Mama Movie Review". Tollywood.Net. 13 December 2019. Retrieved 13 December 2019.3/5 stars
  56. "Venky Mama Review: Regular Drama". GreatAndhra. 13 December 2019. Retrieved 13 December 2019.2.5/5 stars

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వెంకీ_మామ&oldid=4286063" నుండి వెలికితీశారు