Jump to content

F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్

వికీపీడియా నుండి
F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్
థియేట్రికల్ రిలీజ్ పోస్టర్
దర్శకత్వంఅనిల్ రావిపూడి
రచనఅనిల్ రావిపూడి
నిర్మాతదిల్ రాజు
తారాగణంవెంకటేష్
వరుణ్ తేజ్
తమన్నా భాటియా
మెహ్రీన్ పిర్జాదా
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుబిక్కిన తమ్మిరాజు
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థ
శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్
విడుదల తేదీ
జనవరి 12, 2019 (2019-01-12)
దేశంభారతదేశం
భాషతెలుగు భాష

F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్ 2019 జనవరి 12 న సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన తెలుగు సినిమా. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో[1] వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా, గద్దె రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రధారులు.[2][3][4]

వెంకీ ఎమ్మెల్యే అంజిరెడ్డి దగ్గర వ్యక్తిగత సహాయకుడిగా పని చేస్తుంటాడు. ఒక వివాహ సంబంధాల వేదిక ద్వారా వెంకీకి సాఫ్టువేరు ఇంజనీరుగా పనిచేసే హారికతో వివాహం అవుతుంది. బోర‌బండ‌కు చెందిన వ‌రుణ్ యాద‌వ్‌ కు హారిక చెల్లెలు హ‌నీతో నిశ్చితార్థం అవుతుంది. పెళ్లి త‌ర్వాత హారిక‌, ఆమె త‌ల్లి చేసే ప‌నుల వ‌ల్ల వెంకీకి నిరాశ పెరిగిపోతుంటుంది. వ‌రుణ్‌ను క‌లిసిన త‌ర్వాత వెంకీ పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని స‌ల‌హా ఇస్తాడు. కానీ వెంకీ మాట‌ల‌ను వ‌రుణ్ ప‌ట్టించుకోడు. ఇంటి ప‌క్క‌నుండే వ్య‌క్తి (గద్దె రాజేంద్ర ప్రసాద్) స‌ల‌హాతో ముగ్గురు క‌లిసి యూరప్ విహార యాత్రకు వెళ‌తారు. విష‌యం తెలుసుకున్న హారిక‌, హానీ కూడా యూరప్‌కి బ‌య‌లుదేరుతారు. అంద‌రూ దొరస్వామినాయుడు ఇంట్లో చేరుతారు.[5]

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • ఎంతో ఫన్ , రచన: శ్రీమణి, గానం.దేవీశ్రీ ప్రసాద్
  • హానీ ఈజీ ద బెస్ట్, రచన: శ్రీమణి, గానం. హరిహర సుదన్
  • ధన్ ధన్ , రచన: కాసర్ల శ్యామ్, గానం.హేమచంద్ర, శ్రావణ భార్గవి
  • గిర్రా గిర్రా, రచన: బాలాజీ, గానం. సాగర్, ఎం ఎం మనసి
  • డింగ్ డాంగ్, రచన: కాసర్ల శ్యామ్, గానం.రాహూల్ సింప్లీ గంజ్, మాలతి
  • రేచ్చి పోదాం, రచన: కాసర్ల శ్యామ్, గానం . డేవిడ్ సిమోన్.

సాంకేతికవర్గం

[మార్చు]
  • స‌మ‌ర్ప‌ణ‌: దిల్‌రాజు
  • నిర్మాణ సంస్థ‌: శ‌్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌
  • సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
  • ఛాయాగ్ర‌హ‌ణం: స‌మీర్ రెడ్డి
  • కూర్పు: త‌మ్మిరాజు
  • నిర్మాత‌లు: శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌
  • ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: అనీల్ రావిపూడి

మూలాలు

[మార్చు]
  1. "F2 (Director)". PINKVILLA.
  2. "F2 (Producer)". The Times of India.
  3. "F2 (Male leads)". hindustan times.
  4. "F2 (Female leads)". News-X. Archived from the original on 2018-07-13. Retrieved 2019-01-06.
  5. https://telugu.greatandhra.com/movies/reviews/cinema-review-f2-96385.html

బయటి లంకెలు

[మార్చు]