అనిల్ రావిపూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనిల్ రావిపూడి
జననంచిలుకూరువారి పాలెం, ప్రకాశం జిల్లా
చదువుఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
విద్యాసంస్థలువిజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాల
వృత్తిసినీ రచయిత, దర్శకుడు
బంధువులుఅరుణ్ ప్రసాద్ (బాబాయి)

అనిల్ రావిపూడి ఒక తెలుగు సినీ రచయిత, దర్శకుడు.[1][2] పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[3] అంతకు మునుపు కందిరీగ, మసాలా, ఆగడు మొదలైన సినిమాలకు రచయితగా పనిచేశాడు.

బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]

అనిల్ స్వస్థలం ప్రకాశం జిల్లా, చిలుకూరువారి పాలెం. అతని చిన్నతనంలో తల్లిదండ్రులు మహబూబ్ నగర్ జిల్లా, అమరవాయి ప్రాంతానికి వచ్చి వ్యవసాయం చేసేవారు. [2] అతని ప్రాథమిక పాఠశాల చదువు మహబూబ్ నగర్ లో సాగింది. చిన్నప్పటి నుంచే గ్రామంలో ఉండే టెంటు హాలులో కూర్చుని సినిమాలు చూసే అలవాటు కలిగింది. తండ్రికి ఆర్టీసీలో డ్రైవరుగా ఉద్యోగం వచ్చింది. తర్వాత వారి కుటుంబం అద్దంకికి తరలి వచ్చింది. పదో తరగతి దాకా అద్దంకిలో తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరులో చదివాడు. తర్వాత వడ్లమూడి లోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చదివాడు.

సినిమాలు[మార్చు]

ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యుల అనుమతితో సినీరంగంవైపు వచ్చాడు. ఇతని బాబాయి అరుణ్ ప్రసాద్ కూడా సినీ దర్శకుడే. పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు చిత్ర దర్శకుడు అతను. అతని దగ్గరే దర్శకత్వ విభాగంలో చేరాడు.


!సంవత్సరం !చలన చిత్రం !పాత్ర |- |2008 |శౌర్యం |సంభాషణ రచయిత |- |2009 |శంఖం |సంభాషణ రచయిత |- |2011 |కందిరీగ |కథ/ సంభాషణ రచయిత |- |2012 |దరువు |సంభాషణ రచయిత |- |2012 |సుడిగాడు |సంభాషణ రచయిత |- |2013 |మసాలా |సంభాషణ రచయిత |- |2014 |ఆగడు |కథ/ సంభాషణ రచయిత |- |2015 |పండగ చేస్కో |కథ రచయిత |- |}

దర్శకుడిగా[మార్చు]

దర్శకుడిగా అనిల్ తొలి సినిమా కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా వచ్చిన పటాస్. రెండో చిత్రం సాయి ధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్. రవితేజ కథానాయకుడిగా నటించిన రాజా ది గ్రేట్ 2017 లో విడుదలైంది.

సంవత్సరం చలన చిత్రం తారాగణం
2018 ఎఫ్2 - ఫన్ & ఫ్రస్ట్రేషన్ దగ్గుబాటి వెంకటేష్, తమన్నా, వరుణ్ తేజ్, మెహ్రీన్ పిర్జాదా
2017 రాజా ది గ్రేట్ రవితేజ , మెహ్రీన్ పిర్జాదా
2016 సుప్రీమ్. సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా
2015 పటాస్ కళ్యాణ్ రామ్, శృతి సోది
2020 సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు, రష్మిక మందన్న

మూలాలు[మార్చు]

  1. కవిరాయని, సురేష్. "I was addicted to cinema: Anil Ravipudi". deccanchronicle.com. దక్కన్ క్రానికల్. Retrieved 22 October 2017.
  2. 2.0 2.1 "ఆ కథ పట్టుకుని రెండేళ్లు తిరిగా!". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 22 October 2017. Retrieved 22 October 2017.
  3. వై, సునీత చౌదరి. "Anil Ravipudi's Raja The Great: Not blind to innovation". thehindu.com. ది హిందు. Retrieved 23 October 2017.

బయట లంకెలు[మార్చు]