Jump to content

చిలుకూరివారిపాలెం

వికీపీడియా నుండి

చిలుకూరివారిపాలెం, బాపట్ల జిల్లా, యద్దనపూడి మండలానికి చెందిన గ్రామం.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

త్రాగునీటి చెరువు

[మార్చు]

ఈ చెరువు వేసవిలో ప్రస్తుతం ఎండిపోయి, కొన్ని నెలలుగా త్రాగునీటికి గ్రామస్థులు పలు బాధలు పడుచున్నారు. ఈ పరిస్థితులలో, 2017, మే- 26 తేది రాత్రి యద్దనపూడి మండలంలో వర్షం కురిసినది. ఈ వర్షపునీరు ఉధృతంగా ప్రవహించుచూ, ఈ గ్రామం దగ్గరలోని తొండాగు ద్వారా వృధాగా బయటకు పోవడం చూసిన ఈ గ్రామస్థులు, ఆ వాగు నీటికి అడ్డు కట్ట వేసి, వృధాగా పోవుచున్న ఆ నీటిని, ఓ ట్రాక్టరుకు ఏర్పాటు చేసిన పంపు ద్వారా గ్రామంలోని చెరువులోనికి మళ్ళించి, సఫలీకృతులైనారు. ఈ గ్రామస్థులు ఈ విధంగా ముందుచూపుతో వ్యవహరించి, కొన్ని గంటల వ్యవధిలోనే వృధాగా పోవుచున్న వాగునీటిని తమ అవసరాలు తీర్చేటందుకు చెరువులోనికి మళ్ళించడాన్ని పలువురు కొనియాడినారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

చిలుకూరివారిపాలెం, యద్దనపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]