Jump to content

సరిలేరు నీకెవ్వరు

వికీపీడియా నుండి
సరిలేరు నీకెవ్వరు
దర్శకత్వంఅనిల్ రావిపూడి
రచనఅనిల్ రావిపూడి
నిర్మాత
తారాగణం
ఛాయాగ్రహణంరత్నవేలు
కూర్పుబిక్కిన తమ్మిరాజు
సంగీతందేవిశ్రీ ప్రసాద్
నిర్మాణ
సంస్థలు
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌,
ఎకె ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
11 జనవరి 2020 (2020-01-11)
సినిమా నిడివి
169 ని[1]
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్750 million[2]
బాక్సాఫీసు750 billion

సరిలేరు నీకెవ్వరు 2020 లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. ఇందులో మహేష్ బాబు, విజయశాంతి, రష్మికా మందన్న, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎ. కే ఎంటర్టైన్మెంట్స్ తరపున దిల్ రాజు, మహేష్ బాబు, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు. 2020 జనవరి 11 న సంక్రాంతికి ముందు ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది.[3]

సరిలేరు నీకెవ్వరు సినిమాలోని దృశ్యం

కర్నూలు వైద్యకళాశాలలో ప్రొఫెసరుగా పనిచేస్తుంటుంది భారతి. అవతలి వారు ఎంత శక్తివంతులైనా నిజానికి నిర్భయంగా చెప్పగల వ్యక్తి. ఆమె కూతురికి వివాహం నిర్ణయిస్తుంది. ఆమె భర్త, పెద్ద కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించినా ఆమె చిన్న కొడుకు అజయ్ కూడా సైన్యంలో చేరుస్తుంది. మేజర్ అజయ్ కృష్ణ భారత సరిహద్దులో సైన్యంలో మేజర్ గా పనిచేస్తుంటాడు. భారతి కొడుకు అజయ్ తన చెల్లెలు వివాహం కోసం వెళ్ళాలనుకుంటాడు. మధ్యలో ఒకానొక ఉగ్రవాద ఆపరేషన్ కోసం వెళ్ళిన అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళిపోతాడు. సైన్యాధికారి మానవతా ధృక్పథంతో అజయ్ కృష్ణను సైన్యం తరఫున భారతి కుటుంబానికి వెళ్ళి సాయం చేయమంటాడు. అతనికి తోడుగా మరో సైనికుడు ప్రసాద్ కూడా వెళతాడు. దారిలో వీరికి సంస్కృతి అనే అల్లరిపిల్ల తారసపడుతుంది. పెళ్లి విషయంలో సహాయం చెయ్యడానికి వచ్చిన హీరో భారతి విలన్ చేతిలో చిక్కుకుని ఇబ్బంది పడుతుంది, అని తెలుసుకొని వారికి అండగా నిలబడతాడు.విలన్ రాజకీయ నాయకుడు అతను భారతి కుటుంబాన్ని వెంబడిస్తూ ఉంటాడు, , దానిని హీరో అడ్డుకుంటాడు. విలన్ నేరాల ఆధారాలను పోలీసులకు ఇవ్వకుండా తనతో పాటు ఆర్మీ కి తీసుకువెళ్ళి అసలైన దేశభక్తి,క్రమశిక్షణ విలువలు తెలియచేస్తాడు. విలన్ తన నేర వైఖరిని మార్చుకొని మంచిగా నడవడంతో కథ సుఖంతం అవుతుంది.

తారాగణం

[మార్చు]

సంగీతం

[మార్చు]
క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "మైండ్ బ్లాక్"  బ్లేజ్, రెనినా రెడ్డి 4:23
2. "సూర్యుడివో చంద్రుడివో"  బి ప్రాక్ 4:32
3. "హి ఈజ్ సో క్యూట్"  మధుప్రియ 3:30
4. "సరిలేరు నీకెవ్వరు"  శంకర్ మహదేవన్ 4:27
5. "డాంగ్ డాంగ్"  నకాష్ అజీజ్, లవిటా లోబో 4:14
21:06

పురస్కారాలు

[మార్చు]

సైమా అవార్డులు

[మార్చు]

20201 సైమా అవార్డులు

  1. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (ఆర్. రత్నవేలు)

మూలాలు

[మార్చు]
  1. "The Censor Certificate of 'Sarileru Neekevvaru' is Here". The Hans India. 6 January 2020. Retrieved 9 January 2020.
  2. "Sarileru Neekevvaru, produced by AK Entertainments, Sri Venkateswara Creations and G Mahesh Babu Entertainment Pvt Ltd, is made an extravagant budget of Rs 75 crore". The Times of India. 21 January 2020. Retrieved 1 February 2020.
  3. "Sarileru Neekevvaru Total Box Office Collection Worldwide" (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-03-27. Archived from the original on 2022-04-01. Retrieved 2022-04-01.

బయటి లింకులు

[మార్చు]