రష్మికా మందన్న

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రష్మికా మందన్న
RashmikaMandanna at Bheeshma event.jpg
జననం (1996-04-05) 1996 ఏప్రిల్ 5 (వయస్సు 26)[1]
విరజ్‌పేట్, కర్ణాటక, భారతదేశం.
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం

రష్మికా మందన్న(జ. ఏప్రిల్ 5 1996) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమమైంది.[2] ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.

బాల్యం[మార్చు]

రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది.[3][4] ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆమె M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం, ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.

రష్మికా బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014 జాబితాలో చోటు సంపాదించింది. 2016లో ఆమె 24వ స్థానం లభించగా, 2017లో ఆమె మొదటి స్థానం సంపాదించింది.[5]

రష్మికా కిరిక్ పార్టి చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితో పరిచయం ఏర్పడింది. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, జులై 2017లో వారి నిశ్చితార్థం జరిగింది.[6]

కెరీర్[మార్చు]

2014 లో రష్మికా మోడలింగ్ ప్రారంభించింది. ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది, క్లీన్ & క్లియర్ బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. ఆ తరువాత ఆమె కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఆ తరువాత ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర, గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది. నాగ శౌర్యతో కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు చిత్రం.[7] 2021 లో విడుదలైన సుల్తాన్ ఆమెకు తొలి తమిళ చిత్రం. అలాగే ఇదే సంవత్సరంలో మిషన్ మజ్ను సినిమా ద్వారా ఆమె బాలీవుడ్ లో అడుగుపెట్టింది[8].

నటించిన చిత్రాలు[మార్చు]

సూచిక
Films that have not yet been released ఇంకా విడుదల కానీ సినిమాలను సూచిస్తుంది
ప్రెస్ మీట్‌లో రష్మికా
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు మూ.
2016 కిరిక్ పార్టి శాన్వి జొసఫ్ కన్నడ విజేత- సైమా ఉత్తమ తొలి చిత్ర నటి పురస్కారం

ప్రతిపాదన—ఐఫా ఉత్సవం ఉత్తమ నటి పురస్కారం

[9]
2017 అంజని పుత్ర గీత కన్నడ తమిళ చిత్రం పూజ పునఃనిర్మాణం
చమక్ \ (గీతా ఛలో) - తెలుగు కుషి కన్నడ
2018 ఛలో ఎల్. కార్తికా తెలుగు తొలి తెలుగు చలన చిత్రం
గీత గోవిందం గీత తెలుగు
దేవదాస్[10] పూజా తెలుగు
2019 యజమన కావేరి కన్నడ
డియర్ కామ్రేడ్ లిల్లీ తెలుగు
2020 సరిలేరు నీకెవ్వరు సంస్కృతి తెలుగు మహేష్ బాబు తో మొదటి చిత్రం
భీష్మ చైత్ర తెలుగు ఈ చిత్రం ఫిబ్రవరి 21, 2020 న విడుదల
2021 పొగరు గీత కన్నడ
సుల్తాన్ రుక్మిణి తమిళం తొలి తమిళ చలన చిత్రం
పుష్ప తెలుగు
2022 ఆడవాళ్లు మీకు జోహార్లు తెలుగు
మిషన్ మజ్ను హిందీ తొలి హిందీ చలన చిత్రం

మూలాలు[మార్చు]

  1. https://m.timesofindia.com/topic/Rashmika-Mandanna
  2. "A reel Virajpet beauty". Deccanchronicle.com. Retrieved 2017-01-22.
  3. Sharadhaa, A. (21 December 2016). "Rashmika mandanna says it's all luck by chance". The New Indian Express. Retrieved 31 March 2017.
  4. "This Coorg lass who is all set to make her debut with Kirik Party, chats about her journey so far". www.deccanchronicle.com.
  5. "These hotties are the most desirable women". The Times of India.
  6. "Inside Rashmika Mandanna And Rakshit Shetty's Engagement". NDTV.com. Retrieved 2017-08-20.
  7. Sharadhaa, A. (16 March 2017). "Rashmika mandanna 's tollywood debut with Naga Shourya". The New Indian Express. Retrieved 31 March 2017.
  8. "Rashmika Mandanna Upcoming Movies List 2021-22". Tollywood Ace (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-28.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Rashmika Mandanna: Meet Saanvi, the hottie from Kirik Party". The Times of India. 24 December 2016. Retrieved 22 January 2017.
  10. సాక్షి, సినిమా (27 September 2018). "'దేవదాస్‌' మూవీ రివ్యూ". Sakshi. Archived from the original on 29 March 2020. Retrieved 2 April 2020.

బయటి లింకులు[మార్చు]