ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సి) | |
---|---|
దేశం | భారతదేశం |
ప్రధానమంత్రి | నరేంద్ర మోదీ |
మంత్రిత్వ శాఖ | హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ |
ప్రారంభించబడింది | 2018; న్యూ ఢిల్లీ |
బడ్జెట్ | ₹ 415.86 కోట్లు |
స్థితి | యాక్టివ్ |
వెబ్సైట్ | i4c.mha.gov.in Archived 2023-09-29 at the Wayback Machine |
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఆంగ్లం: Indian Cyber Crime Coordination), భారతదేశంలో సైబర్ నేరాలను సమన్వయంతో, సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం చేపట్టిన చొరవ. ఐ4సి భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తుంది. [1][2][3] ఇది అక్టోబరు 2018లో ₹ 415.86 కోట్ల ప్రతిపాదిత మొత్తంతో ఆమోదించబడింది.[4]
చరిత్ర
[మార్చు]ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అక్టోబరు 2018లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదించింది. దీనిని జనవరి 2020లో న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించాడు.[5]
జూన్ 2020లో, ఐ4సి సిఫారసు మేరకు, భారత ప్రభుత్వం 59 చైనీస్ మూలం మొబైల్ అనువర్తనాలను నిషేధించింది.[6][7]
ఆన్లైన్ మోసాల నుండి భారతీయ వినియోగదారులను రక్షించడానికి, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కలిసి పనిచేయడానికి అక్టోబరు 2023లో గూగుల్ డిజికావాచ్ ప్రారంభించింది.[8]
నిర్మాణం
[మార్చు]ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్లో 7 విభాగాలు ఉన్నాయి, అవి [9]
- నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (టిఎయు)
- నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్
- నేషనల్ సైబర్ క్రైమ్ ట్రైనింగ్ సెంటర్
- సైబర్ క్రైమ్ ఎకోసిస్టమ్ మేనేజ్మెంట్ యూనిట్
- నేషనల్ సైబర్ క్రైమ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్
- నేషనల్ సైబర్ క్రైమ్ ఫోరెన్సిక్ లాబొరేటరీ (ఎన్. సి. ఎఫ్. ఎల్.)
- ఉమ్మడి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కోసం వేదిక
మూలాలు
[మార్చు]- ↑ "Indian Cyber Crime Coordination Centre". Vikaspedia. 18 July 2019.
- ↑ "New centre to fight cyber crimes". Deccan Chronicle. February 25, 2020.
- ↑ "Online Fraud Advisory issued on cyber crimes". Greater Kashmir. July 12, 2020.
- ↑ "Rs 500-crore center likely to come up to deal with cyber crime". BusinessWorld. 17 September 2015.
- ↑ "Amit Shah inaugurates state-of-the-art portal to tackle cyber crimes". The Economic Times. January 10, 2020.
- ↑ Sarkar, Sohini (June 29, 2020). "Amit Shah powers India's ban on 59 China-linked mobile apps: 10 points". Times of India.
- ↑ Javaid, Afra (July 28, 2020). "Why is India banning Chinese Apps?". Jagran Josh. Dainik Jagran.
- ↑ "Google unveils DigiKavach: Here's how Google is shielding your finances against emerging threats". Business Today (in ఇంగ్లీష్). 2023-10-19. Retrieved 2023-10-24.
- ↑ "Shri Amit Shah inaugurates Indian Cyber Crime Coordination Centre (I4C) in New Delhi; dedicates National Cyber Crime Reporting Portal to the Nation". Press Information Bureau. January 10, 2020.