నాగ శౌర్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నాగ శౌర్య
Naga Shaurya.jpg
అమ్మమ్మగరిల్లు (2018) టీజర్ విడుదల కార్యక్రమంలో శౌర్య
జననం
నాగ శౌర్య ముల్పూరి

22 జనవరి 1989
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లుశౌర్య
వృత్తినటుడు, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2011–ప్రస్తుతం

నాగశౌర్య ముల్పూరి భారతీయ సినిమా నటుడు. ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించాడు. 2011లో సినీ రంగంలోకి ప్రవేశించాడు. అతని మొదటి సినిమా "క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్". జాతీయ బహుమతి పొందిన తెలుగు సినిమా చందమామ కథలులో హాస్య పాత్రను పోషించాడు. తరువాత ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య చిత్రాలలో నటించాడు.[1]

వృత్తి[మార్చు]

నాగ శౌర్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించాడు. ఆయన అనేక సంవత్సరాలుగా విజయవాడలో నివాసమున్నాడు. తరువాత సినిమాలలో నటించాలనే తన కలను నెరవేర్చుకొనుటకు హైదరాబాదుకు మారాడు.[2] ఆయన సినీరంగంలో ప్రవేశానికి ముందుగా టెన్నిస్ ఆడేవాడు.[2]

ఆయన మొదటి పాత్రలో నటించే ముందు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[3] అవకాశాలు లేక నిరాశతో తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరాలనుకున్నాడు.[4] అప్పుడు ఆయన వారాహి చలన చిత్రం ద్వారా ప్రకటనను చూశాడు. ఆ ప్రకటనలో అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న శృంగార హాస్య చిత్రం ఊహలు గుసగుసలాడే గూర్చి ఉంది. ఆయన ఆ తన ప్రొఫైల్ ను పంపించాడు. ఆయనకు ఆశలు లేనప్పటికి ఆయన అందులోని ముఖ్యపాత్ర కోసం ఎంపిక అయ్యాడు.[4] ఊహలు గుసగుసలాడే చిత్రంలో పనిచేస్తున్నప్పుడే ఆయన "చందమామ కథలు" చిత్రానికి ఎంపికయ్యాడు. ఆ చిత్రం మొదట విడుదల అయ్యింది.[5]

ఊహలు గుసగుసలాడే విడుదలైన రెండు మాసాల తరువాత ఆయన కమర్షియల్ విజయాన్ని సాధించాడు.[2] విశ్లేషకులు ఆయన హాస్యసన్నివేశాలకు సరిపోతాడని అన్నారు.[6] వారు తరువాత సినిమాలకు కచ్చితమైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు.[7] ఆయన మూడవ చిత్రం దిక్కులు చూడకు రామయ్య కూడా శృంగార హాస్య చిత్రం. ఇది త్రిముఖ ప్రేమ కథా చిత్రం. ఈ చిత్రంలో తండ్రి, తనయుడు ఒకే అమ్మాయితో ప్రేమలో పడటం విశేషం.[8] "నాగ శౌర్య కొత్త నటులలో ఉత్తమ నటుడిగా నిరూపించుకున్నాడు" అని హిందూ పత్రిక వ్యాఖ్యానించింది.[9] ఆ సంవత్సరంలో శౌర్య యొక్క చివరి చిత్రం "లక్ష్మీ రావే మా ఇంటికి".[10] ఆయన తరువాత చిత్రం 2015లో విడుదలైన "జాదూగాడు". తరువాత "అబ్బాయితో అమ్మాయి" చిత్రంలో నటించాడు.

2016లో ఆయన నీహారిక కొణిదెలతో కలసి ‎గొట్టిముక్కల వెంకట రామరాజు దర్శకత్వంలో ఒక మనసు చిత్రంలో నటించాడు. తరువాత కళ్యాణ వైభోగమే సినిమాలో నటించాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

సంవత్సరం చలన చిత్రం పాత్ర గమనికలు
2011 క్రికెట్ గార్ల్స్ అండ్ బీర్ విక్రమ్
2014 చందమామ కథలు రాజు అతిథి పాత్ర
ఊహలు గుసగుసలాడే వెంకటేశ్వర రావు
దిక్కులు చూడకు రామయ్య మదు
లక్ష్మీ రావే మా ఇంటికి[11][12] సాయి
2015 జాదూగాడు కృష్ణ
అబ్బాయితో అమ్మాయి అభి
2016 కళ్యాణ వైభోగమే శౌర్యా
ఒక మనసు సూర్యా
జో అచ్యుతానంద ఆనంద్ వర్దన్ రావు
నీ జతలేక అఖిల్
2017 కథలో రాజకుమారి శౌర్య అతిది పాత్రలో
2018 ఛలో
దియా(తమిళం) కృష్ణ పోస్ట్ ప్రొడక్షన్
తెలుగు,తమిళ ద్విభాషా చిత్రం
తొలి తమిళ చిత్రం
కణం
అమ్మమగారిల్లు
నర్తనశాల (2018 సినిమా)
2019 ఓ బేబీ విక్రమ్
2020 అశ్వథ్థామ[13][14][15] గణ నిర్మాత, కథా రచయిత

మూలాలు[మార్చు]

 1. "Naga Shourya Debut Movie". Archived from the original on 4 November 2014. Retrieved 5 February 2016. CS1 maint: discouraged parameter (link)
 2. 2.0 2.1 2.2 "You need at least 15-20 years to attain stardom : Naga Shaurya". Timesofindia.indiatimes.com. 2014-09-10. Retrieved 2015-04-17. CS1 maint: discouraged parameter (link)
 3. ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
 4. 4.0 4.1 "Naga Shourya: The newest kid on the block". Deccanchronicle.com. 2014-06-27. Retrieved 2015-04-17. CS1 maint: discouraged parameter (link)
 5. "Naga Shourya Interview | Oohalu Gusagusalade Hero | Chandamama Kathalu | Avasarala Srinivas - Interviews". CineGoer.net. 2014-06-30. Archived from the original on 2015-04-18. Retrieved 2015-04-17. CS1 maint: discouraged parameter (link)
 6. "Oohalu Gusagusalade Movie Review". Timesofindia.indiatimes.com. 2014-06-20. Retrieved 2015-04-17. CS1 maint: discouraged parameter (link)
 7. "Oohalu Gusagusalade Movie Review | oohalu gusagusalaade telugu movie review | Oohalu Gusagusalade Telugu Review". 123telugu.com. 2014-06-20. Retrieved 2015-04-17. CS1 maint: discouraged parameter (link)
 8. "I want to do more edgy films, says Naga Shaurya". Timesofindia.indiatimes.com. Retrieved 2015-04-17. CS1 maint: discouraged parameter (link)
 9. Sangeetha Devi Dundoo (2014-10-10). "Dikkulu Choodaku Ramayya: Of messy romances". Thehindu.com. Retrieved 2015-04-17. CS1 maint: discouraged parameter (link)
 10. "Rajamouli praises Naga Shourya". 123telugu.com. Retrieved 2015-04-17. CS1 maint: discouraged parameter (link)
 11. సాక్షి, సినిమా (3 December 2014). "'బొమ్మరిల్లు'లో...'ఇడియట్' కుర్రాణ్ణి!". Sakshi. Archived from the original on 7 July 2018. Retrieved 8 August 2020. CS1 maint: discouraged parameter (link)
 12. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020. CS1 maint: discouraged parameter (link)
 13. నమస్తే తెలంగాణ, సినిమా (31 January 2020). "అశ్వథ్థామ మూవీ రివ్యూ". Archived from the original on 31 January 2020. Retrieved 17 February 2020. CS1 maint: discouraged parameter (link)
 14. సాక్షి, సినిమా (31 January 2020). "'అశ్వథ్థామ' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 17 February 2020. Retrieved 17 February 2020. CS1 maint: discouraged parameter (link)
 15. ఈనాడు, సినిమా (31 January 2020). "రివ్యూ: అశ్వథ్థామ‌". Archived from the original on 1 February 2020. Retrieved 17 February 2020. CS1 maint: discouraged parameter (link)

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నాగ_శౌర్య&oldid=3009101" నుండి వెలికితీశారు