Jump to content

జో అచ్యుతానంద (సినిమా)

వికీపీడియా నుండి
జ్యో అచ్యుతానంద
దర్శకత్వంఅవసరాల శ్రీనివాస్
రచనఅవసరాల శ్రీనివాస్
నిర్మాతసాయి కొర్రపాటి
తారాగణంనారా రోహిత్
నాగ శౌర్య
రెజీనా[2]
ఛాయాగ్రహణంవెంకట్ సి.దిలీప్
కూర్పుగంటి కిరణ్
సంగీతంకల్యాణి మాలిక్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
9 సెప్టెంబరు 2016[1]
సినిమా నిడివి
125 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

జో అచ్యుతానంద [3] 2016లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించగా సాయి కొర్రపాటి

వారాహి చలన చిత్రం నిర్మాణ సంస్థతో నిర్మించారు.నారా రోహిత్,నాగ శౌర్య, రెజీనా ముఖ్య పాత్రలు పొషించారు.[4]

కథాంశం

[మార్చు]

అచ్యుత రామ రావు (నారా రోహిత్), ఆనంద వర్ధన్ రావు ( నాగ శౌర్య) అన్నదమ్ముళ్ళు.కాని ఒకరంటే ఒకరికి పడదు,కాని ఇతురుల ముందు అంతా బానే ఉన్నట్టు నటిస్తారు.అచ్యుత కొత్త కారు కొన్నందుకు ఇచ్చిన పార్టిలో వారికి చిన్న గొడవై పొరపాటున జ్యో గురించి మాట్లాడతారు.అది వారి భార్యలు వింటారు.రాత్రి బొజనమైన తరువాత వారి వారి భార్యలు వరిని జ్యో గురించి అడుగుతారు.కాని వారి తన సొదరుడు అమెను ప్రేమించాడని వారి భార్యలకు చెబుతారు.ఆ తరువాత ఇద్దరు అన్నదమ్ములు ఇంటి మెడపై కలిసి గతం గుర్తు చెసుకుంటారు. జ్యొస్న కుమారి జ్యో(రెజీనా) డెంటల్ స్టుడెంట్ వారి వసారాలో(ఇంటి పై అంతస్తుపై కట్టిన చిన్నఇల్లు)తన తండ్రి సుర్య నారాయణ మూర్తి(తనికెళ్ళ భరణి)తో అద్దెకుంటుంది.ఇద్దరు అన్నదమ్ములు తనతో ప్రేమలో పడతారు.ఇద్దరు అమెతో స్నేహం చేస్తారు.ఆనంద్ ఆమె పుట్టిన రోజున తనకు అతని ప్రేమను తెలియజెయాలని ఒక లేఖ రాస్తాడు.అచ్యుత ఆ లేఖను రహస్యంగా చదవాలని చుస్తాడు కాని ఆనంద్ అతన్ని పట్టుకుంటాడు.అతను అ లేఖని ఆమెకి ఇవ్వమని ప్రొత్సహిస్తాడు.చివరికి ఆనంద్ ఆ లేఖ జ్యోకి ఇవ్వగా ఆమె అచ్యుత తనకి ఇంతకు ముందే తనికి ప్రేమ లేఖ ఇచ్చాడని.ఆమె వెరె వారిని ప్రేమిస్తున్నందున తనని ప్రేమించలేనని చెబుతుంది.

ఆమె ఆనంద్ తో అచ్యుత్ ప్రేమని మరిచిపొమని చెప్పమని చెబుతుంది.ఆమె అచ్యుత్ ని ప్రేమిస్తుదనుకుని ఆనంద్ అచ్యుత్ తో గొడవ పడతాడు.చివరికి వారు ఆమె ఎవరిని ప్రేమిస్తుందొ ఆమెనే అడగటానికి నిశ్చయించుకుంటారు.వారు తనని ఈ విషయం అడగగా ఆమె తన తోటి డెంటల్ స్టుడెంట్ అయిన అమంచి బల భరద్వాజ్(శశాంక్)ని ప్రేమిస్తుందని,అతను అమెరికా వెల్తున్నాడని,ఆమె కుడా తన పైచడువుల కొరకు అతనితో అమెరికా వెళ్ళబోతుందని చెబుతుంది.దానికి కొపగించుకున్న అచ్యుత్ జ్యొ పస్పోర్టుని తగలబెడతాడు.ఈ విషయం ఆనంద్ జ్యొకి చెబుతాడు.వారిద్దరి మీద కొపంతో వల్ల తండ్రికి వారి గురించి ఫిరియాదు చెయ్యాలని వెళ్తుంది.ఆమె వాళ్ళ తండ్రికి వారి గురించి చెప్పబొయేలోపు వారి తండ్రికి గుండెపోటు వస్తుంది.ఆయనని ఐ.సి.యు.లో చెరుస్తారు.వారి నాన్న పరిస్థితికి జ్యొనే కారణమనుకుని వారు వల్ల నాన్నకు ఎమన్నా అయితే జ్యో నాన్నను చంపేస్తామని బెదిరిస్తారు.జరిగినదంతా జ్యొ తన తండ్రికి చెభుతుంది.అతను అమెను అమెరికా పంపుతాడు.తరువాత అచ్యుత్, ఆనంద్ ల నాన్న అసుపత్రిలో చనిపొతాడు.

ఐదు సంవత్సరాల తరువాత ప్రస్తుతం వారు ఒకరినొకరు ద్వేషించుకుంటారు.సుడోకో మూర్తి జ్యో తన చదువు పూర్తి చెసుకుని భారత దేశనికి తిరిగి వస్తుందని చెబుతాడు.జ్యొ తిరిగి వచ్చిన తరువాత వారి ఇంట్లో పరిస్థితి అర్థం చెసుకుని అంతా సరి చెయ్యాలనుకుంటుంది.అచ్యుత్ పెళ్ళిరోజున జ్యో అచ్యుత్,ఆనంద్ ల ప్రతిభలను వారి భార్యలకు చుపించమని ప్రొత్సహిస్తుంది .అచ్యుత్ మంచి చిత్రకారుడు కాని అతను మంచి టెన్నిస్ ఆటగాడని తన భార్యకు చెప్పాదు.అలాగే ఆనంద్ మంచి టెన్నిస్ ఆటగాడు కాని అతను మంచి చిత్రకారుడని తన భార్యకు చెబుతాడు.కొన్ని హస్యపరమైన సన్నివెసాల తరువాత వారు వారి భార్యలను వారి ప్రతిభల గురించి ఒప్ప్పిస్తారు.ఈ సమయంలో వారు సానుకులంగా ఉంటారు.కాని వారి అహం వారిని తిరిగి

కలవకుండా చేస్తుంది.

ఒక రాత్రిజ్యొ అచ్యుత్ ని పిలుస్తుంది అతన్ని మైగ్రేన్ కోసం మాత్రలు తీసుకురమ్మని అడుకుతుంది, అతను మాత్రలు తెచ్చిన తరువాత అమె అతనిని ప్రేమిస్తుందని చెబుతుంది.కాని ఆనంద్‌ అచ్యుత్ సహాయంతో చీకటిగా ఉన్న రెస్టారెంట్‌లో అమెని ప్రేమించలేనని చెబుతాడు.చివరికి ఇద్దరు అన్నాతమ్ముళ్ళు జ్యోకి ఆనంద్ బావమరిదితో నిస్చితార్దం చెద్దామని అనుకుంటారు.కాని నిస్చితార్ద సమయంలో జ్యో తన వెలుకి ఉంగరాన్ని పెట్టించకుండా తను వెరే ఒకరిని ప్రేమిస్తున్నానని చెబుతుంది.తను ప్రేమించిన అతనికి పెళ్ళి అయ్యిందని,అతను తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడని అమె చెబుతుంది.ఆ రోజు రాత్రి ఇద్దరు అన్నదమ్ములు జ్యో తననే ప్రేమిస్తుందని వాదించుకుంటారు.చివరికి అమె ఇద్దరిని మొసం చెస్తుందని తెలుసుకుని,అమె గదికి వెళ్ళి అమెను అడగగా అమె వారి మీద పగ సాధించాలనుకుంటుందని చెబుతుంది.వారు తమని మన్నించమని అడుగుతారు.అప్పుడు అమె తను అమెరికాలో ఉన్నప్పుడు బరద్వాజ్ యొక్క స్వాధీనత వల్ల అమె అతని నుండి విడిపొఇందనీ కాని అతను అమె రాసిన ప్రేమ లేఖలు,ఇచ్చిన బహుమతులు చుపించి అమెను బెదిరిస్తున్నాదని,అతని నుంచి ఆ ప్రేమ లేఖలు,బహుమతులు రాబట్టకపోతే వారి భార్యలకు వారి గురించి అంతా చెప్పేస్తానంటుంది.అచ్యుత్ ఆనంద్‌ని ఆ ప్రేమ లేఖలు తీసుకురామని ప్రేరేపిస్తాడు కాని ఆనంద్ పట్టించుకోడు.కొపంతో ఆనంద్‌కి వాళ్ళ నాన్న బహుమతిగా ఇచ్చిన "చివరికి మిగిలింది"అనే పుస్తకాన్ని అమ్మేస్తాడు.దానితో కొపగించుకున్న ఆనంద్ వారి ఇల్లు పడగొట్టి వెరు వెరు ఇల్లు కట్టుకొవటానికి చుస్తారు, వారి అమ్మ వారి గోడవని సర్దుమదుస్తుంది.వారిద్దరు చివరిసారి కలిసి జ్యో కోసం బరద్వాజ్ దగ్గరున్న ప్రేమ లేఖల కోసం అతని ఇంటికి వెల్తారు. కాని వారిదరు దొరికిపోతారు,అచ్యుత్ అక్కడి నుండి పారిపొతాడు, బరద్వాజ్ ఆనంద్‌ని తీవ్రంగా కొడతాడు చివరికి అతను కూడా అక్కడి నుంచి తప్పించుకుంటాడు.అచ్యుత్ తనని కాపడటానికి రాకపొవటంతో ఇద్దరు అన్నదమ్మౌళ్ళు మళ్ళి గొడవ పడతారు.ఆనంద్‌ బాదపడి బెంగుళూరు వెల్లిపొదామనుకుంటాడు.తరువాత అచ్యుత్ పశ్చాతాపపడి తన తమ్ముడిని కొట్టిన బరద్వాజ్ ఇంటికెళ్ళి అతనిని కొడతాడు.తరువాత తన తమ్ముడిని సాగనంపటానికి రైల్వేస్టేషన్‌కి వెళ్తాడు.జ్యో వారి దగ్గరకి వచ్చి బరద్వాజ్ రాజీ పదటానికి ఫోన్ చేశాడని వారికి దన్యవాదాలు చెబుతుంది.తన కోసం బరద్వాజ్‌ని అచ్యుత్ కొట్టాడని ఆనంద్ భావోద్వేగానికి లోనవుతాడు.అచ్యుత్ అనంద్‌కి వాళ్ళ నాన్న సంతకమున్న"చివరికి మిగిలింది"అనే పుస్తకాన్ని ఇస్తాడు.ఆ పుస్తకం మీద ఉన్న సంతకంలో తేడా బట్టి అది వాళ్ళ నాన్నది కాదని ఆనంద్ గమనిస్తాడు.అచ్యుత్ తను చేసిన మూర్ఖ పనికి క్షమించమని,తిరిగి కలసి ఉందామని అడుగుతాడు.ఆనంద్ కూడా అతన్ని క్షమిస్తాడు.వారు కలసిపోవటం దూరంగా జ్యో తన ప్రియుడితో(నానీ )కలసి చూస్తుంది.వారు విడిపోవటానికి తాను పరొక్షంగా కారణమైందని వాళ్ళ అమ్మని కలసిన తరువాత తెలిసిందని.వారిని ఎలాగైనా కలపాలని అమె అనుకున్నదని చెబుతుంది.అన్నదమ్ములిద్దరు కలిసిపొవటంతో కథ ముగుస్తుంది.

తారాగణం

[మార్చు]
  • అచ్యుత్ రామారావు "అచ్యుత్"గా నారా రోహిత్
  • అనంద వర్ధన్ రావు "అనంద్"గా నాగ శౌర్య
  • జ్యొస్న కుమారి "జ్యో"గా రెజీనా
  • జ్యో ప్రియుడిగా నానీ [5](అతిది పాత్రలో)
  • సుర్య నారాయణ మూర్తి "సుడొకు మూర్తి"గా తనికెళ్ళ భరణి
  • అచ్యుత్ భార్యగా పావని గంగిరెడ్డి
  • అనంద్ భార్యగా రాజేశ్వరి పమిదిఘంటం.
  • అచ్యుత్, అనంద్ ల తల్లిగా సీత
  • అమంచి బల భరద్వాజ్ గా శశాంక్
  • అనంద్ బావమరిదిగా చైతన్య కృష్ణ
  • మిర్చి హేమంత్

పాటల జాబితా

[మార్చు]

ఈ సినిమా యొక్క పాటలు, నేపథ్య సంగీతం కళ్యాణి కొడరిచే రచింపబడింది, అన్ని పాటలు భాస్కర భట్లా వ్రాసినవి.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ఆకు పచ్చని చందమామలా"  కార్తీక్, రమ్యా బెహ్రా  
2. "సువర్ణ సువర్ణ"  సింహా  
3. "ఒక లాలన( మగ)"  శంకర్ మహదేవన్  
4. "జ్యో అచ్యుతానంద"  శ్రీ కళ్యాణరమన, స్మిత  
5. "ఒక లాలన( ఆడ)"  హరిని రావు  

మూలాలు

[మార్చు]
  1. "Jyo Achyutananda jeevi review". idlebrain.com. 9 September 2016. Retrieved 27 September 2016.
  2. "Nara Rohit, Naga Shaurya turns brothers". indiaglitz.com. 20 November 2015. Retrieved 12 November 2015.
  3. "Sourya Jyo Achyutananda Shooting Starts". TNPlive. Warangal. 26 December 2015.
  4. "NTR & Nara Rohit in Eega Producer films". tupaki.com. 17 September 2015. Retrieved 24 October 2015.
  5. http://www.123telugu.com/mnews/star-heros-cameo-confirmed-in-jyo-acthutananda.html