స్మిత (గాయని)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్మిత
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంస్మిత వల్లూరుపల్లి
జననం (1980-09-04) 1980 సెప్టెంబరు 4 (వయసు 44)
విజయవాడ
సంగీత శైలిపాప్ సంగీతం
వృత్తిగాయని, నటి, ప్రయోక్త, వ్యాపారవేత్త
పిల్లలుశివి
వెబ్‌సైటుSmitaPop.com

తెలుగులో ప్రసిద్ధి చెందిన గాయని, నర్తకి. ఈమె తెలుగులో మొట్ట మొదటి పాప్ ఆల్బం రూపొందినది.

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

స్మిత సెప్టెంబరు 4, 1980 న ప్రభుప్రసాద్, జోగులాంబ దంపతులకు విజయవాడలో జన్మించింది. స్మిత నాలుగేళ్ళ వయసులో ఉండగానే తమ పాఠశాల వార్షికోత్సవంలో బెరుకు లేకుండా పాడి పలువురి ప్రశంసలు పొందింది. పెద్దదయ్యే కొద్దీ ఆమె పలు పోటీల్లో పాల్గొని ఏదో ఒక బహుమతి సాధించుకుని వచ్చేది. ఆమె ఆరు, ఏడు తరగతులు బెంగళూరులోని బిషప్ కాటన్ పాఠశాలలో చదివింది. అక్కడ ఎనిమిదో తరగతి పైబడ్డ వాళ్ళనే సంగీతంలో మెరుగులు దిద్దేందుకు ఎంపిక చేసేవారు. అయినా స్మిత ఉత్సాహం చూసి ఆరో తరగతిలోనే ఆమెకు అవకాశమిచ్చారు. ఆ రెండేళ్ళలో ఆమె సంగీతంలో రాటు దేలింది. ఇంట్లో కూడా సంగీతానికి సంబంధించిన కార్యక్రమాలు చూస్తే అభినయించడం నేర్చుకుంది. అప్పటికే ఆమె తల్లిదండ్రులు ఆమె కళల్లోనే రాణించగలదని నిర్ధారించుకున్నారు [1]

ఆమె ఇంటర్మీడియట్ చదువుకోసం విజయవాడలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో చేరింది. అక్కడ నుంచి ఈటీవీ నిర్వహిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమంలో పాల్గొనింది. ఫైనల్లో విజేతగా నిలవకపోయినా మంచి గుర్తింపు సాధించింది. అప్పటికే ఆమెకు సినిమాలలో అవకాశాలు రాసాగాయి. అయినా ఆమె తల్లిదండ్రులు ఆమె గొంతు పాప్ సంగీతానికి సరిపోతుందని భావించి ఆమెను ఆ రంగంలో కృషి చేయమని సలహా ఇచ్చారు. అప్పుడే హాయ్ రబ్బా ఆల్బమ్ ను రూపొందించింది. అది మంచి ప్రజాదరణ పొందింది. ఆ తరువాత చాలా ఆల్బమ్స్ రూపొందించింది.

వ్యాపారవేత్తగా

[మార్చు]

స్మిత గాయనిగానే కాక వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. 2002లో హైదరాబాదులోని జూబిలీ హిల్స్ లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ అనే పేరుతో బ్యూటీ సెలూన్ ప్రారంభించడంతో ఆమె ప్రస్థానం ఆరంభమయ్యింది.[2] 2006లో విజయవాడలో కూడా అదే పేరుతో సెలూన్ ప్రారంభించింది. దానితో పాటు ఫిట్ నెస్ సెంటర్ ను కూడా ప్రారంభించింది. ఐ కాండీ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో మరో సంస్థను ప్రారంభించి టీవీ కార్యక్రమాలు రూపొందిస్తోంది.[1]

ఇతర విశేషాలు

[మార్చు]
  • స్మిత మొట్టమొదటి తెలుగు పాప్ గాయని
  • తెలుగు పాత పాటలను రీమిక్స్ చేసిన గాయనిగా ప్రసిద్ధి పొందినది
  • ప్రసిద్ధ కార్యక్రమములలో పాటలు పాడటం వంటి కార్యక్రమములు నిర్వహిస్తుంది.

నటిగా స్మిత తెలుగు చిత్రాలు

[మార్చు]

గాయనిగా స్మిత తెలుగు చిత్రాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Idle, brain. "Happy Birthday to Smita". idlebrain.com/. Retrieved 19 June 2016.
  2. Namasthe Telangana (13 March 2022). "ఆ రాత్రి నిద్ర ప‌ట్ట‌లేదు.. ఎమోష‌న‌ల్ అయిన సింగ‌ర్ స్మిత‌". Archived from the original on 13 March 2022. Retrieved 13 March 2022.