Jump to content

కల్యాణి మాలిక్

వికీపీడియా నుండి
కల్యాణి మాలిక్
జననం
కల్యాణ్ కోడూరి
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
జీవిత భాగస్వామిఉమ
తల్లిదండ్రులు
  • శివశక్తి దత్త (తండ్రి)
  • భానుమతి (తల్లి)

కల్యాణి మాలిక్ సినిమా సంగీత దర్శకుడు, గాయకుడు. అతడి అసలు పేరు కోడూరి కళ్యాణ్. అతడు సినిమా కుటుంబానికి చెందినవాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి సోదరుడు.[1] రచయిత విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళి, సంగీత దర్శకురాలు ఎం. ఎం. శ్రీలేఖ కళ్యాణి మాలిక్‌కు చుట్టాలే. బృంద గాయకుడిగా, ముఖ్య గాయకుడిగా, సహాయ సంగీత దర్శకుడిగా, టీవీ సీరియళ్ళు వ్యాపార ప్రకటనలకు సంగీతాన్నిచ్చి, సినిమా సంగీత దర్శకుడయ్యాడు. [2] ఐతే సినిమాతో కళ్యాణి మాలిక్ సినిమా రంగ ప్రవేశం చేసాడు.

సంగీత ప్రస్థానం

[మార్చు]

సోదరుడు కీరవాణి వద్ద బృంద గాయకుల్లో ఒకడిగా కళ్యాణి మాలిక్ సంగీత ప్రస్థానం మొదలైంది. [3]యువరత్న సినిమాలో సన్నజాజి పూవా పాటతో అతడు పూర్తిస్థాయి గాయకుడయ్యాడు. ఓవైపు పాటలు పాడుతూనే కీరవాణికి సంగీత దర్శకత్వ సహాయకుడుగా పనిచేసాడు. అనేక టీవీ సీరియళ్ళకు, వ్యాపార ప్రకటనలకూ అతడు పనిచేసాడు. ఆ తరువాత ఐతే సినిమాతో సంగీత దర్శకుడయ్యాడు. దాని తోటి అతడికి మంచి పేరొచ్చింది. ఆ తరువాత అష్టా చెమ్మా, అలా మొదలైంది, గోల్కొండ హైస్కూల్. ఊహలు గుసగుసలాడే వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు.[4]

సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలు

[మార్చు]

సీరియళ్ళు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  • మిర్చి దక్షిణ భారత సినీ పురస్కారాలు [5]
  • 2014 – సంవత్సరానికి ఉత్తమ గీతం – ఏం సందేహం లేదు
  • 2014 – సంవత్సరానికి ఉత్తమ ఆల్బం – ఊహలు గుసగుసలాడె
  • 2014 – ఉత్తమ నేపథ్య గాయకుడు
  • 2014 – ఉత్తమ సంగీత దర్శకుడు
  • 2014 – శ్రోతల ఉత్తమ ఎంపిక – ఏం సందేహం లేదు

మూలాలు

[మార్చు]
  1. "ఇండస్ట్రీలో పోటీ అనే పదం నాకు వర్తించదు - kalyani malik interview". www.eenadu.net. Retrieved 2021-02-16.
  2. "Confessions of a Renegade Music Director".
  3. "Don't Blame Directors For Those Songs".
  4. "Kalyana Ramana completes 14 years in industry". The Times of India. Retrieved 9 January 2018.
  5. "Winners". Archived from the original on 26 July 2015. Retrieved 1 August 2015.