హోరా హోరీ
హోరా హోరీ (2015 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | తేజ |
---|---|
నిర్మాణం | కె.ఎల్.దామోదర ప్రసాద్ |
కథ | తేజ |
చిత్రానువాదం | తేజ |
తారాగణం | దిలీప్ రెడ్డి, దక్ష నగార్కర్, ఛస్వ |
సంగీతం | కోడూరి కళ్యాణ్ |
గీతరచన | పెద్దాడ మూర్తి |
సంభాషణలు | ఆకెళ్ళ శివప్రసాద్ |
ఛాయాగ్రహణం | దీపక్ భగవంత్ |
కూర్పు | జునైద్ సిద్ధికీ |
నిర్మాణ సంస్థ | శ్రీ రంజీత్ మూవీస్ |
విడుదల తేదీ | 11 సెప్టెంబర్ 2015 |
భాష | తెలుగు |
హోరా హోరీ 2015, సెప్టెంబర్ 11న విడుదలైన రొమాంటిక్ తెలుగు సినిమా. ఈ సినిమాను తేజ దర్శకత్వంలో కె.ఎల్.దామోదర ప్రసాద్ శ్రీ రంజీత్ మూవీస్ బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి కోడూరి కళ్యాణ్ సంగీతం అందించాడు.
నటీనటులు
[మార్చు]- దిలీప్ రెడ్డి - స్కంద
- దక్ష నగార్కర్ - మైథిలి
- ఛస్వ - బసవరాజ్
- అభిరామ్ వర్మ - అభిరాం
- రచ్చ రవి
సాంకేతికవర్గం
[మార్చు]- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: తేజ
- సంభాషణలు: ఆకెళ్ళ శివప్రసాద్
- పాటలు: పెద్దాడ మూర్తి
- సంగీతం: కోడూరి కళ్యాణ్
- ఛాయాగ్రహణం: దీపక్ భగవంత్
- కూర్పు: జునైద్ సిద్ధికీ
- నిర్మాత: కె.ఎల్.దామోదర ప్రసాద్
కథ
[మార్చు]బసవేశ్వర్ ఒకతన్ని నడిరోడ్డు మీద నరికి చంపేస్తాడు. ఆ కేసు నుంచి బయటకి రావడం కోసం ఒక ఎసిపికి లంచం ఇస్తూ తన చెల్లెలైన మైథిలిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడి తననే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. దాంతో ఆమెకి పెళ్లి కానివ్వకుండా ఆమెని పెళ్లి చేసుకోవాలని వచ్చేవారిని చంపేస్తుంటాడు. డాక్టర్ సలహాతో స్థలమార్పిడి కోసం షాక్ లోకి వెళ్ళిపోయిన మైథిలిని తీసుకొని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని ఆగుంబె ప్రాంతానికి వారి కుటుంబం వెళుతుంది. అక్కడ మైథిలికి స్కంద పరిచయం అవుతాడు. అదే ఊర్లో స్కంద తన బామ్మ అంజలితో ఉంటూ ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. కానీ అదే టైంలో పక్క ఊరిలో ప్రింటింగ్ ప్రెస్ వల్ల స్కంద ఇబ్బందుల్లో పడతాడు. ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటపడాల అని ఆలోచిస్తున్న టైంలో స్కందకి మైథిలితో పరిచయం అవ్వడం, ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడడం జరిగిపోతాయి. మైథిలి ఎక్కడికి వెళ్ళిందా అని వెతుకుతున్న బసవేశ్వర్ అదే ఊరికి రావడం జరుగుతుంది. అక్కడ బసవేశ్వర్ కి స్కందతో పరిచయం పెరిగి బాగా క్లోజ్ అవుతారు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నాం అనే విషయం తెలియడంతో కథ ఎలాటి మలుపులు తిరిగింది? చివరికి మైథిలి ఎవరి వశం అయ్యింది? అనేది మిగిలిన కథ.[1]
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "హోరా హోరీ – రొటీన్ అండ్ బోరింగ్ ప్రేమకథ.!". 123 తెలుగు.కామ్. Retrieved 4 March 2024.