Jump to content

సీత (నటి)

వికీపీడియా నుండి
సీత
జననం (1964-07-13) 1964 జులై 13 (వయసు: 61)
చెన్నై
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, నిర్మాత
క్రియాశీలక సంవత్సరాలు1985-1990
2002-ప్రస్తుతం
భాగస్వామిఆర్. పార్థిబన్ (m.1990-2001)(విడాకులు)
సతీష్ (m. 2010-present)
పిల్లలు
  • అభినయ
  • కీర్తన
  • రాఖీ
ముద్దుల మావయ్య - బాలకృష్ణ, సీత, విజయశాంతి

సీత ఒక దక్షిణ భారతీయ సినీ నటి, నిర్మాత. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో పనిచేసింది. సీత 1985 లో హీరోయిన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది. 1985 నుంచి 1990 దాకా ప్రముఖ కథానాయికల్లో ఒకటిగా కొనసాగింది. ఆడదే ఆధారం చిత్రానికి గాను ఆమెకు నంది పురస్కారం లభించింది. మరల 2002 లో మారన్ అనే తమిళ సినిమాతో పునరాగమనం చేసింది. 2004 లో తమిళ సినిమా రైటా తప్పా అనే సినిమాకు గాను తమిళనాడు రాష్ట్ర ఉత్తమ సహాయనటి పురస్కారం అందుకుంది.[1]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సీత తండ్రి స్వస్థలం విజయనగరం జిల్లా, బొబ్బిలి. సీత చిన్నప్పుడే ఆమె తండ్రి మోహన్ బాబు మెడికల్ రెప్రెజెంటేటివ్ గా చెన్నైలో స్థిరపడ్డాడు.[2] మోహన్ బాబు సినిమాల్లో నటుడిగా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తుండేవాడు. సీత మోహన్ బాబు, చంద్రావతి దంపతులకు 1964లో చెన్నైలో జన్మించింది. ఆమెకు పాండు, దుష్యంత్ అనే ఇరువురు సోదరులున్నారు.[3] సీత నటుడు పార్థిబన్ తో ప్రేమలో పడి 1990లో అతన్ని వివాహం చేసుకుంది. వారికి అభినయ, కీర్తన అనే ఇద్దరు కూతుర్లు, రాఖీ అనే దత్తపుత్రుడు ఉన్నారు. కీర్తన మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన అమృత అనే సినిమాలో నటించింది. ఆమెకు ఈ సినిమాలో నటనకుగాను ఉత్తమ బాలనటిగా జాతీయ పురస్కారం లభించింది. ఖాళీ సమయాల్లో ఆమె తంజావూరు పెయింటింగ్స్ వేస్తుంటుంది. ఆమె కుమార్తె అభినయకు కూడా ఈ చిత్రకళలో ప్రవేశం ఉంది.

2001 లో ఆమె వ్యక్తిగత కారణాల వలన పార్థిబన్ నుంచి విడిపోయింది. 2010 లో టీవీ నటుడు సతీష్ ను వివాహం చేసుకున్నది.[4][5][6]

కెరీర్

[మార్చు]

సీత 1985 లో తమిళ సినిమాలతో తన కెరీర్ ప్రారంభించింది. ఐదు సంవత్సరాల పాటు హీరోయిన్ గా పలు తమిళ, తెలుగు సినిమాల్లో నటించింది. ముద్దుల మావయ్య సినిమాలో ఆమె హీరో బాలకృష్ణ చెల్లెలుగా నటించింది. ఈ పాత్ర ద్వారా ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించింది. పార్థిబన్ ను వివాహం చేసుకున్న తర్వాత నటనలో విరామం తీసుకుంది. మళ్లీ 2002 నుంచి సహాయ పాత్రల్లో నటిస్తూ వస్తున్నది. ఇంద్ర, సంబరం, గంగోత్రి, సింహాద్రి, బన్నీ, వాన, అతడే ఒక సైన్యం లాంటి సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలు పోషించింది.

సినిమాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Long and short - The Hindu
  2. https://aksharajalam.files.wordpress.com/2014/09/star-sita.jpg
  3. "Actress Seetha's big loss - Tamil Movie News". the original నుండి 2017-04-21 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2016-11-17.
  4. "Seetha Biography". entertainment.oneindia.in. the original నుండి 2013-07-16 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-05-09.
  5. "EX-WIFE OF POPULAR ACTOR REMARRIES?". behindwoods.com. 2010-09-17. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-05-09.
  6. "Poles apart but one they are". indiaglitz.com. 2004-07-02. the original నుండి 2018-02-03 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-05-09.
"https://te.wikipedia.org/w/index.php?title=సీత_(నటి)&oldid=4721993" నుండి వెలికితీశారు