ఆడదే ఆధారం
ఆడదే ఆధారం | |
---|---|
దర్శకత్వం | విసు |
రచన | ఆకెళ్ల (మాటలు) |
నిర్మాత | ఎ. పూర్ణచంద్రరావు |
తారాగణం | విసు, చంద్రమోహన్, సీత |
ఛాయాగ్రహణం | ఎన్. బాలకృష్ణన్ |
కూర్పు | గణేష్ - కుమార్ |
సంగీతం | శంకర్ గణేష్ |
నిర్మాణ సంస్థ | |
భాష | తెలుగు |
ఆడదే ఆధారం విసు దర్శకత్వంలో 1986లో వచ్చిన కుటుంబ కథా చిత్రం.[1] ఇందులో చంద్రమోహన్, సీత, విసు ప్రధాన పాత్రధారులు. ఈ సినిమాను ఎ. పూర్ణచంద్రరావు లక్ష్మీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించాడు. ఇది పెన్మణి అవల్ కన్మణి అనే తమిళ చిత్రానికి పునర్నిర్మాణం. రెండు భాషల్లోనూ విసునే దర్శకుడు. చుట్టు పక్కల కుటుంబ సమస్యలు తీర్చే వ్యక్తి కథ ఇది.
కథ(plot)
[మార్చు]తారాగణం
[మార్చు]- సీత
- చంద్రమోహన్
- విసు
- దిలీప్
- శుభాకర్
- రాజా
- సుధగా అరుణ
- కల్పనగా రాజ్యలక్ష్మి
- దివ్యవాణి
- పి. ఎల్. నారాయణ
- సాక్షి రంగారావు,
- సుధ
- పి. జె. శర్మ
- మాస్టర్ కృష్ణ కిషోర్
- అన్నపూర్ణ
- పి. ఆర్. వరలక్ష్మి
- డబ్బింగ్ జానకి
- కుట్టి పద్మిని
- బేబీ శారద
- అతిథి పాత్రలో షావుకారు జానకి
నిర్మాణం
[మార్చు]ఈ చిత్ర దర్శకుడు విసు తమిళ చిత్రాల్లోనే ఎక్కువగా నటించినా ఆయన చిత్రాలు తెలుగులో పునర్నిర్మాణం అయ్యేవి. తెలుగులో వచ్చిన సంసారం ఒక చదరంగం మాతృకయైన తమిళ సినిమాకు ఈయనే దర్శకత్వం వహించాడు. అప్పట్లో తమిళ సినిమాకు జాతీయ పురస్కారం లభించింది. ఆడదే ఆధారం సినిమాకు మాత్రం రెండు భాషల్లోనూ ఈయనే దర్శకత్వం వహించాడు.[2] దర్శకత్వం వహించడమే కాక ఇందులో కీలకమైన పాత్ర కూడా ఆయనే పోషించాడు. ఆయనకు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పాడు.
పాటలు
[మార్చు]ఈ సినిమాకు శంకర్ - గణేష్ సంగీత దర్శకత్వం వహించగా, ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం, శైలజ, రమేష్ పాటలు పాడారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాశారు.
1.నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ గాలమ్మ, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి , గానం.వాణి జయరాం
2.నేలమ్మ నింగమ్మా నీరమ్మా నిప్పమ్మా గాలమ్మా, రచన: సిరివెన్నెల, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
3.మహిళలు మహారాణులు చక్కనైన, రచన:సిరివెన్నెల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
[మార్చు]- ↑ "ఆడదే ఆధారం (1988) | ఆడదే ఆధారం Movie | ఆడదే ఆధారం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-06-26.
- ↑ "ప్రముఖ నటుడు కన్నుమూత.. విషాదంలో సౌత్ ఇండస్ట్రీ." News18 Telugu. 2020-03-22. Retrieved 2020-06-26.
. 3.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.