Jump to content

రాజ్యలక్ష్మి (నటి)

వికీపీడియా నుండి
రాజ్యలక్ష్మి

జన్మ నామంరాజ్యలక్ష్మి
జననం 18డిసెంబర్,1964
తెనాలి, గుంటూరు జిల్లా
ప్రముఖ పాత్రలు శంకరాభరణం
చెవిలో పువ్వు
నెలవంక

రాజ్యలక్ష్మి తెలుగు సినిమా నటీమణి. ఈమె శంకరాభరణం సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార.

నేపధ్యము

[మార్చు]

గుంటూరు జిల్లా తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో *రాజ్యలక్ష్మి*18,డిసెంబర్, 1964లో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు కె. విశ్వనాధ్ గారు శంకరాభరణం సినిమాలో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు చెన్నై వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలలో నటించింది. నాయికగా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో నెలవంక, చెవిలో పువ్వు, జస్టిస్ చౌదరి, అభినందన, వివాహభోజనంబు, అభిలాష, పసివాడి ప్రాణం, జననీ జన్మభూమి చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి.

వివాహము

[మార్చు]

ఒక వేడుకలో పరిచయమైన చెన్నైకు చెందిన వ్యాపారవేత్తను 1990 లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత సింగపూర్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. 2004 లో వీరు తిరిగి చెన్నై వచ్చారు. తర్వాత పలు చిత్రాలు, టెలివిజన్ ధారావాహికలలో నటించడం కొనసాగించింది.

నటించిన సినిమాలు

[మార్చు]

టెలివిజన్ సిరీస్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర ఛానల్ భాష
1991 పెన్ సుజాత దూదర్శన్ తమిళం
2007–2010 మెగాలా తిలగ సన్ టీవీ
2009 కన్మనీయ అముత / రాజలక్ష్మి
2010–2012 నం.23 మహాలక్ష్మి నివాసం జెమిని టీవీ తెలుగు
2010–2011 కస్తూరి భాగ్యం సన్ టీవీ తమిళం
2011–2012 పిరివోం శాంతిప్పోం 1 ధనం విజయ్ టీవీ
2012 చెల్లమే పార్వతి సన్ టీవీ
2012–2014 పిలై నీల నీలవేణి
పార్థ జ్ఞానబగం ఇల్లయో కళావతి కలైంజర్ టీవీ
2013 పిరివోం శాంతిప్పోం 2 ధనం విజయ్ టీవీ
2013–2015 దేవమగళ్ సంపూర్ణం సన్ టీవీ
2014 అమ్మ జెమిని టీవీ తెలుగు
2017–2019 రాజా రాణి లక్ష్మీ రాజశేఖర్ స్టార్ విజయ్ తమిళం
అళగు దేవి మణిమారన్ సన్ టీవీ
2019 కనులు మూసిన నీవాయీ జగదంబ స్టార్ మా తెలుగు
2020 ఎన్నెన్నో జన్మల బంధం రాణి
2020 వదినమ్మ పార్వతి
2020–2025 భాగ్యలక్ష్మి ఈశ్వరి స్టార్ విజయ్ తమిళం
2021–2022 అన్బే వా సరస్వతి సన్ టీవీ
పాండియన్ స్టోర్స్‌ ఈశ్వరి స్టార్ విజయ్
2024–ప్రస్తుతం అన్నం షెన్‌బాగవల్లి సన్ టీవీ

నిర్మాతగా

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (9 January 2022). "సీనియర్ నటి రాజ్యలక్ష్మీ తనయుడు హీరోగా 'పల్లె గూటికి పండగొచ్చింది'". Archived from the original on 9 January 2022. Retrieved 9 January 2022.