జంబలకిడిపంబ (2018 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జంబ లకిడి పంబ 2018 జూన్ 22న విడుదలైన తెలుగు హాస్య సినిమా.

కథ[మార్చు]

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ వరుణ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ పల్లవి(శ్రీనివాస రెడ్డి, సిద్ధి ఇద్నానీ) ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. ఏడాదిలోపే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. దాంతో విడిపోవాలనుకుంటారు. ఇలాంటి జంటలకు విడాకులు ఇప్పించడమే పనిగా పెట్టుకున్న న్యాయవాది హరిశ్చంద్ర ప్రసాద్‌(పోసాని కృష్ణ మురళి)ని సంప్రదిస్తారు. వరుణ్‌, పల్లవిలను విడగొడితే వంద జంటలకు విడాకులు ఇప్పించిన న్యాయవాదిగా గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కుతానని హరిశ్చంద్ర ప్రసాద్‌ సంబరపడుతుంటాడు. ఇంతలో హరిశ్చంద్ర ప్రసాద్‌ తన భార్యతో కలిసి గోవా యాత్రకి వెళ్తాడు. మార్గమధ్యలో జరిగిన ప్రమాదంలో ఇద్దరూ చనిపోతారు. పైకి వెళ్లాక దేవుడు హరిశ్చంద్రను రానివ్వడు. ఇదేంటని హరిశ్చంద్ర దేవుడిని అడిగితే.. నువ్వు విడగొట్టాలనుకున్న వందో జంటను కలిపితేనే నీ భార్య వద్దకు నిన్ను పంపుతాను అని చెప్తాడు. అప్పుడు ఆత్మ రూపంలో కిందకి దిగివచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్..‌ వరుణ్‌, పల్లవిలను కలపడానికి ఎన్ని పాట్లు పడ్డాడు? అనేవి మిగిలిన కథలో భాగం.[1]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • సంగీతం: గోపీ సుందర్
  • ఛాయాగ్ర‌హ‌ణం: స‌తీశ్ ముత్యాల‌
  • క‌ళ‌: రాజీవ్ నాయ‌ర్‌
  • నిర్మాణం: ర‌వి, జోజో జోస్‌, శ్రీనివాస్‌రెడ్డి.ఎన్
  • ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: జె.బి. ముర‌ళీకృష్ణ (మ‌ను)
  • నిర్మాణ సంస్థ‌: శివ‌మ్ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్ ప్రొడ‌క్ష‌న్స్

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జంబలకిడిపంబ