హరితేజ
స్వరూపం
హరితేజ | |
---|---|
జననం | హరితేజ 1989 ఫిబ్రవరి 26 |
జాతీయత | భారతీయురాలు |
విద్య | గ్రాడ్యుయేషన్ |
వృత్తి | నటి, యాంకర్, కూచిపూడి నృత్యకారిణి |
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | దీపక్ రావు |
హరితేజ (జననం: 1989 ఫిబ్రవరి 26) తెలుగు సినిమా నటి, యాంకర్. ఆమె బిగ్‌బాస్ తొలి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని ఫైనల్ వరకు వచ్చింది.[1] ఆమె స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి.
బాల్యం, విద్యాభాస్యం
[మార్చు]హరితేజ 1989, ఫిబ్రవరి 26న తిరుపతిలో జన్మించింది. ఆమె అమ్మానాన్నలది ప్రేమ వివాహం. నాన్నది మరాఠీ కుటుంబం, అమ్మది కన్నడ కుటుంబం. తండ్రి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి. ఆమె చదువు పూర్తి చేశాక, మీడియాలో అడుగు పెట్టింది. హరితేజ 2015లో దీపక్ రావును వివాహమాడింది.[2][3]2021 ఏప్రిల్ 5న ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.[4]
సినీ ప్రస్థానం
[మార్చు]హరితేజ 2007లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యింది. ‘అ ఆ’ సినిమాలోని మంగమ్మ పాత్రతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
టీవీ సీరియళ్లు
[మార్చు]సంవత్సరం | కార్యక్రమం | పాత్ర | ఛానల్ | ఫలితం |
---|---|---|---|---|
2011-2016 | మనసు మమత | అర్చన, సూర్య తేజ, జయంతి | ఈటీవీ తెలుగు | |
2013 | రక్త సంబంధం | భారతి | జెమినీ టీవీ | |
2013 | అభిషేకం | పల్లవి | ఈటీవీ తెలుగు | |
2014 | కన్యాదానం | కళ్యాణి | జీ తెలుగు | |
2015 | చిన్నారి | అనిత | జెమినీ టీవీ | |
2015 | తాళి కట్టు శుభవేళ | భువన | స్టార్ మా | |
2015 | శివరంజని | రజిని | స్టార్ మా | |
2015 | సెల్ మీ ది ఆన్సర్ | కంటెస్టెంట్ | స్టార్ మా | |
2016 | అరకు రోడ్ లో | |||
2017 | బిగ్‌బాస్ 1 | కంటెస్టెంట్ | స్టార్ మా | 3వ స్థానం |
2017 | ఫిదా | వ్యాఖ్యాతగా | జెమినీ టీవీ | |
2018 | మహారాణి | కంటెస్టెంట్ | జీ తెలుగు | |
సిక్స్త్ సెన్స్ | కంటెస్టెంట్ | స్టార్ మా | ||
కాష్ దొరికినంత దోచుకో | కంటెస్టెంట్ | ఈటీవి | ||
పటాస్ | అతిధిగా | ఈటీవీ ప్లస్ | ||
బ్లాక్ బస్టర్ | కంటెస్టెంట్ | జెమినీ టీవీ | ||
సొగసు చూడ తరమ | వ్యాఖ్యాతగా | జెమినీ టీవీ | ||
పండగ చేస్కో | వ్యాఖ్యాతగా | ఈటీవీ తెలుగు | ||
2019 | సూపర్ సింగర్ | వ్యాఖ్యాతగా | స్టార్ మా | |
2019 | పండగచేస్కో | వ్యాఖ్యాతగా | ఈటీవీ తెలుగు | |
2020 | బిగ్‌బాస్ 4 | అతిధిగా | స్టార్ మా |
సినిమాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Bigg Boss Telugu: Jr NTR's TV show begins today, here is the list of celebrities who may enter the house". The Indian EXPRESS. Retrieved 2017-07-17.
- ↑ "Actress Hariteja and Deepak Wedding Photos". lovelytelugu. Archived from the original on 2021-04-16. Retrieved 2021-04-15.
- ↑ "BB Telugu fame Hariteja shares an emotional note for hubby Deepak on 5th wedding anniversary; read post". indiatimes. 2020-04-23. Retrieved 2020-12-08.
- ↑ Sakshi, హోం » సినిమా (6 April 2021). "పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హరితేజ". Archived from the original on 6 ఏప్రిల్ 2021. Retrieved 15 April 2021.