47 డేస్ (2020 సినిమా)
47 డేస్ | |
---|---|
దర్శకత్వం | ప్రదీప్ మద్దాలి |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | జికె |
కూర్పు | ఎస్ఆర్ శేఖర్ |
సంగీతం | రఘు కుంచె |
నిర్మాణ సంస్థ | టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ |
పంపిణీదార్లు | జీ5 |
విడుదల తేదీs | 30 జూన్, 2020 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
47 డేస్, 2020 జూన్ 30న విడుదలైన తెలుగు సినిమా. టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానరులో విజయ్ డొంకాడ, రఘు కుంచె, శ్రీధర్ మక్కువ, దబ్బార శశి భూషణ్ నాయుడు నిర్మించిన ఈ సినిమాకి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. ఇందులో సత్యదేవ్ కంచరాన, పూజ ఝవేరి నటించగా, రఘు కుంచె సంగీతం అందించాడు.[1][2]
కథా నేపథ్యం
[మార్చు]ఏసిపి సత్యదేవ్, భార్య పద్దు మరణిస్తుంది. తన భార్య మరణానికి కారణమైన కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు, సత్యదేవ్ ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి, తన భార్య మరణానికి కారణం తెలుసుకున్నాడా, ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.
నటవర్గం
[మార్చు]- సత్యదేవ్ కంచరాన (సత్యదేవ్)
- పూజ ఝవేరి (జూలియట్)
- రోషిణి ప్రకాష్ (పద్దు)
- సత్య ప్రకాష్ (షఫీ)
- హరి తేజ (జుంబా ట్రైనర్)
- రవివర్మ (రవి)
- శ్రీకాంత్ అయ్యంగర్
- ఇర్ఫాన్
- బేబీ అక్షర (స్వేచ్ఛ)
- ముఖ్తర్ ఖాన్
- కిరీటి దామరాజు
- అశోక్ కుమార్
- అప్పాజీ అంబరీష దర్భా (బీచ్ జాగర్)
నిర్మాణం
[మార్చు]పూరీ జగన్నాధ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ప్రదీప్ మద్దాలి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2017లో రోగ్ సినిమా షూటింగ్ లో సత్యదేవ్ ను కలిశాడు. 2011లో ప్రదీఫ్ తీసిన జూలియట్ అనే షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది, 2018లో సినిమా షూటింగ్ ప్రారంభించబడింది. ఈ సినిమాలో ఏసిపి పాత్ర పోషించడానికి సత్యదేవ్ సంతకం చేశాడు. ఈ సినిమా నిర్మాతలు 47 డేస్ అనే పేరు కోసం 1981లో చిరంజీవి నటించిన 47 రోజులు సినిమా నుండి అనుమతి పొందారు. కరోనా వైరస్ 2019 కారణంగా విడుదల ఆలస్యమై 2020, జూన్ 30న జీ5లో విడుదలైంది.[3][4]
సంగీతం
[మార్చు]ఈ సినిమాలోని పాటలను రఘు కుంచె స్వరపరిచాడు. 2018 వాలెంటైన్స్ డే సందర్భంగా పూరీ జగన్నాథ్, "క్యా కరూన్" అనే పాటను విడుదల చేశాడు. లక్ష్మీభూపాల్ రాసిన ఈ పాటలను నీహా కడివేటి పాడింది. [4]
స్పందన
[మార్చు]టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన నీషితా న్యాపతి ఈ సినిమాకి 2/5 రేటింగ్ ఇచ్చింది.[5] "సత్యదేవ్ నటన కోసం ఈ సినిమా చూడవచ్చు" అని ది హిందూకు చెందిన సంగీత దేవి దుండూ రాసింది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "First look motion poster of Satya Dev, Pooja Jhaveri and Pradeep Maddali's '47 Days' released - Times of India". The Times of India. Retrieved 2021-02-16.
- ↑ "I'm glad the audience finally gets to watch 47 Days: Pradeep Maddali - Times of India". The Times of India. Retrieved 2021-02-16.
- ↑ "Satyadev's mystery thriller 47 Days to have a direct-OTT release - Times of India". The Times of India. Retrieved 2021-02-16.
- ↑ 4.0 4.1 "'47 Days – The Mystery Unfolds' scheduled for summer release - Times of India". The Times of India. Retrieved 2021-02-16.
- ↑ Nyayapati, Neeshita (30 June 2020). "47 Days Movie Review: A missed opportunity!". Times of India. Retrieved 2021-02-16.
- ↑ Dundoo, Sangeetha Devi (2020-06-30). "'47 Days' movie review: Barring Satyadev's performance, there's nothing to root for". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-02-16.