Jump to content

అ ఆ

వికీపీడియా నుండి
A Aa
దర్శకత్వంత్రివిక్రం శ్రీనివాస్
రచనత్రివిక్రం శ్రీనివాస్
నిర్మాతఎస్. రాధాకృష్ణ
తారాగణంనితిన్
సమంత
అనుపమా పరమేశ్వరన్
ఛాయాగ్రహణంనటరాజన్ సుబ్రహ్మణ్యం,
డూడ్లీ[1]
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
హారిక & హాసిని క్రియేషన్స్
విడుదల తేదీ
2 జూన్ 2016 (2016-06-02)
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బడ్జెట్రూ.35 కోట్లు

అ ఆ 2016 జూన్ 2 న విడుదలైన తెలుగు శృంగార హాస్య ప్రధాన చిత్రం. చిత్రానికి రచన, దర్శకత్వం త్రివిక్రం శ్రీనివాస్ చేపట్టారు. సినిమాను హారిక & హాసిన క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించారు. ప్రధాన పాత్రల్లో నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ నటించారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు మిక్కీ జె. మేయర్ అందించగా, డుడ్లీ ఛాయాగ్రహణం నిర్వహించారు.[1][2]

24 సెప్టెంబర్ 2015న హైదరాబాదు లో చిత్ర నిర్మాణం లాంఛనంగా ప్రారంభం కాగా 16 అక్టోబర్ 2015న చిత్రీకరణ ప్రారంభమైంది. సినిమా ఆడియో మే 2, 2016న విడుదల కాగా,[3] జూన్ 2 2016న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయినది.[4]

ఉత్తమ సంగీత దర్శకుడు , మిక్కీ జే మేయర్ , నంది పురస్కారం .

రామలింగం (నరేష్), మహాలక్ష్మి (నదియా)ల కూతురు అనసూయ (సమంత) ఎంట్రీతో సినిమా మొదలవుతోంది. తన జీవితంలో ప్రతి నిర్ణయం తన తల్లే తీసుకుంటుందన్న బాధలో ఉంటుంది అనసూయ. తన 23వ పుట్టినరోజు సందర్భంగా మహాలక్ష్మీ, ఓ కోటీశ్వరుడు మనవడితో అనుసూయకు పెళ్ళిచూపులు ప్లాన్ చేస్తుంది. ఆ నిర్ణయం నచ్చక అనసూయ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. ఆ ప్రయత్నం విఫలం కావడంతో తిరిగి అమ్మ చేతిలో తిట్లు తింటుంది. అదే సమయంలో మహాలక్ష్మి వ్యాపార పని మీద చెన్నై వెళ్లటంతో తండ్రి సాయంతో ఆ పెళ్ళి చూపులను రద్దు చేయిస్తుంది అనసూయ. మహాలక్ష్మి ఇంట్లో లేని సమయాన్ని ఆనందంగా గడపటం కోసం విజయవాడ దగ్గర కల్వపూడిలో ఉంటున్న మేనత్త కామేశ్వరి (ఈశ్వరీ రావ్) ఇంటికి వెళుతుంది.

నగరంలో డాబుగా పెరిగిన అనసూయ అవసరాలు తీర్చటం, కామేశ్వరి కొడుకు ఆనంద్ విహారి (నితిన్)కి తలకు మించిన భారం అవుతుంది. అక్కడ ఉన్న పదిరోజుల్లో కుటుంబ బంధాల విలువ తెలుసుకుంటుంది అనసూయ. అదే సమయంలో ఆనంద్ విహారితో ప్రేమలో పడుతుంది. కానీ ఆ రెండు కుటుంబాల మధ్య జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆనంద్ తన ప్రేమను బయటకు చెప్పలేకపోతాడు. అసలు మహాలక్ష్మి, కామేశ్వరిల కుటుంబాల మధ్య ఉన్న వైరం ఏంటి..? పల్లం వెంకన్న (రావు రమేష్)కు ఆనంద్ విహారికి సంబంధం ఏంటి..? చివరికి ఆనంద్ విహారి అనసూయ రామలింగాన్ని ఎలా దక్కించుకున్నాడు అన్నదే మిగతా కథ.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

అభివృద్ధి

[మార్చు]

ఆగస్టు 2015 నెలాఖరులో నితిన్, సమంత ప్రధాన పాత్రల్లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కానుందన్న ప్రకటన వెలువడింది. సినిమాను తన హారిక & హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తారనీ వివరాలు తెలిశాయి.[6] సెప్టెంబర్ 2015 మొదటి వారంలో సినిమా రూపకర్తలు టైటిల్ ని అ ఆ - అనూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారిగా ప్రకటించారు.[7]

నటీనటుల ఎంపిక

[మార్చు]

సమంత ఈ చిత్రంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూడోసారి నటిస్తున్నారు (అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తిల తర్వాత ఇది మూడవది). సెప్టెంబరు నెల మధ్యలో అనుపమా పరమేశ్వరన్ రెండవ కథానాయికగా నటిస్తున్న విషయం నిర్ధారితమైంది.[8][9][10] సెప్టెంబరు 2015లోనే నదియా చిత్రంలో కీలకమైన పాత్ర ధరిస్తున్న విషయం తెలిసింది.[11] అక్టోబర్ 2015 మొదటివారంలో శ్రీనివాస్ అవసరాల ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రను ధరించినట్టు తెలిసింది.[12] నవంబరు తొలినాళ్ళలో కథానాయకుడి చెల్లెలు భానుమతి పాత్రను అనన్య ధరిస్తున్నట్టు తెలియవచ్చింది. ఆమె మొదట్లో ఈ పాత్రను ధరించేందుకు సుముఖత చూపించలేదనీ, కానీ పాత్ర ప్రాధాన్యతను అర్థం చేసుకుని తర్వాత అంగీకరించారని వార్తలు వచ్చాయి.[13] జనవరి మధ్యలో నరేష్ చిత్రంలో నదియా భర్త పాత్రలో నటిస్తున్నట్టు తెలిసింది.[14]

సాంకేతిక నిపుణులు

[మార్చు]

ఆగస్టు మొదటివారంలో సంగీత దర్శకత్వం వహించేందుకు అనిరుధ్ రవిచందర్ను తీసుకున్నారు, ఈ సినిమా ఆయన తొలి తెలుగు చిత్రం. కానీ తర్వాత తమిళ్ చిత్రాల్లో బిజీ షెడ్యూల్ వల్ల అనిరుధ్ కాక మిక్కీ జె.మేయర్ స్వరకర్తగా వ్యవహరించారు.[15] సినిమాటోగ్రాఫర్లుగా నటరాజన్ సుబ్రహ్మణ్యం, డూడ్లే వ్యవహరించారు.[1][16] ఆగస్టు నెల అంతంలో కోటగిరి వెంకటేశ్వరరావు కూర్పు చేస్తారని నిర్ధారితం అయింది, కళా దర్శకునిగా రాజీవన్ వ్యవహరించారు.[16] Rajeevan was replaced by A.S Prakash as the art director of this movie during late November 2015.[17]

సంగీతం

[మార్చు]

అ ఆఅ సినిమాలోని మొత్తం 5 పాటలను మిక్కీ జె. మేయర్ స్వరపరిచారు. నాలుగు పాటలను రామజోగయ్య శాస్త్రి రచించగా, ఒక పాటను కృష్ణ చైతన్య రచించారు.

1: నా వసంతం నీకు సొంతం , రమ్య బెహరా , రాహూల్ నంబియార్ , సాయి శివాని , రచన: రామజోగయ్య శాస్త్రి.

2: అనసూయ కోసం , కార్తీక్, రచన: కృష్ణ చైతన్య కార్తీక్

3: ఏళ్లిపోకే శ్యామల , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.కార్తీక్

4: యా మా, రచన: రామజోగయ్య, గానం.చిత్ర, అభయ్, జోదుపూర్కర్, అంజనా సౌమ్య, సాయిశివాని

5: మమ్మీ రీటన్స్ , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం. శ్రావణ భార్గవి.

సంభాషణలు

[మార్చు]
  • అనసూయ: సిగార్ కాలుస్తావా?
రామలింగం: మీ అమ్మకు తెలియకుండా చాలా చేస్తాలే!
అనసూయ: డాడీ, నువ్వు భలే కేడీ! నాకు పిన్ని లాంటి వారు ఎవరైనా ఉన్నారా?
  • రామలింగం: మౌనంగా ఉంటే ముని అంటారనుకొన్నాను, మగాడు అనేశారు!
  • పల్లం వెంకన్న: మరీ మినరల్ వాటర్ తో పళ్ళు తోముకొంటున్నామంటే బలుపు అనుకొంటారు రా, లేబుల్ తీసేయ్!
  • పల్లం వెంకన్న: అయ్య బాబోయ్! అలివేలు మంగమ్మకు అప్లికేషన్ పెట్టుకొంటే, ఎంకన్న స్వామి అంగీకరించినంత ఆనందంగా ఉందండి.
  • మంగమ్మ: ఎక్సర్ సైజులు, యోగాలు అయితే, "రేపటి నుండి చేస్తా" అని అనుకోవచ్చు. ఇటువంటి చెడ్డ పనులను ఇప్పుడే చేసేయ్యాలి!!
  • పల్లం వెంకన్న: రావణాసురుడి తల్లిదండ్రులు కూడా సూర్పనఖను సమంతా అనే అనుకొంటుంటారు
పల్లం వెంకన్న పుత్రుడు: నువ్వు కత్తి నాన్నోయ్!
నాగవల్లి: రావణాసురుడి భార్య కూడా ఆయన్ను పవన్ కళ్యాణ్ అనే అనుకొంటుంది
పల్లం వెంకన్న పుత్రుడు: ఇది వేట కొడవలి నాన్నోయ్!
  • ఆనంద్: వాచీ ఉన్న ప్రతి వాడు టైం వస్తుంది అనుకొంటాడు, టైం చూసుకోగలడంతే!
  • అనసూయ: చినుకులు పడే వరకు గొడుగు తెరిచి ఉంచి పట్టుకొని, చినుకులు పడగానే గొడుగు మూసేవాడిని ఏమంటారో తెలుసా? ఆ - నం - ద్ | వి - హా - రి !
  • మహాలక్ష్మి సెక్రటరీ: ఇది అమ్మాయిగారి చెప్పు! ఇది అమ్మాయిగారు విసిరితే పగిలిన కప్పు!!
  • ఆనంద్ ఇంటి పాలేరు: నోరు మూసుకొని ఇదే కొనమంటోంది అండీ!
ఆనంద్: అన్నీ మూసుకొని పర్స్ తీసుకు రారా!
  • రామలింగం: మీ అమ్మ తనకు గుర్తుంది మాత్రమే చెప్పింది. మీ అమ్మే కాదు, మనుషులంతా అంతే. లేకపోతే బ్రతకలేరు కదా!
  • ఆనంద్: మీ అమ్మ తనకు గుర్తుంది చెప్పింది. మీ నాన్న తనకు తెలిసింది చెప్పాడు. కానీ నేను, జరిగింది చెప్పాను. జరిగిందంతా గుర్తుపెట్టుకోవలసింది నేనే!
  • పల్లం వెంకన్న: శత్రువులు ఎక్కడో ఉండరు రా! కూతుళ్ళుగా, చెల్లెళ్ళుగా మన కళ్ళ ముందు ఇలాగ, ఇదుగో, మన ఇళ్ళళ్ళోనే ఉంటారు!
క్రమసంఖ్య పేరుగీత రచనArtist(s) నిడివి
1. "యా యా"  రామజోగయ్య శాస్త్రికె. ఎస్. చిత్ర, Abhay Jodhpurkar, Anjana Sowmya Sai Shivani 04:00
2. "రంగ్ దే"  రామజోగయ్య శాస్త్రిRamya Behara, Rahul Nambiar, Sai Shivani 04:01
3. "అనసూయ కోసం"  కృష్ణ చైతన్యకార్తిక్, Rap: Roll Rida 03:25
4. "మమ్మీ రిటర్న్‌స్"  రామజోగయ్య శాస్త్రిశ్రావణ భార్గవి 02:53
5. "యెల్లిపోకే శ్యామల"  రామజోగయ్య శాస్త్రికార్తిక్ 03:35
17:53

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Dilwale DOP Dudley replaces Natarajan in Nithiin's next". Times of India. Retrieved 18 March 2016.
  2. Namasthe Telangana (2 June 2021). "త్రివిక్రమ్ మ్యాజిక్‌ 'అ..ఆ'కు ఐదేళ్ళు..ఫైనల్ కలెక్షన్స్ !". Namasthe Telangana. Archived from the original on 2 జూన్ 2021. Retrieved 2 June 2021.
  3. "A Aa audio release date". Indiaglitz. Retrieved 18 April 2016.
  4. "Aa on 3rd June, Kabali on 1st July"". Archived from the original on 2016-05-17. Retrieved 2016-05-23.
  5. ఈనాడు, ఆదివారం అనుబంధం. "కాలాని అలా సాధించాను..!". తలారి ఉదయ్ కుమార్. Archived from the original on 16 ఏప్రిల్ 2020. Retrieved 16 April 2020.
  6. "Samantha-Nithiin to start shooting from September". Times of India. Retrieved 30 August 2015.
  7. "Trivikram's Samantha-Nithin starrer titled 'A Aa Anasuya Ramalingam Versu Anand Vihari'". dna India. Retrieved 10 September 2015.
  8. "Samantha-Pawan Kalyan to start shooting from September". DNA India. Retrieved 10 September 2015.
  9. "Anupama Parameswaran moving to Telugu film industry". www.sajmedia.in. Archived from the original on 15 అక్టోబరు 2015. Retrieved 14 October 2015.
  10. "Anupama Parameshwaran makes Tollywood debut". moviemint. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 11 September 2015.
  11. "Trivikram's 'A...Aa' launch date". Indiaglitz. Retrieved 21 September 2015.
  12. "Trivikram ropes in talented director for his next". 123telugu.com. Retrieved 1 October 2015.
  13. "Ananya to be part of Trivikram-Nithiin-Samantha-Anupama's Telugu film 'A..Aa'". IB Times. Retrieved 4 November 2015.
  14. "Trivikram's A.Aa Slated To Release In March". Telugodu. Archived from the original on 30 జనవరి 2016. Retrieved 21 January 2016.
  15. "Anirudh to compose for Trivikram's Telugu film". The Times of India. Retrieved 5 August 2015.
  16. 16.0 16.1 "Anirudh to make Telugu debut with Trivikram's next". Indiaglitz. Retrieved 30 August 2015.
  17. "INSIDE STORY: Finally Trivikram's ego satisfied". Apherald. Retrieved 25 November 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=అ_ఆ&oldid=4212722" నుండి వెలికితీశారు