నితిన్
నితిన్ | |
---|---|
![]() 2020 లో నితిన్ | |
జననం | నితిన్ కుమార్ రెడ్డి మార్చి 30, 1983 నిజామాబాద్, తెలంగాణ, భారతదేశం |
ఇతర పేర్లు | నితిన్ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2002–ఇప్పటివరకూ |
నితిన్ (జ: 1983 మార్చి 30) తెలుగు సినిమా నటుడు. ఇతని తండ్రి సుధాకర్ రెడ్డి నైజాం ప్రాంతంలో సినీ పంపిణీదారు.[1] అప్పటి తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్కి చెందిన నితిన్ తెలంగాణ ప్రాంతం నుంచి చలనచిత్రసీమలోకి అడుగుపెట్టిన అతికొద్ది నటుల్లో ఒకరిగా తరచూ వ్యవహరించబడుతుంటాడు. తేజ దర్శకత్వంలో విడుదలైన జయం సినిమాతో తెరంగేట్రం చేసి దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించాడు.
సినిమా కెరీర్[మార్చు]
నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి సినీ పంపిణీదారుడు కావడంతో ఇంట్లో ఎప్పుడూ సినిమా వాతావరణం మధ్యనే పెరిగాడు. నచ్చిన సినిమాను కనీసం రెండు సార్లైనా చూసేవాడు. చిన్నప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను అతని అభిమాన నటులు. ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడుగా వచ్చిన తొలిప్రేమ సినిమా చూసి తనకు కూడా నటించాలనే కోరిక కలిగింది. కరుణాకరన్ కూడా తన తండ్రికి మంచి స్నేహితుడు కావడంతో తరచూ వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.
ఒక రోజు తన స్నేహితులతో కలిసి నువ్వు నేను సినిమా చూడటానికి వెళ్ళాడు. అక్కడ ఆ సినిమా దర్శకుడు తేజ అతన్ని చూసి జయం సినిమాలో హీరోగా అవకాశమిచ్చాడు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు.[2] 2002లో విడుదలైన జయం సినిమా మంచి విజయం సాధించింది. తర్వాత వి. వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్, ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు. 2005 నుంచి 2011 దాకా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. 2012 లో వచ్చిన ఇష్క్ సినిమాతో మళ్ళీ విజయాల బాటపట్టాడు.[1]
నటించిన చిత్రాలు[మార్చు]
సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విశేషాలు |
---|---|---|---|
2002 | జయం | వెంకట్ | దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ - ఉత్తమ నూతన తెలుగు నటుడు |
2003 | దిల్ | శీను | |
2003 | సంబరం | రవి | |
2004 | శ్రీ ఆంజనేయం | అంజి | |
2004 | సై | పృథ్వి | |
2005 | అల్లరి బుల్లోడు | రాజు, మున్నా |
ద్విపాత్రాభినయం |
2005 | ధైర్యం | శీను | |
2006 | రామ్ | రామ్ | |
2007 | టక్కరి | తిరుపతి | |
2008 | ఆటాడిస్తా | జగన్ | |
2008 | విక్టరీ | విజయ్ | |
2008 | హీరో | రాధాకృష్ణ | |
2009 | ద్రోణ | ద్రోణ | |
2009 | అగ్యాత్ | సుజల్ | హిందీ సినిమా |
2009 | రెచ్చిపో | శివ | |
2010 | సీతారాముల కళ్యాణం లంకలో | చంద్ర | |
2011 | మారో | సత్యనారాయణ మూర్తి | |
2012 | ఇష్క్ | రాహుల్ | |
2013 | గుండె జారి గల్లంతయ్యిందే | కార్తిక్ | |
2013 | కొరియర్ బాయ్ కళ్యాణ్ | కళ్యాణ్ | |
2014 | హార్ట్ అటాక్ | వరుణ్ | |
2014 | చిన్నదాన నీ కోసం | నితిన్ | |
2016 | "అ ఆ" | ఆనంద్ | |
2017 | "లై" | సత్యం | |
2018 | "శ్రీనివాస కళ్యాణం " | వాసు | |
2020 | "భీష్మ" | భీష్మ | |
2021 | చెక్ | ఆదిత్య | [3] |
2021 | రంగ్ దే | అర్జున్ | [4] |
Adavi movie
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 "ఈనాడు పత్రికలో పుట్టినరోజు వ్యాసం". eenadu.net. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 15 డిసెంబర్ 2017. Retrieved 30 మార్చి 2017.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help) - ↑ ఎన్టీఆర్, రామ్, నితిన్, ఇలియానా... అందరూ మా శిష్యులే!, ఈనాడు ఆదివారం సంచిక, 4 జనవరి 2015, పుట. 20-21
- ↑ "Check Movie: Nithiin's next movie first look is out". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-10-02. Retrieved 2020-10-05.
- ↑ "Nithiin' Rang De movie shoot resumed, to release in Sankranthi 2021!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-23. Retrieved 2020-10-05.