Jump to content

గద్దలకొండ గణేష్

వికీపీడియా నుండి
గద్దలకొండ గణేష్
దర్శకత్వంహరీష్ శంకర్
రచనహరీష్ శంకర్ (డైలాగ్స్)
దీనిపై ఆధారితంతమిళ సినిమా జిగార్తండ ఆధారంగా
నిర్మాతరామ్ ఆచంట
గోపి ఆచంట
తారాగణంవరుణ్ తేజ్
అథర్వ మురళీ
పూజా హెగ్డే
మృణాళిని రవి
ఛాయాగ్రహణంఆయనంక బోస్
కూర్పుఛోటా కె. నాయుడు
సంగీతంమిక్కీ జే మేయర్
నిర్మాణ
సంస్థ
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ
20 సెప్టెంబరు 2019 (2019-09-20)
సినిమా నిడివి
172 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్₹25 కోట్లు [1]
బాక్సాఫీసుమూస:అంచనా ₹42.5 కోట్లు [2][3]

గద్దలకొండ గణేష్ 2019 సెప్టెంబరు 20లో విడుదలైన తెలుగు సినిమా. తమిళంలో హిట్టయిన "జిగార్తండ" సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రానికి మొదట ‘వాల్మీకి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఓ వర్గానికి చెందిన కొందరు ఈ టైటిల్‌పై కోర్టును ఆశ్రయించగా.. తప్పని పరిస్థితులలో దర్శక, నిర్మాతలు టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చారు.[4]

చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న మక్కువతో ఏదో ఒక రోజు డైరెక్టర్ అవుతానని అనుకుంటూ.. ప్రయత్నాలు సాగిస్తుంటాడు అభిలాష్(అథర్వ మురళి[5]). అభిలాష్ సంవత్సరంలోపు సినిమా తీస్తానని ఓ సీనియర్ దర్శకుడితో శపథం చేస్తాడు. తన సినిమాలో గ్యాంగ్ స్టర్ నేపథ్యమున్న విలన్ని.. హీరోగా చూపించాలనుకుంటాడు. అందులో భాగంగానే ఆంధ్ర, తెలంగాణ బార్డర్లో ఉన్న గద్దలకొండ గ్రామంలో విలనిజం చేసే గద్దలకొండ గణేష్(వరుణ్ తేజ్)ని ఎంచుకుని అతని ప్రతీ చర్యను గమనిస్తూ...అతని గురించిన విషయాలు ఆరాతీస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో అభిలాష్.. గణేష్ దృష్టిలో పడతాడు. అయితే గణేష్‌కి ఈ విషయమంతా తెలిసి.. తన గురించి కాదు.. తననే హీరోగా సినిమా తీయాలని అభిలాష్‌ను బెదిరిస్తాడు. మరి అభిలాష్ గద్దలకొండ గణేష్‌తో సినిమా తీశాడా.? అతను చివరికి డైరెక్టర్ అయ్యాడా.? అనేదే సినిమా కథ.[6][7]

నటీనటులు \ సినిమాలో పాత్ర పేరు

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • గగన వీదిలో, రచన: వనమాలి , గానం.అనురాగ్ కులకర్ణి, శ్వేతా సుబ్రమనియన్
  • ఎలువొచ్చి గోదారమ్మ, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల
  • జర్రా జర్రా , రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.అనురాగ్ కులకర్ణి , ఉమ నేహా
  • వకా వకా , రచన: చంద్రబోస్, గానం. అనురాగ్ కులకర్ణి, మిక్కీ జే మేయర్.

మూలాలు

[మార్చు]
  1. "Gaddalakonda Ganesh 7-day box office collection: Valmiki recovers 80% investments in week 1". IB Times. 27 September 2019.
  2. "Gaddalakonda Ganesh worldwide collections". The Hans India. 16 October 2019.
  3. "Tollywood Box office report - 2019: Highest grossing Telugu movies of the year". International Business Times. 22 December 2019.
  4. "హరీష్ శంకర్ అర్జంట్ ప్రెస్ మీట్.. 'వాల్మీకి' బన్‌‌గయా 'గద్దలకొండ ప్రసాద్'." News 18. Retrieved 2019-09-19.
  5. Chowdhary, Y. Sunita (18 September 2019). "Atharvaa makes his Telugu film debut with 'Valmiki'" – via www.thehindu.com.
  6. Sakshi (20 September 2019). "'గద్దలకొండ గణేష్‌' మూవీ రివ్యూ". Archived from the original on 24 జనవరి 2021. Retrieved 17 April 2021.
  7. BBC News తెలుగు (21 September 2019). "'గద్దలకొండ గణేష్' సినిమా రివ్యూ". BBC News తెలుగు. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  8. "Valmiki uMovie Review: Harish Shankar and Varun Tej make Gaddalakonda Ganesh their own". The Times of India. Retrieved 2019-09-20.
  9. "Varun Tej excited about Nithiin's cameo in 'Valmiki' - Times of India". The Times of India.
  10. "Director Sukumar to make a cameo in Varun Tej's Valmiki". The New Indian Express.