అథర్వ మురళీ
Appearance
అథర్వ | |
---|---|
జననం | అథర్వ మురళీ 1989 మే 7 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2010 – ప్రస్తుతం |
తల్లిదండ్రులు | మురళి, శోభా |
బంధువులు | ఎస్. సిద్ధలింగయ్య, తాతయ్య డేనియల్ బాలాజీ- బాబాయ్ |
అథర్వ మురళీ తమిళ సినీ నటుడు. ఆయన తమిళ హీరో మురళి కొడుకు, సీనియర్ డైరెక్టర్ ఎస్. సిద్ధలింగయ్య మనవడు. అథర్వ మురళీ 2010లో తమిళంలో సినిమా 'బాణకాతాడి' ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1] 2013లో తమిళ సినిమా "పరదేశి"కి గాను తమిళంలో ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు.
అథర్వ మురళీ 2019లో హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గద్దలకొండ గణేష్ సినిమాతో తెలుగు సినీరంగంలోకి ప్రవేశించాడు.[2][3]
జననం
[మార్చు]అథర్వ మురళీ చెన్నైలో 1989, మే 7న మురళి, శోభా దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి తమిళ సీనియర్ నటుడు మురళి. అథర్వకు అక్క కావ్య, తమ్ముడు ఆకాష్ మురళి[4] ఉన్నారు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
2010 | బనా కథడి | రమేష్ | |
2011 | కో | అథర్వ మురళీ | ఆగ నాగ పాటలో అతిధిగా |
2012 | ముప్పోజుధమ్ అన్ కర్పానిగల్ | రామచంద్రన్ | |
2013 | పార్దేషి | రాసా | |
2014 | ఇరుంబు కుతిరై | మైఖేల్ ప్రిథ్వీరాజ్ | |
2015 | చండి వీరన్ | పారి | |
ఇట్టి | పుగజ్హేంతి సుబ్రమణియం | ||
2016 | కణితన్ | గౌతమ్ రామలింగం | |
2017 | జెమినీ గణేషనుమ్ సురులై రాజానుమ్ | జెమినీ గణేశన్ | |
2018 | సెమ్మ బోథా ఆగతేయ్ | రమేష్ | నిర్మాత |
ఇమైక్కా నొడిగళ్ | అర్జున్ | ||
2019 | బుమేరాంగ్ | శివ/శక్తి | |
100 | ఎస్సై సత్య | ||
గద్దలకొండ గణేష్ | అభిలాష్ | తెలుగు సినిమా | |
2021 | తాళి పొగతేయ్ | పోస్ట్ ప్రొడక్షన్ | |
కురుతి ఆట్టం | షూటింగ్ | ||
ఒతైక్కు ఒతై | - | ||
రుక్కుమని వండి వారుదు | - | ||
అడ్రస్ | నిర్మాణంలో ఉంది | [5] |
మూలాలు
[మార్చు]- ↑ Posters, Movie (4 May 2010). "Murali's Praises For His Son Adharva | Tamil Movie News". News.moviegalleri.in. Archived from the original on 15 September 2010. Retrieved 18 April 2021.
- ↑ Chowdhary, Y. Sunita (18 September 2019). "Atharvaa makes his Telugu film debut with 'Valmiki'". Retrieved 18 April 2021 – via www.thehindu.com.
- ↑ Zee News India, News> Entertainment > Regional (27 March 2019). "Tamil actor Atharva Murali joins Telugu film Valmiki". Zee News. Archived from the original on 20 జనవరి 2021. Retrieved 18 April 2021.
- ↑ Sakshi, హోం » సినిమా (19 April 2021). "హీరోగా మరో వారసుడు". Archived from the original on 19 ఏప్రిల్ 2021. Retrieved 19 April 2021.
- ↑ Andhrajyothy (25 June 2021). "అధర్వ మురళి 'అడ్రస్' కనిపెడతాడా..?". andhrajyothy. Archived from the original on 25 జూన్ 2021. Retrieved 25 June 2021.