పూజా హెగ్డే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పూజా హెగ్డే
Pooja Hegde 2016 (2).jpg
2016 లో మొహెంజదారో సినిమాకు సంబంధించిన ఓ కార్యక్రమంలో పూజ
జననం (1990-10-13) 1990 అక్టోబరు 13 (వయస్సు: 29  సంవత్సరాలు)[1]
ముంబై, మహరాష్ట్ర
జాతీయతభారతీయురాలు
చదువుఎం.కాం
వృత్తినటి, మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2010–ప్రస్తుతం
ఎత్తు5 ft 8 in (173 cm)[2]

పూజా హెగ్డే (జననం: అక్టోబరు 13, 1990) ఒక భారతీయ మోడల్, నటి. పూజ 2010 లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది. దీని తరువాత 2012 లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది.[3]ఈమె 2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016 లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో సినిమాలో నటించింది.

బాల్యం[మార్చు]

పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే లది కర్ణాటక లోని మంగుళూరు కానీ ఆమె ముంబై లో పుట్టి పెరిగింది. ఆమె తన మాతృ భాషయైన తుళు తో పాటు, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడగలదు.[4] ఆమె కాలేజీలో చదివేటపుడు తల్లి నిర్వహిస్తున్న నెట్వర్క్ మానిటరింగ్ వ్యాపార వ్యవహారాలు చూసుకోవడంలో సహాయపడుతుండేది. దాంతో ఆమెకు నెట్వర్కింగ్ నైపుణ్యం అలవడింది. అప్పుడే ఇంటర్ కాలేజీ ఫ్యాషన్ పోటీల్లో, డ్యాన్స్ పోటీల్లో పాల్గొనేది.[5]

మూలాలు[మార్చు]

  1. "Pooja Hedge". Bollywood Life. Archived from the original on 2016-10-03. Retrieved 2016-09-17.
  2. "Pooja Hedge". The Times of India. Retrieved 30 May 2015.
  3. "It's not Amala Paul, a newbie bags it - Amala Paul -Pooja Hegde". 5 August 2011.
  4. 'Working with Bal Asha was amazing' - Pooja Hegde. coolage.in. 19 September 2012
  5. Manigandan, K. R. (19 August 2012). "Picture of confidence". The Hindu.