మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ | |
---|---|
దర్శకత్వం | భాస్కర్ |
కథా రచయిత | భాస్కర్ |
నిర్మాత | బన్నీ వాసు వాసు వర్మ అల్లు అరవింద్ (సమర్పణ) |
తారాగణం | అఖిల్ అక్కినేని పూజా హెగ్డే |
ఛాయాగ్రహణం | ప్రదీష్ వర్మ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | జీఏ2 పిక్చర్స్ |
విడుదల తేదీ | 15 అక్టోబర్ 2021 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తెలుగులో విడుదలైన రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ సినిమా. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు భాస్కర్ దర్శకత్వం వహించాడు. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, ఆమని, మురళి శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలైంది.[1]మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను నవంబర్ 19న ఆహా ఓటీటీలో విడుదల చేశారు.[2]
చిత్ర నిర్మాణం[మార్చు]
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా షూటింగ్ జులై 2019లో హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ పాడిన ‘మనసా మనసా’ పాటను 2 మార్చి 2020న విడుదల చేశారు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ను మార్చి 2020లో ఆపేసి తిరిగి సెప్టెంబర్ 2020లో షూటింగ్ ప్రారంభించారు.ఈ సినిమా టీజర్ ను 25 అక్టోబర్ 2020న, గుచ్చే గులాబీ పాటను ఫిబ్రవరి 13, 2021న,[3] ‘ఏ జిందగీ’ లిరికల్ పాటను ఏప్రిల్ 5,[4] 2021న విడుదల చేశారు.
నటీనటులు[మార్చు]
- అఖిల్ అక్కినేని - హర్ష
- పూజా హెగ్డే - విభా
- ఆమని
- మురళి శర్మ
- నేహా శెట్టి
- ఫరియా అబ్దుల్లా
- వెన్నెల కిషోర్
- జయప్రకాష్
- ప్రగతి
- మణిచందన
- అమిత్ తివారి
- గెటప్ శ్రీను
- సుడిగాలి సుధీర్
- అభయ్ బేతిగంటి
- కామాక్షి భాస్కర్ల
సాంకేతిక నిపుణులు[మార్చు]
- బ్యానర్: జీఏ2 పిక్చర్స్
- నిర్మాతలు: బన్నీ వాసు
వాసు వర్మ
అల్లు అరవింద్ (సమర్పణ) - కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: భాస్కర్
- సంగీతం: గోపీ సుందర్
- సినిమాటోగ్రఫీ: ప్రదీష్ వర్మ
- ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
- పాటలు: శ్రీమణి[5]
మూలాలు[మార్చు]
- ↑ TV9 Telugu (31 March 2021). "అఖిల్ -పూజల మధ్య కెమిస్టీ క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా ఉండనుందట." Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
- ↑ News18 Telugu (18 November 2021). "ఓటీటీలో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. రేపటి నుంచి స్ట్రీమింగ్." Retrieved 18 November 2021.
- ↑ Sakshi (16 February 2021). "మ్యూజిక్ ఓ హైలైట్: బొమ్మరిల్లు భాస్కర్". Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
- ↑ Namasthe Telangana (5 April 2021). "అఖిల్-పూజా యే జిందగీ లిరికల్ వీడియో సాంగ్". Archived from the original on 3 August 2021. Retrieved 3 August 2021.
- ↑ Eenadu (27 September 2021). "లెహరాయి అంటే అర్థం ఇదే". Archived from the original on 18 June 2022. Retrieved 18 June 2022.