శాన్వి మేఘన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాన్వి మేఘన
జననం1998 సెప్టెంబర్ 12
జాతీయతభారతీయురాలు
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2019 - ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
పుష్పక విమానం
తల్లిదండ్రులుమందుముల వంశీ కిషోర్, పద్మ
బంధువులువంశీ పూజిత

శాన్వి మేఘన తెలుగు సినీరంగానికి చెందిన సినిమా నటి. ఆమె 2019లో విడుదలైన బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి “పిట్ట కథలు”, “సైరా నరసింహారెడ్డి”, పుష్పక విమానం సినిమాల్లో నటించిన మంచి గుర్తింపునందుకుంది.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

శాన్వి మేఘన తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లో 1998 సెప్టెంబర్ 12న మందుముల వంశీ కిషోర్, పద్మ దంపతులకు జన్మించింది. ఆమె భవన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో పడవ తరగతి వరకు పూర్తి చేసి, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసింది.

సినిమా జీవితం

[మార్చు]

శాన్వి మేఘన విద్యార్థిగా ఉండగా ఆమె చదివే క్యాంపస్ లో సినిమాల షూటింగ్స్ జరుగుతుండేవి అక్కడ ఆమెను చూసి, ఓ సీరియల్ ఆడిషన్ కోసం పిలిచారు. జయసుధ ఆ టీవీ ప్రోగ్రాంకి నిర్మాత. కానీ అనుకోని కారణాల రెండు ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత ఆ టీవీ కార్యక్రమం ఆగిపోయింది. ఆమెకు ఆ తరువాత బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ సినిమాలో అవకాశం వచ్చింది.  

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు మూలాలు
2019 బిలాల్‌పూర్ పోలీస్ స్టేషన్ శ్రీలత తొలి సినిమా
2019 సైరా నరసింహారెడ్డి
2021 పిట్ట కథలు రాముల [3]
2021 పుష్పక విమానం రేఖ [4][5]
2023 ప్రేమ విమానం [6]
2023 నేనే సరోజ [7]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (10 November 2021). "రెండు ఎపిసోడ్స్‌ షూట్‌ చేశాక జయసుధ భర్త చనిపోయారు: నటి". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
  2. V6 Velugu (5 December 2021). "యాక్టింగ్ వైపు రావాలనుకోలేదు" (in ఇంగ్లీష్). Archived from the original on 6 December 2021. Retrieved 6 December 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. The Hindu (19 February 2021). "'Pitta Kathalu' movie review: Into a darker zone". The Hindu (in Indian English). Archived from the original on 5 June 2021. Retrieved 26 June 2021.
  4. Sakshi (12 November 2021). "'పుష్పక విమానం' మూవీ రివ్యూ". Archived from the original on 13 November 2021. Retrieved 13 November 2021.
  5. TV9 Telugu (10 November 2021). "ఆ స్టార్ డైరెక్టర్ నన్ను తమన్నా సిస్టర్ లా ఉంది అన్నారు : శాన్వి మేఘన". Archived from the original on 18 సెప్టెంబర్ 2023. Retrieved 18 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link)
  6. A. B. P. Desam (20 April 2023). "'ప్రేమ విమానం'లో అనసూయ - ఇంకా సంగీత్ & శాన్వి". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
  7. NTV Telugu (12 December 2022). "'నేనే సరోజ' అంటున్న శాన్వి మేఘన!". Archived from the original on 18 సెప్టెంబర్ 2023. Retrieved 18 September 2023. {{cite news}}: Check date values in: |archivedate= (help)

బయటి లింకులు

[మార్చు]