నేహా శెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేహా శెట్టి
జననం (1999-12-06) 1999 డిసెంబరు 6 (వయసు 24)
విద్యాసంస్థన్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం

నేహా శెట్టి భారతదేశానికి చెందిన సినిమా నటి, మోడల్. ఆమె 2016లో కన్నడ సినిమా ముంగారు మలే 2తో సినీరంగంలోకి ఆడుగుపెట్టి తెలుగులో మెహబూబా, గల్లీ రౌడీ, డీజే టిల్లు సినిమాల్లో నటించింది.

జీవిత విశేషాలు[మార్చు]

నేహా శెట్టి కర్నాటకలోని మంగళూరులో పుట్టి బెంగళూరులో పెరిగింది. తల్లి దంతవైద్యురాలు, ఆమె తండ్రి వ్యాపారవేత్త. ఈమెకు ఒక చెల్లెలు ఉన్నది.[1] [2]

సినిమారంగం[మార్చు]

మోడలింగ్‌ లోకి వచ్చిన నేహా, 2014లో మిస్ మంగళూరు అందాల పోటీతో గెలిచింది. మిస్ సౌత్ ఇండియా 2015 రన్నరప్‌గా నిలిచింది.[3] దర్శకుడు శశాంక్ తీసిన కన్నడ చిత్రం ముంగారు మలే 2లో నటించింది.[4] [5] ఈ చిత్రం మిశ్రమ సమీక్షలను పొందినప్పటికీ, నేహా నటనకు ప్రశంసలు లభించాయి.[6]

తరువాత, పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం మెహబూబా (2018)లో నటించింది. ఈ సినిమా కోసం తెలుగు భాష నేర్చుకున్నది. [7] మెహబూబా తరువాత, నేహా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సును అభ్యసించడానికి ఆరు నెలల విరామం తీసుకున్నది.[8] [9]

2021లో నేహా రెండు సినిమాల్లో నటించింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో చిన్న పాత్రతోపాటు గల్లీ రౌడీలో ప్రధాన పాత్ర పోషించింది.[10] 2022లో, డిజే టిల్లు సినిమాలో నటించింది.[11]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర విషయాలు మూలాలు
2016 ముంగారు మగ 2 నందిని కన్నడ [12]
2018 మెహబూబా అఫ్రీన్ / మదిర తెలుగు [13]
2021 గల్లీ రౌడీ పాతపగలు సాహిత్యం తెలుగు [14]
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మేఘా తెలుగు [14]
2022 డిజే టిల్లు రాధిక తెలుగు [15]
2023 బెదురులంక 2012 చిత్ర తెలుగు [16]
రూల్స్ రంజన్ తెలుగు [17]
గ్యాంగ్స్ అఫ్ గోదావరి తెలుగు [18]

మూలాలు[మార్చు]

  1. Pecheti, Prakash (2022-02-07). "Neha Shetty is in a celebratory mood". Telangana Today.
  2. SM, Shashi Prasad (2015-07-22). "Meet Neha Shetty, the newbie in town". Deccan Chronicle.
  3. SM, Shashi Prasad (2015-07-22). "Meet Neha Shetty, the newbie in town". Deccan Chronicle.
  4. "Neha Shetty is 'Mungaru Male 2' heroine 1". Sify. Archived from the original on 2015-07-14. Retrieved 2022-04-18.
  5. "Shashank Finds his Mungaru Male Girl in Neha Shetty". The New Indian Express. 11 July 2015.
  6. SM, Shashiprasad (2016-09-21). "It's 'raining' praise for Neha Shetty". Deccan Chronicle.
  7. George, Nina C (2018-01-19). "'I am a very hyper person'". Deccan Herald.
  8. Pecheti, Prakash (2022-02-07). "Neha Shetty is in a celebratory mood". Telangana Today.
  9. "I am ready to press the refresh button for my acting career, says Neha Shetty". The New Indian Express. 13 June 2020.
  10. Pecheti, Prakash (2022-02-07). "Neha Shetty is in a celebratory mood". Telangana Today.
  11. Pathi, Thadhagath (2022-02-12). "DJ Tillu Movie Review: Siddhu Jonnalagadda and Neha Shetty steal the show". The Times of India.
  12. S, Shyam Prasad (10 September 2016). "Movie Review | Mungaru Male 2". Bangalore Mirror.
  13. Kumar, Hemanth (2018-05-11). "Mehbooba movie review : Puri Jagannadh's latest film starring Akash Puri, Neha Shetty is a giant catastrophe-Entertainment News, Firstpost". Firstpost.
  14. 14.0 14.1 Pecheti, Prakash (2022-02-07). "Neha Shetty is in a celebratory mood". Telangana Today.
  15. "డిజె టిల్లు చూస్తే నవ్వులతో పాండమిక్‌ ఒత్తిడి అంతా మర్చిపోతారు" (in ఇంగ్లీష్). 5 February 2022. Archived from the original on 26 October 2022. Retrieved 26 October 2022.
  16. "Neha Shetty's First Look As Chitra From Bedurulanka 2012 Unveiled". 6 December 2022.
  17. "Kiran Abbavaram 'రూల్స్‌ రంజన్' షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన డైరెక్టర్ క్రిష్". Samayam Telugu.
  18. "#VS11 titled Gangs of Godavari; arresting glimpse out". 31 July 2023.

బయటి లింకులు[మార్చు]