బెదురులంక 2012
బెదురులంక 2012 | |
---|---|
దర్శకత్వం | క్లాక్స్ |
రచన | క్లాక్స్ |
నిర్మాత | రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) |
తారాగణం | కార్తికేయ నేహా శెట్టి అజయ్ ఘోష్ వెన్నెల కిశోర్ |
ఛాయాగ్రహణం | సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి |
కూర్పు | విప్లవ్ నైషధం |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2023 ఆగష్టు 25[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బెదురులంక 2012 2023లో విడుదలైన తెలుగు సినిమా. సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ) నిర్మించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. కార్తికేయ, నేహా శెట్టి, అజయ్ ఘోష్, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను నటుడు నాని విడుదల చేయగా[2], టీజర్‌ను 2023 ఫిబ్రవరి 10న[3], ట్రైలర్‌ను ఆగస్ట్ 16న విడుదల చేసి[4] సినిమాను ఆగస్టు 25న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- కార్తికేయ
- నేహా శెట్టి
- అజయ్ ఘోష్
- వెన్నెల కిశోర్
- సత్య
- రాజ్ కుమార్ కసిరెడ్డి
- శ్రీకాంత్ అయ్యంగర్
- ఆటో రాంప్రసాద్
- గోపరాజు రమణ
- ఎల్బీ శ్రీరామ్
- సురభి ప్రభావతి
- కట్టయ్య
- దివ్య నార్ని
కథ
[మార్చు]హైదరాబాద్‌లో గ్రాఫిక్ డిజైనర్‌గా ఉద్యోగం చేసుకుంటున్న శివ (కార్తికేయ) తన పై అధికారితో మాట వచ్చి ఉద్యోగం మానేసి తన సొంతవూరు బెదురులంక వచ్చేస్తాడు. అతను ప్రేమించిన ప్రెసిడెంట్ కుమార్తె చిత్ర (నేహా శెట్టి) ని పెళ్ళిచేసుకోవాలని అనుకుంటాడు. 2012లో యుగాంతం పుకార్ల కారణంగా ఊరి ప్రజలు భయాందోళనలకు గురవుతుంటారు. ప్రజల్లోని భయం, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భూషణం (అజయ్ ఘోష్), డానియల్ (ఆటో రామ్ ప్రసాద్), బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్) లతో కలిసి ఊరిని దోచుకోవాలని అనుకుంటాడు. ఇంతకీ యుగాంతం వచ్చి ఆ బెదురులంక ఊరు కొట్టుకుపోయిందా? ఈ క్రమంలో శివకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? శివ, చిత్రలు పెళ్లి చేసుకుంటారా లేదా? అనేదే మిగతా సినిమా కథ.[5]
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పనేని (బెన్నీ)
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్లాక్స్ (ఉద్దరాజు వెంకట కృష్ణ పాండురంగ రాజు)[6][7][8]
- సంగీతం: మణిశర్మ
- సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి
- ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
- ఎడిటింగ్: విప్లవ్ నైషధం
- సౌండ్ డిజైన్ - వినోత్ థానిగాసాళం
- ఫైట్స్: అంజి, పృథ్వి రాజ్
- పాటలు: సిరివెన్నెల సీతారామశాస్ట్రీ, కిట్టు విస్సాప్రగడ, కృష్ణ చైతన్య
- కోరియోగ్రఫీ: బృందా మాస్టర్, మొయిన్ మాస్టర్
- కాస్ట్యూమ్ డిజైనర్: అనూష పుంజాల
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: దుర్గారావు గుండా
- కో - ప్రొడ్యూసర్స్ : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నాల
మూలాలు
[మార్చు]- ↑ V6 Velugu (8 July 2023). "'బెదురులంక 2012'.. రిలీజ్ డేట్ ఫిక్స్". Archived from the original on 13 August 2023. Retrieved 13 August 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ 10TV Telugu (30 November 2022). "బెదురులంక 2012 ఫస్ట్ లుక్.. ఇది అప్పుడు రావాల్సిన సినిమానా..?". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ A. B. P. Desam, A. B. P. (10 February 2023). "సిగరెట్‌ను మించిన కిక్, వాటే కంటెంట్ - 'బెదురులంక 2012' టీజర్ వచ్చిందిరోయ్". Archived from the original on 10 ఫిబ్రవరి 2023. Retrieved 10 February 2023.
- ↑ Namasthe Telangana (16 August 2023). "యుగాంతం వలయంలో బెదురులంక.. ఆసక్తిరేకెత్తిస్తున్న ట్రైలర్". Archived from the original on 16 August 2023. Retrieved 16 August 2023.
- ↑ Eenadu (25 August 2023). "రివ్యూ: బెదురులంక 2012.. కార్తికేయ కొత్త మూవీ మెప్పించిందా?". Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ Eenadu (20 August 2023). "ఆ మాటే నా కథకి స్ఫూర్తి". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
- ↑ Eenadu (20 August 2023). "'సెవెన్ సమురాయ్'లో డైలాగ్ స్ఫూర్తితో 'బెదురులంక 2012' తీశాం". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.
- ↑ Andhra Jyothy (20 August 2023). "ఆ రెండు చిత్రాల స్ఫూర్తితో." Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.