Jump to content

గోపరాజు రమణ

వికీపీడియా నుండి
గోపరాజు రమణ
జననంగోపరాజు యజ్ఞేశ్వర వెంకట రమణామూర్తి
1952, ఏప్రిల్ 5
ప్రసిద్ధిరంగస్థల, టివీ, రేడియో నటుడు, రచయిత, దర్శకుడు, సినిమా నటుడు
భార్య / భర్తలీలా అన్నపూర్ణ విశాలాక్షి
పిల్లలుగోపరాజు విజయ్ (నటుడు, దర్శకుడు)
తండ్రిహనుమంతారావు
తల్లిబాలా త్రిపురసుందరమ్మ

గోపరాజు రమణ, (ఆంగ్లం: Goparaju Ramana) తెలుగు నాటకరంగ, టివీ, సినిమా నటుడు.[1] నాటకరంగంలో అనేక నాటకాల్లో నటించి ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్నాడు.[2] మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరో తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు.[3]

జననం

[మార్చు]

రమణ 1952, ఏప్రిల్ 5న హనుమంతారావు - బాలా త్రిపురసుందరమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని కొలకలూరు గ్రామంలో జన్మించాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

రమణకు లీలా అన్నపూర్ణ విశాలాక్షితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు (గోపరాజు విజయ్) ఉన్నాడు. విజయ్ నటుడిగా, దర్శకుడిగా రాణిస్తున్నాడు.[5]

కళారంగం

[మార్చు]

10వ తరగతిలో ఉన్నప్పుడు మానవుడి అడుగుజాడల్లో అనే నాటకంతో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. 1967లో బాలానందం అనే నాటక సంస్థలో చేరాడు.[4] నాటకరంగంలో నటుడిగా రమణకి మంచి అనుభవం ఉంది. అంతేకాకుండా పలు సీరియళ్ళలోనూ, సినిమాల్లోనూ నటించాడు. 2005లో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన గ్రహణం సినిమాలో రమణ తొలిసారిగా నటించాడు. ఈ తరువాత మాయాబజార్, గోల్కొండ హైస్కూల్, అష్టాచెమ్మా వంటి సినిమాలలో వివిధ పాత్రలు పోషించాడు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో బాలకృష్ణ గురువుగా నటించాడు.[6] రవీంద్రభారతిలో జరిగిన నాటక ప్రదర్శనలో రమణ నటన చేసిన దర్శకుడు వినోద్ అనంతోజు, మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలోని ‘కొండల్రావ్’ పాత్రకి ఎంపిక చేశాడు.

నటించినవి

[మార్చు]

నాటకాలు/నాటికలు

[మార్చు]
  • అనుబంధాలు
  • రక్తజ్వాల
  • నోరుముయ్
  • చరిత్రకు చమటలు పడుతున్నాయి
  • నేరస్తుడెవరు
  • నాగమండల
  • చాలు ఇకచాలు
  • తలుపులు తెరిచే ఉన్నాయి
  • కుక్కపిల్ల
  • బైపాస్
  • శ్రీకారం
  • మనసులు కలిస్తే
  • గమ్మస్థానాల వైపు

సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర గమనికలు మూ
2004 గ్రహణం సుబ్రమణ్యం
2005 దేవీఅభయం
2006 మాయాబజార్ మారువేషంలో నారదుడు
సుందరానికి తొందరెక్కువ
2008 అష్టాచెమ్మా రాంబాబు పెంపుడు తండ్రి
2010 బెట్టింగ్ బంగార్రాజు
2011 గోల్కొండ హైస్కూల్ లియాఖత్ భాయ్
2012 ఓనమాలు
2014 మాపల్లె రేపల్లంట
2016 వీలైతే ప్రేమిద్దం
2017 గౌతమి పుత్ర శాతకర్ణి పూజారి
2019 ఎన్టీఆర్: మహానాయకుడు ప్రభుత్వ ఉద్యోగి
2020 మిడిల్ క్లాస్ మెలోడీస్ కొండల్రావు
2021 క్రాక్ పిసి మూర్తి
3 రోజెస్
మహా సముద్రం లక్ష్మీపతి
2022 గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు నాగరాజు
ఆడవాళ్ళు మీకు జోహార్లు చిరు మామ
అశోకవనంలో అర్జున కల్యాణం అర్జున్ మేనమామ
స్వాతిముత్యం భాగీ మేనమామ
ఎఫ్ 3 వెంకీ తండ్రి
సమ్మతమే కృష్ణ తండ్రి
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చలపతి
18 పేజీలు బస్ కండక్టర్
2023 వేట మూర్తి
వీర సింహ రెడ్డి ప్రధాన పూజారి
బెదురులంక 2012 గ్రామ అధ్యక్షుడు
భువన విజయమ్ చలపతి
ప్రేమ విమానం
ఓటు
రంగబలి విశ్వం
రచయిత పద్మభూషణ్ లోకేంద్ర కుమార్
కస్టడీ ధర్మరాజు తమిళంలో ఏకకాలంలో తీశారు
రూల్స్ రంజన్
సామజవరగమన గుమస్తా
మార్టిన్ లూథర్ కింగ్
2024 అంబాజీపేట మ్యారేజి బ్యాండు నరసింహ
గీతాంజలి మళ్లీ వచ్చింది టీ అమ్మేవాడు
ఆ ఒక్కటీ అడక్కు ప్రమాదంలో బాధితుడు
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి దొరస్వామి రాజు
యేవమ్ ఎం. గంగాధర్
కమిటీ కుర్రోళ్లు వెంకట్రావు
ధూమ్ ధామ్
ఉరుకు పటేల
భలే ఉన్నాడే
జనక అయితే గనక
శ్వాగ్
ధూం ధాం
లీలా వినోదం
అక్రమార్జన

టెలివిజన్

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్ మూ
1999–2000 సంఘర్షణ ETV
2000–2002 విధి
2003–2007 పద్మవ్యూహం
2014–2019 ముద్ద మందారం పారు తండ్రి జీ తెలుగు
2015–2022 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ETV
2018–2019 మహాలక్ష్మి జెమినీ టీవీ
2020–2021 గిరిజా కళ్యాణం (ధారావాహిక) లక్ష్మీ నారాయణ
2021 3 గులాబీలు ఇందు మామ ఆహా

అవార్డులు, పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Goparaju Ramana". www.filmibeat.com. Archived from the original on 2020-12-04. Retrieved 2022-04-05.
  2. India, The Hans (2020-11-04). "Actor Sreeramulu suggesting me for role of Prakasam was biggest award, says Ramana". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.
  3. EENADU (10 August 2022). "ఈ 'మిడిల్‌క్లాస్‌' కొండలరావు ఎవరు?". www.eenadu.net. Archived from the original on 2024-05-25. Retrieved 2024-05-25.
  4. 4.0 4.1 "Goparaju Ramana". starsunfolded.com. Archived from the original on 2021-06-14. Retrieved 2022-04-05.
  5. యడవల్లి, శ్రీనివాసరావు (2024-08-20). "నాలుగు దశాబ్దాల నట విజయం - Prajasakti". Archived from the original on 2024-08-20. Retrieved 2024-08-20.
  6. "ఈ 'మిడిల్‌క్లాస్‌' కొండలరావు ఎవరు?". EENADU. 2020-11-24. Archived from the original on 2022-04-05. Retrieved 2022-04-05.
  7. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కందుకూరి పురస్కారాలు - 2017" (PDF). web.archive.org. Archived from the original on 2018-05-07. Retrieved 2022-04-05.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
  8. The New Indian Express, Vijayawada (26 July 2019). "Sumadhura comedy drama festival to begin today". www.newindianexpress.com. Archived from the original on 13 August 2020. Retrieved 2022-04-05.
  9. "35 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు". www.andhrajyothy.com. 2015-06-27. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.

బయటి లింకులు

[మార్చు]