పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2011

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రచయితలు, నటులైన పరుచూరి వెంకటేశ్వరరావు, పరుచూరి గోపాలకృష్ణ 1989లో ఏర్పాటు చేసిన నాటక పరిషత్తే పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు.[1] 2011 పరుచూరి రఘుబాబు స్మారక 21వ అఖిల భారత నాటకోత్సవాలు గుంటూరు జిల్లా, పల్లెకోన లో నిర్వహించారు. ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు జరిగాయి. భారతి సిమెంట్స్‌ వారు స్పాన్సర్‌గా వ్యవహరించారు.

ప్రతిరోజు రాత్రి ఏడు గంటలనుంచి నాటకోత్సవాలు ప్రారంభమై, రోజుకు మూడు నాటకాల చొప్పున ప్రదర్శన జరిగాయి. ఉత్తమ నాటకానికి 20వేల నగదు, నాటికకు 15వేలు, ఉత్తమప్రదర్శనకు 10వేల రూపాయలు, ఉత్తమ రచనకు 5వేల రూపాయలు, ఉత్తమ దర్శకునకు 3వేల రూపాయలు ఇవ్వడం జరిగింది. తుది ఎన్నికల్లో గెలిచిన ప్రతి నాటకానికి 15వేల రూపాయలు ఇచ్చారు. పరిషత్తులో బహుమతులు సాధించిన నాటకాలను, సెప్టెంబర్‌ 6న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శించారు.

27.04.2011న జరిగిన శాభారంభ సభకి సినీ నటుడు మురళీమోహన్ అధ్యక్షత వహించారు. బ్రహ్మానందం, ఏ.వి.ఎస్, సూర్యకిరణ్, కళ్యాణి, శివపార్వతి, టి. కొండల్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, భారతి సిమెంట్స్), ఎస్. సుధాకర్ రావులు హాజరయ్యారు.

01.05.2011న జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభకి వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సభాధ్యక్షత వహించారు. సినీనటులు చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, జయలలిత, కుమారి జ్యోతి విచ్చేశారు.

వందేమాతరం శ్రీనివాస్ తన బృందంతో సంగీత విభావరి నిర్వహించారు.

ఈసారి పరిషత్తులో 200 మందికి పైగా నటీనటులు, సాంకుతిక నిపుణులు పాల్గొన్నారు. మొత్తం 6 నాటకాలు, 11 నాటికలు ప్రదర్శించబడ్డాయి. 38 మందికి బహుమతిగా నగదుతోపాటు వెండి కానుకలను మెమొంటోలుగా అందించడం జరిగింది. పాల్గొన్న నటీమణులకు సాంప్రదాయ సత్కారంగా చీరల బహుకరణ జరిగింది. న్యాయ నిర్ణేతలకు, ఇతర పెద్దలకు సత్కారంతోపాటు రఘుబాబు చిత్రంతో మెమొంటోలను అందించడం జరిగింది.

నాటకరంగం మీద విశేష అవగాహన కలిగిన 6మంది ఈ పోటీలకు డా. డి.ఎస్.ఎన్. మూర్తి, తులసి బాలకృష్ణ, జి.టి.వి. సాయిబాబ, మోహనరావు, రంగారెడ్డి, భాను, సుధాకర్ లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించడం జరిగింది.[2]

పరిషత్తు వివరాలు - నాటక/నాటికలు

[మార్చు]
తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు
27.04.2011 రా. 7 గం. ధరిత్రి రక్షతి రక్షిత: (నాటిక) గురుమిత్ర కళాసమితి, రేపల్లె బి. ధర్మారావు బి. ధర్మారావు
27.04.2011 రా. గం. 8.15 ని. సంపూర్ణవకాశం (నాటకం) సాంస్కృతిక కళా సమాఖ్య, విజయవాడ సుఖమంచి కోటేశ్వరరావు సుఖమంచి కోటేశ్వరరావు
27.04.2011 రా. గం. 10.30 ని. అంతా భ్రాంతియే (నాటిక) గణేష్ ఆర్ట్స్, గుంటూరు వరికూటి శివప్రసాద్ వరికూటి శివప్రసాద్
28.04.2011 సా. గం. 6.30 ని. ఓ లచ్చీ... గుమ్మాడీ(నాటిక) మూర్తి కల్చరర్ అసోసియేషన్, కాకినాడ ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
28.04.2011 రా. గం. 7.45 ని చరణదాసు (నాటకం) భూమిక, హైదరాబాద్ జి. ఉదయభాను జి. ఉదయభాను
28.04.2011 రా. 10 గం. ఒహోం ఒహోం భీం (నాటిక) న్యూస్టార్ మోడరన్ థియేటర్, విజయవాడ ఎం.ఎస్. చౌదరి ఎం.ఎస్. చౌదరి
28.04.2011 రా. గం. 11.15 ని. మనిషి కాటు (నాటిక) శాలివాహన కళామందిర్, చెన్నూర్ వలమేటి మస్తానయ్య కె.కె. రావు
29.04.2011 సా. గం. 6.30 ని. పేగుబంధం (నాటిక) ఆదర్శ యువ భారతి, హైదరాబాద్ బి.వి. రామారావు అమరేంద్ర బొల్లంపల్లి
29.04.2011 రా. గం. 7.45 ని గారడి (నాటిక) ఉషోదయ కళా పరిషత్, హైదరాబాద్ చెరుకూరి సాంబశివరావు చెరుకూరి సాంబశివరావు
29.04.2011 రా. 9 గం. పత్ర హరితం (నాటిక) కళారాధన, నంద్యాల ఆకురాతి భాస్కర్ చంద్ర డా. జి. రవికృష్ణ
29.04.2011 రా. గం. 11.15 ని. హననం (నాటిక) సిరిమువ్వ కల్చరర్ అసోసియేషన్, హైదరాబాద్ రావినూతల ప్రేమకిషోర్ ఎం. భజరప్ప
30.04.2011 సా. గం. 6.30 ని. ఆత్మగీతం (నాటిక) కోమలి కళా సమితి, నల్గొండ శిష్ట్లా చంద్రశేఖర్ ఎస్.ఎం. బాషా
30.04.2011 రా. గం. 7.45 ని మనసులు కలిస్తే (నాటకం) విజయాదిత్య ఆర్ట్స్, నిజామాబాద్ జి.బి.కె. మూర్తి శ్రీపాద కుమారశర్మ
30.04.2011 రా. గం. 9.45 ని. నిశ్శబ్దం (నాటిక) కరుణ శ్రీ కళా సమితి, బరంపురం కొరిటాల ప్రభాకరరావు కె. వెంకట్రావ్
30.04.2011 రా.11 గం. పరుసవేది(నాటకం) గంగోత్రి, పెదకాకాని ఆకెళ్ల శివప్రసాద్ నాయుడు గోపి
01.05.2011 సా. గం. 6.30 ని. ఇదొక విషాదం (నాటకం) అరవింద్ ఆర్ట్స్, తాడేపల్లి ఆకెళ్ల గంగోత్రి సాయి
01.05.2011 రా. గం. 8.45 ని. గుడి ఎనక నా సామి (నాటిక) చైతన్య కళా స్రవంతి, విశాఖపట్టణం స్నిగ్ధ బాలాజీ నాయక్

బహుమతుల వివరాలు

[మార్చు]

నాటకాలు

[మార్చు]
 • ఉత్తమ ప్రదర్శన - మనసులు కలిస్తే (విజయాదిత్య ఆర్ట్స్, నిజామాబాద్)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - ఇదొక విషాదం (అరవింద ఆర్ట్స్, తాడేపల్లి)
 • ఉత్తమ రచన - సుఖమంచి కోటేశ్వరరావు (సంపూర్ణవకావం)
 • ఉత్తమ దర్శకత్వం - శ్రీపాద కుమారశర్మ (మనసులు కలిస్తే)
 • ఉత్తమ నటుడు - ఎమ్. సంతోష్ (చరణదాసు)
 • ద్వితీయ ఉత్తమ నటుడు - ఎ. నర్సిరెడ్డి (ఇదొక విషాదం)
 • ఉత్తమ నటి - సి.ఎస్. జ్యోతి (మనసులు కలిస్తే)
 • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - గోపరాజు రమణ (మనసులు కలిస్తే)
 • ఉత్తమ క్యారెక్టర్ నటి - వై. సరోజ (పత్రహరితం)
 • ఉత్తమ సహాయ నటుడు - గోపరాజు విజయ్ (మనసులు కలిస్తే)
 • ఉత్తమ సహాయ నటి - డి. జయలక్ష్మి (పరుసవేది)
 • ఉత్తమ ప్రతినాయకుడు - బి.వి. లక్ష్మయ్య (ఇదొక విషాదం)
 • ప్రత్యేక బహుమతి - మాస్టర్ ఎస్.కె. రహ్మతుల్లా (ఇదొక విషాదంలో నరసింహం పాత్ర)
 • ఉత్తమ హాస్యనటుడు - సురభి రాఘవ (చరణదాసు)
 • ఉత్తమ ఆహార్యం - సురభి రాఘవ (చరణదాసు)
 • ఉత్తమ సెట్టింగ్ - పి. శివ (మనసులు కలిస్తే)
 • ఉత్తమసంగీతం - టి. సాంబశివరావు (సంపూర్ణవకావం)

నాటికలు

[మార్చు]
 • ఉత్తమ ప్రదర్శన - ఆత్మగీతం (కోమలి కళా సమితి, నల్గొండ)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన - హననం (సిరిమువ్వ కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్)
 • తృతీయ ఉత్తమ ప్రదర్శన - గుడి ఎనక నా సామి (చైతన్య కళా స్రవంతి, విశాఖపట్టణం)
 • ప్రత్యేక ప్రదర్శన - నిశ్శబ్ధం (కరుణశ్రీ కళా సమితి, బరంపురం)
 • ఉత్తమ రచన - శిష్ట్లా చంద్రశేఖర్ (ఆత్మగీతం)
 • ద్వితీయ ఉత్తమ రచన - ఆర్. ప్రేమ్ కిషోర్ (హననం)
 • ఉత్తమ దర్శకత్వం - ఎస్.ఎం. బాషా (ఆత్మగీతం)
 • ఉత్తమ నటుడు - ఆర్. వాసుదేవరావు (ఒహోం ఒహోం భీం)
 • ద్వితీయ ఉత్తమ నటుడు - బాలాజీ నాయక్ (గుడి ఎనక నా సామి)
 • ఉత్తమ నటి - లక్ష్మీ. టి (ఆత్మగీతం)
 • ఉత్తమ క్యారెక్టర్ నటుడు - ఆర్.పి. గంధం (హననం)
 • ఉత్తమ క్యారెక్టర్ నటి - మాధవి (అంతా భ్రాంతియే)
 • ఉత్తమ సహాయ నటుడు - శ్రీమన్నారాయణ (అంతా భ్రాంతియే)
 • ఉత్తమ సహాయ నటి - సి.హెచ్. జయ (ఓ లచ్చీ... గుమ్మాడీ)
 • ఉత్తమ ప్రతినాయకుడు- రఘుపతి (ఆత్మగీతం)
 • ప్రత్యేక బహుమతి - ఎం. మురళి (ఆత్మగీతం)
 • ప్రత్యేక బహుమతి - మంజునాథ్ (హననం)
 • ఉత్తమ హాస్యనటుడు - వరికూటి శివప్రసాద్ (అంతా భ్రాంతియే)
 • ఉత్తమ ఆహార్యం - కె. థామస్ (ఆత్మగీతం)
 • ఉత్తమ రంగాలంకరణ - శ్రవణ్ కుమార్ అండ్ పార్టీ (ఆత్మగీతం)
 • ఉత్తమ సంగీతం - ఎస్.పి. సీతారాం అండ్ పార్టీ (ఒహోం ఒహోం భీం)

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. ఆంధ్రజ్యోతి (ఆర్కైవ్), సాహిత్య వార్తలు, ఖమ్మం సాంస్కృతికం (4 March 2018). "పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలు". Archived from the original on 13 మార్చి 2018. Retrieved 21 January 2020.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
 2. పరుచూరి రఘుబాబు నాటకోత్సవాలు, స్వాతి వార పత్రిక, 27 మే 2011, పుట. 60-61

ఇతర లంకెలు

[మార్చు]