లక్ష్మీ. టి
Jump to navigation
Jump to search
లక్ష్మీ. టి, ప్రముఖ రంగస్థల నటి.
జననం
[మార్చు]లక్ష్మీ 1963 సెప్టెంబర్ 9 న కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో శ్రీమతి సీతమ్మ, జయరాజు దంపతులకు జన్మించారు.
రంగస్థల ప్రవేశం
[మార్చు]1981 లో పులీ మేకలోస్తున్నాయి జాగ్రత్త నాటిక ద్వారా రంగస్థల ప్రవేశం గావించారు.
నాటకాలు - నాటికలు
[మార్చు]- అదాలత్
- యూటూబ్రూటస్
- రాజి
- క్విట్ ఇండియా
- కాలజ్ఞానం
- నవ్వండి ఇది విషాదం
- శ్వేతపత్రం
- కాదు సుమా కల
- మానస సరోవరం
- భువనఘోష
- జీవని
- శేషార్థం
- నోట్ దిస్ పాయింట్
- ఉత్తిత్తి పాట
- ఆంబోతు
- అసలు నేను
- అహంబ్రహ్మ
- దేవుడు
- ఛీఛీ
- దహతి మమాననం
- మిస్డ్ కాల్
- రైలాగని స్టేషను
- రివర్స్ మార్చి
- ఆత్మవత్సర్వ భూతాని
- నేను రాముణ్ణికాను
- ఆత్మగీతం
- నువ్వు + నేను – ప్రేమ = పెళ్ళి
- డొక్కా సీతమ్మ
- రెండు నిశబ్ధాల మధ్య
- సరికొత్త మనుషులు
దర్శకులు
[మార్చు]అనంత హృదయరాజ్, కె.వి. ప్రసాద్, సంజీవి ముదిలి, నాయుడు గోపి, నుసుము కోటిశివ, ఎస్.ఎం. బాషా దర్శకత్వంలో తన నటనకు మెరుగులు దిద్దుకొన్నారు. పలు పరిషత్తులలో ఉత్తమ నటిగా, ఉత్తమ పాత్రోచిత నటిగా శతాధిక బహుమతులందుకొన్నారు.
బహుమతులు
[మార్చు]నంది బహుమతులు
[మార్చు]- ఉత్తమ నటి - డొక్కా సీతమ్మ (నాటకం) - నంది నాటక పరిషత్తు - 2013 (2015)
- ఉత్తమ నటి - అమ్మకో ముద్దు (నాటిక) - నంది నాటక పరిషత్తు - 2013 (2015)
ఇతర బహుమతులు
[మార్చు]- ఉత్తమ నటి - ఆత్మగీతం - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2011 (2011)
- ఉత్తమ సహాయ నటి - దివ్యధాత్రి - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2012 (2012)[1]
మూలాలు
[మార్చు]- ↑ పరిచూరి ఫలితాలు, అభినయ పత్రిక, 1 May 2012, పేజి. 27
- లక్ష్మీ. టి, కళాదీపికలు (సమకాలీన రంగస్థల నటీమణులు), ప్రథమ ముద్రణ, సంపాదకులు: వి.ఎస్. రాఘవాచారి., కళాదీపిక మాసపత్రిక, తిరుపతి, అక్టోబరు 2011, పుట. 93.