నాయుడు గోపి
నాయుడు గోపి | |
---|---|
జననం | నాయుడు గోపాలరావు మార్చి 17, 1953 యండ్రాయి, అమరావతి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
నివాస ప్రాంతం | పెదకాకాని, గుంటూరు జిల్లా |
ప్రసిద్ధి | రంగస్థల నటుడు, దర్శకుడు, సమాజ నిర్వాహకుడు, చలనచిత్ర నటుడు |
భార్య / భర్త | దమయంతి |
తండ్రి | ప్రకాశరావు |
తల్లి | కమలమ్మ |
నాయుడు గోపి ప్రముఖ రంగస్థల నటుడు, దర్శకుడు, సమాజ నిర్వాహకుడు, చలనచిత్ర నటుడు.[1] నాటకరంగంలో సుమారు 2600 నాటక ప్రదర్శనలిచ్చిన గోపి, సుమారు అరువందలసార్లు ఉత్తమ నటుడిగా, నాలుగు వందలసార్లు ఉత్తమ దర్శకునిగా బహుమతులు అందుకున్నాడు. దాదాపు 200 మందిని నటీనటులుగా తీర్చదిద్దాడు.[2]
జననం
[మార్చు]ఈయన 1953, మార్చి17న ప్రకాశరావు, కమలమ్మ దంపతులకు పల్నాడు జిల్లా అమరావతి మండలం, యండ్రాయిలో జన్మించాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]చిన్నతనం నుండే నటనపై మక్కువ పెంచుకున్న గోపి, సన్యాసమ్ అనే నాటికలో హాస్య పాత్రలో నటించాడు. 1981లో 'డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్' అనే నాటకంతో రంగస్థలంలో అడుగు పెట్టిన ఈయన పడమటిగాలి, తర్జని, దహటి మానసం, నిషిద్దాక్షరి, మానస సరోవరం వంటి నాటకాలతో ప్రసిద్ధి పొందాడు.[3]
నాటకాలు
[మార్చు]- డియర్ ఆడియన్స్ సిన్సియర్లీ యువర్స్
- తర్జని
- సహారా
- నిషిద్దాక్షరి
- నీతి చంద్రిక
- మానస సరోవరం
- కాదుసుమాకల
- పతాక శీర్షిక
- మనసు-వయసు
- అహల్య
- నరవాహనం
- వానప్రస్థం
- పడమటిగాలి
- సారీబ్రదర్ ఇది నీ కథే
- ఏడుగుడిసెల పల్లె
- రైలాగని స్టేషన్
- మాయ
- పల్లెపడుచు
- శిఖరాల వెనక
- బృందావనం
- అక్షర కిరీటం
- చితి
- పరుసవేది
- మనస్సాక్షి
- మాస్క్
- గులాబిముల్లు
- డొక్కాసీతమ్మ
- గాలిబ్రతుకులు
- అరసున్నా
పద్యనాటకాలు
[మార్చు]- పల్నాటిభారతం
- హంసగీతం
- శ్రీ వేమన యోగి
- గయోపాఖ్యానం
- శ్రీ గురురాఘవేంద్రచరితం
- శ్రీ రామాంజనేయ యుద్ధం
- బాలనాగమ్మ
- తారకాసుర
- శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం
నాటికలు
[మార్చు]- దర్పణం
- దహతిమమ మానసం
- నవ్వండీ ఇది విషాదం
- శ్వేతపత్రం
- యద్భవిష్యం
- దంత వేదాంతం
- శ్రీముఖ వ్యాఘ్రం
- ఆదివారం
- ఏక్ దిన్ కా గరీబ్
- శ్రీచక్రం
- హింసధ్వని
- వేయిపడగలు
- భూమిపుత్రుడు
- ఎడారి కోయిల
- ఓనమాలు
- చుట్టంచూపు
- ఐక్యూ
- భారతరత్న
- ప్రేమాతురాణాం
- ఆంబోతు
- మిస్డ్ కాల్
- ఊబి
- నేర్పరి సుమతి
- ఓంశాంతి
- ఆసేతు హిమాచలం
- స్వర్గారోహణం
- బుద్ధచరిత్ర
- రివర్స్ గేర్
- ఓదార్చేశక్తి
- ముగింపులేని కథ
- ప్రవాసం
- నువ్వు+నేను-పేమ=పెళ్ళి
- నష్టపరిహారం
- గమనం
- అనగనగా ఒక పులి
- శకునపక్షి
- బంగారం
- బలేవాళ్ళే వీళ్ళు
- పైపంట
- జన్మసిద్ధాంతం
- లజ్జ
- పిల్లిపంచాంగం
- దగ్ధగీతం
- సన్నజాజులు
- పిపాస
- పచ్చచంద్రుడు
- వృద్ధోపనిషత్[4]
బహుమతులు
[మార్చు]సుమారు అరువందలసార్లు ఉత్తమ నటుడిగా, నాలుగు వందలసార్లు ఉత్తమ దర్శకునిగా బహుమతులు అందుకున్నాడు.
నంది బహుమతులు
[మార్చు]- ఉత్తమ నటుడు - హింసధ్వని (నాటిక) - నంది నాటక పరిషత్తు - 1998
- ఉత్తమ దర్శకుడు - వానప్రస్థం (నాటకం) - నంది నాటక పరిషత్తు - 1999
- ఉత్తమ దర్శకుడు - ఎడారి కోయిల (నాటిక) - నంది నాటక పరిషత్తు - 2000
- ఉత్తమ దర్శకుడు - ఆంబోతు (నాటిక) - నంది నాటక పరిషత్తు - 2004
- ఉత్తమ దర్శకుడు - పల్నాటిభారతం (పద్య నాటకం) - నంది నాటక పరిషత్తు - 2005
- ఉత్తమ దర్శకుడు - డొక్కా సీతమ్మ (నాటకం) - నంది నాటక పరిషత్తు - 2013
- ఉత్తమ దర్శకుడు - అక్షరకిరీటం (నాటకం) - నంది నాటక పరిషత్తు - 2016
ఇతర బహుమతులు
[మార్చు]- ఉత్తమ దర్శకుడు - అక్షరకిరీటం (నాటిక) (అపర్ణ నాటక కళాపరిషత్, తాడిపత్రి, గొల్లప్రోలు మండలం, 2019 ఏప్రిల్ 5)[5]
సినిమారంగ ప్రస్థానం
[మార్చు]- ప్రజాతీర్పు
- యూనియన్ లీడర్
- సింగన్న
- తెలుగోడు
- నేనున్నాను
- భద్రాద్రి రాముడు
- మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి
- లీలామహల్ సెంటర్
- శేషాద్రినాయుడు
- ఒక్కడే కానీ ఇద్దరు
- పాండు
- ఓరి నీ ఇల్లు బంగారం కాను
- నిమిషం
- ఆపదమొక్కులవాడు
- మహాత్మ
- లీడర్
- దమ్ము
- జాలీగా ఎంజాయ్ చేద్దాం
- దృశ్యం
- ఖైదీ నెంబర్ 150
- దృశ్యం 2
టీవిరంగ ప్రస్థానం
[మార్చు]నటుడిగా అనేక ధారావాహికల్లో నటించాడు.[3]
- మిస్టర్ బ్రహ్మానందం
- హిమబిందు
- మట్టిమనిషి
- సత్య
- పద్మవ్యూహం
- బాంధవ్యాలు
- మల్లీశ్వరి
- మహాలక్ష్మి
- లయ
- శ్రీ ఆంజనేయం
- ఆకాశగంగ
- లేత మనసులు
- సుడిగుండాలు
- మనసు మమత
- దామిని
- బ్రహ్మముడి
పురస్కారాలు
[మార్చు]- 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారం[6][7]
- 2022 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు పురస్కారం.
మూలాలు
[మార్చు]- ↑ The Hindu, Theatre (29 October 2015). "In favour of pouranic plays". Velcheti Subrahmanyam. Retrieved 17 March 2018.
- ↑ తెలుగు నాటకరంగం బ్లాగు. "తెలుగు నాటక ఘనాపాటి నాయుడుగోపి". www.telugunatakarangam.blogspot.in. విద్యాధర్ మునిపల్లె. Retrieved 17 March 2018.[permanent dead link]
- ↑ 3.0 3.1 nettv4u, Telugu Movie-Actor. "Naidu Gopi". www.nettv4u.com. Retrieved 17 March 2018.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "తెనాలిలో నాటికల పోటీలు; ఉత్తమ ప్రదర్శన 'వృద్ధోపనిషత్'". Sakshi. 2022-07-15. Archived from the original on 2022-07-18. Retrieved 2023-06-17.
- ↑ ప్రజాశక్తి, జిల్లాలు (5 April 2019). "ముగిసిన రాష్ట్ర స్థాయి నాటక పోటీలు". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 7 August 2019.
- ↑ 39 మందికి ‘కళారత్న’ 29-03-2017 ఆంధ్రజ్యోతి[permanent dead link]
- ↑ "ఉగాది సందర్భంగా అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం". andhrapradesh.suryaa.com. 2017-03-28. Archived from the original on 2022-02-16. Retrieved 2022-02-16.