అమరావతి మండలం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
![]() | |
| Coordinates: 16°36′N 80°24′E / 16.6°N 80.4°E | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
| జిల్లా | పల్నాడు జిల్లా |
| మండల కేంద్రం | అమరావతి |
| విస్తీర్ణం | |
• మొత్తం | 209 కి.మీ2 (81 చ. మై) |
| జనాభా (2011)[2] | |
• మొత్తం | 66,277 |
| • సాంద్రత | 320/కి.మీ2 (820/చ. మై.) |
| జనగణాంకాలు | |
| • లింగ నిష్పత్తి | 1026 |
అమరావతి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా 28 మండలాల్లో ఒకటి. అమరావతి గ్రామం ఈ మండలానికి కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి ఇది భిన్నమైంది. ఇది సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిపాలనలో ఉంది.[3] ఈ మండలం జిల్లా ప్రధాన కార్యాలయానికి 27 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది ఒడ్డున ఉంది. దీనికి అచ్చేపేట, క్రోసూరు, పెదకూరపాడు, తాడికొండ, తుళ్లూరు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.[3]
జనాభా గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, మండల జనాభా 66,277. మొత్తం జనాభాలో 32,709 మంది పురుషులు, 33,568 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి 1000 మంది పురుషులకు 1026 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల 6,894 మంది పిల్లలలో 3,450 మంది బాలురు, 3,444 మంది బాలికలు ఉన్నారు. సగటు అక్షరాస్యత రేటు 37,507 మంది అక్షరాస్యులతో 48.45% వద్ద ఉంది.[4]
పరిపాలన
[మార్చు]ఈ మండలం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భాగంగా ఉంది, ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికార పరిధిలో ఉంది.[5] 2011 జనాభా లెక్కల ప్రకారం, ఈ మండలంలో పదిహేడు గ్రామాలు ఉన్నాయి.
రాజకీయాలు
[మార్చు]పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో అమరావతి మండలం ఒకటి. అలాగే, నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గనకు ప్రాతినిధ్యం వహిస్తుంది.[6]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అమరావతి
- అత్తలూరు
- ధరణికోట
- దిడుగు
- యండ్రాయి
- జూపూడి
- కర్లపూడి
- లింగాపురం
- మల్లాది
- మునుగోడు
- నరుకుళ్ళపాడు
- నెమలికల్లు
- పెద మద్దూరు
- పొందుగల
- ఉంగుటూరు
- వైకుంఠపురం
నిర్జన రెవెన్యూ గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- ముత్తాయిపాలెం
- మండేపూడి
- లేమల్లె
- చావపాడు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
- ↑ 3.0 3.1 "District Census Handbook : Guntur" (PDF). Census of India. Directorate of Census Operations, Andhra Pradesh. 2011. pp. 5, 328–329. Retrieved 3 June 2019.
- ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 12 October 2014.
- ↑ "District wise mandals and villages covered in Krishna and Guntur districts" (PDF). Andhra Pradesh Capital Region Development Authority. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 23 September 2015. Retrieved 23 September 2015.
- ↑ "District wise mandals and villages covered in Krishna and Guntur districts" (PDF). Andhra Pradesh Capital Region Development Authority. Government of Andhra Pradesh. Archived from the original (PDF) on 23 September 2015. Retrieved 23 September 2015.
