Jump to content

ముత్తాయిపాలెం (అమరావతి)

అక్షాంశ రేఖాంశాలు: 16°34′03″N 80°24′45″E / 16.567513°N 80.412482°E / 16.567513; 80.412482
వికీపీడియా నుండి

ముత్తాయపాలెం పల్నాడు జిల్లా, అమరావతి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి పదిహేను కిలోమీటర్లు, మండల కేంద్రం అమరావతి కి ఐదు కిలోమీటర్ల దూరంలో అమరావతి నుండి క్రోసూర్ వెళ్ళే రాష్ట్ర రహదారికి 700 మీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉంటుంది [1]

గ్రామ విశిష్టతలు.

ఈ గ్రామంలో పోలేరమ్మ తల్లి అమ్మవారు, శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవార్ల దేవాలయాలకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఎక్కువగా వస్తుంటారు

ముత్తయిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామాలు  —
ముత్తయిపాలెం is located in Andhra Pradesh
ముత్తయిపాలెం
ముత్తయిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°34′03″N 80°24′45″E / 16.567513°N 80.412482°E / 16.567513; 80.412482
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం అమరావతి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522020
ఎస్.టి.డి కోడ్ 08645

మౌలికి ఐదు వసతులు

[మార్చు]

వ్యక్తిగత మరుగుదొడ్ల సౌకర్యం:- ఈ గ్రామంలో ఊరంతా మరుగుదొడ్లు, సిమెంటు రహదారులతో మెరిసిపోతున్నది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తున్నా, అధికారులు వెంటబడుచున్నా, కొన్ని గ్రామాలలో నేటికీ స్పందన అంతంత మాత్రంగానే ఉంటున్న తరుణంలో, ముత్తాయపాలెం గ్రామంలో మాత్రం, ప్రజలు స్వచ్ఛందంగా, తమంతట తామే, ఇంటింటికీ మరుగుదొడ్డిని నిర్మించుకొని ఆదర్శంగా నిలిచారు. దాదాపు 750 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 187 ఇళ్ళుండగా, 98% ఇళ్ళలో ఇప్పటికే మరుగుదొడ్లు ఉన్నాయి. మిగతా ఇళ్ళవారు గూడా నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇవి గూడా పూర్తి చేసుకొని ఈ గ్రామస్థులు 100% మరుగుదొడ్లు నిర్మించుకున్న గ్రామంగా రికార్డులకెక్కాలని ఉవ్విళ్ళూరుతున్నది. ఈ గ్రామం 2007 లోనే నిర్మల్ భారత్ అభియాన్ పురస్కారానికి ఎంపికైనది.[2]

మూలాలు

[మార్చు]
  1. గ్రామ ప్రజలనుండి సేకరణ
  2. ఈనాడు గుంటూరు రూరల్; 2014, అక్టోబరు-2; 16వపేజీ.