Jump to content

నంది నాటక పరిషత్తు - 2013

వికీపీడియా నుండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కారణంగా 2013 నంది నాటక పరిషత్తును నిర్వహించడంలో ఆలస్యం జరిగింది. దాంతో 2013, 2014 సంవత్సరాల నంది నాటకోత్సవాలను ఒకేసారి నిర్వహించారు. 2015 మే 16 నుండి 30 వరకి, రాజమండ్రి లోని ఆనం కళాకేంద్రంలో నంది నాటక పరిషత్తు - 2013 జరిగింది. 15 రోజుల పాటు జరిగిన నాటకోత్సవంలో ఒకరోజు 2013 నాటక ప్రదర్శనలు, మరోరోజు 2014 నాటక ప్రదర్శనలు జరిగాయి. విజేతలకు జూన్ 1న ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.

నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం

[మార్చు]

నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు. 2013 సంవత్సరానికి గాను పేపకాయల లక్ష్మణరావు (పౌరాణిక నాటకం) గారికి అందజేశారు.[1]

జ్యూరి సభ్యులు

[మార్చు]
  • పద్యనాటకాలు: ఆర్. సత్యనారాయణ రాజు (రసరాజు, తణుకు), దేవారపు ప్రతాప్ గౌడ్ (కర్నూలు), కె. సత్యంనాయుడు (విశాఖపట్నం).
  • సాంఘిక నాటకాలు: చిట్టాశంకర్ (మచిలీపట్నం), కె. మహేంద్ర చక్రవర్తి (భీమవరం), ఆలపాటి లక్ష్మీ (హైదరాబాదు).
  • సాంఘిక నాటికలు: ప్రొ. ఎస్. పద్మనాభయ్య (తిరుపతి), టి. మధుకుమార్ (విజయవాడ), పి. దేవి (హైదరాబాదు).
  • పిల్లల నాటికలు: చిక్కాల బాలాజీరావు (చిత్తూరు), షేక్ జాన్ బషీర్ (హైదరాబాదు), స్వర్ణగౌరి (హైదరాబాదు).

ప్రదర్శించిన నాటక/నాటికలు

[మార్చు]
తేది సమయం నాటకం/నాటిక పేరు సంస్థ పేరు రచయిత దర్శకుడు బహుమతుల వివరాలు
16.05.2015 ఉ. 11 గం. వీరాభిమన్యు (పద్యనాటకం) అక్కినేని సాంస్కృతిక సమాజం, విజయనగరం కీ.శే. ఊటికూరి సత్యనారాయణరావు శొంటినేని కిషోర్ ప్రత్యేక జ్యూరి బహుమతి
16.05.2015 మ. గం.2.30 ని.లకు ఇది ప్రశ్న ఏది జవాబు ? (బాలల సాంఘిక నాటిక) విజ్ఞాన్ విద్యాలయ హైస్కూల్, విశాఖపట్నం కొరిటాల ప్రభాకరరావు కొరిటాల ప్రభాకరరావు
16.05.2015 సా. 4 గం. హంసకదా నా పడవ (సాంఘిక నాటకం) కందుకూరి కళా సమితి, ధవళేశ్వరం స్నిగ్ధ టి.వి. మణికుమార్ ఉత్తమ ద్వితీయ ప్రదర్శన
ప్రథమ ఉత్తమ రచయిత
16.05.2015 రా. 7 గం. దొంగలు (సాంఘిక నాటిక) చైతన్య కళా భారతి, కరీంనగర్ పి. శివరాం మంచాల రమేష్ ఉత్తమ సంగీతం
18.05.2015 ఉ. గం. 9.30 ని.లకు శ్రీ గురు రాఘవేంద్ర చరితం (పద్య నాటకం) గంగోత్రి, పెదకాకాని విద్యాధర్ మునిపల్లె నాయుడు గోపి ఉత్తమ తృతీయ ప్రదర్శన
ఉత్తమ సంగీతం
18.05.2015 మ. గం.12.30 ని.లకు బాల కార్మికులు (బాలల సాంఘిక నాటిక) బి.వి.ఆర్. కళాకేంద్రం, తాడేపల్లిగూడెం సుఖమంచి కోటేశ్వరరావు టి.వి.యం. కృష్ణారావు
18.05.2015 మ. గం.2.30 ని.లకు పేదోడు (సాంఘిక నాటకం) ఉషోదయ కళానికేతన్, హైదరాబాదు చెరుకూరి సాంబశివరావు చెరుకూరి సాంబశివరావు ద్వితీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ సహాయ నటుడు
18.05.2015 సా. 5 గం.లకు భారతీయం (సాంఘిక నాటిక) కందుకూరి కళా సమితి, ధవళేశ్వరం దేవాడ శరభరావు టి.వి. మణికుమార్
18.05.2015 రా. 7 గం.లకు మంతువు (సాంఘిక నాటిక) శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవా సంఘం, బోరివంక కె.కె.ఎల్. స్వామి బి.యం.యస్. పట్నాయక్ ద్వితీయ ఉత్తమ రచయిత
ఉత్తమ నటుడు
18.05.2015 రా. గం. 8.30 ని.లకు మృచ్ఛకటికం (పద్య నాటకం) మిర్యాలగూడ సాంస్కృతిక కళాకేంద్రం, మిర్యాలగూడ తడకమళ్ళ రామచంద్రరావు తడకమళ్ళ రామచంద్రరావు ఉత్తమ హాస్యనటుడు
ఉత్తమ మేకప్
20.05.2015 ఉ. గం. 9.30 ని.లకు నర్తనశాల (పద్య నాటకం) శ్రీ సీతారామ నాట్యమండలి, కాకినాడ కాళ్లూరి రామరావు కాళ్లూరి రామరావు ఉత్తమ ద్వితీయ ప్రదర్శన
ఉత్తమ ప్రతినాయకుడు
20.05.2015 మ. గం. 12.30 ని.లకు దేనికోసం (బాలల సాంఘిక నాటిక) సెయింట్ ఆన్స్ తెలుగు మీడియం స్కూల్, తిరువూరు రవీంద్ర వింజమూరి రవీంద్ర వింజమూరి
20.05.2015 మ. గం. 2.30 ని.లకు గబ్బర్ సింగ్ (సాంఘిక నాటిక) దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమి, హైదరాబాదు కోట్ల హనుమంతరావు కోట్ల హనుమంతరావు ఉత్తమ హాస్యనటి
20.05.2015 సా. 4 గం.లకు అనగనగా (సాంఘిక నాటిక) యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ మృత్యుంజయుడు ఆర్. వాసు ద్వితీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ దర్శకుడు
ఉత్తమ సెటింగ్
ఉత్తమ మేకప్
20.05.2015 రా. 7 గం.లకు ఋణవేదమ్ (సాంఘిక నాటిక) న్యూలైన్ డ్రామా, గణపవరం కాటా సుబ్బారావు కాటా సుబ్బారావు
22.05.2015 ఉ. గం. 9.30 ని.లకు గయోపాఖ్యానం (పద్య నాటకం) నందనందన కళౄమండలి, ప్రొద్దుటూరు కీ.శే. చిలకమర్తి లక్ష్మీనరసింహం యం. రామసుబ్బారెడ్డి ఉత్తమ సెటింగ్
22.05.2015 మ. గం. 12.30 ని.లకు సైన్యం (బాలల సాంఘిక నాటిక) దీప్తి స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పాలకొల్లు కె. హారిక పి. ఉగాది ఉత్తమ బాల నటుడు
ఉత్తమ ప్రతినాయకుడు
ఉత్తమ మేకప్
22.05.2015 మ. గం. 2.30 ని.లకు కొమరం భీమ్ (సాంఘిక నాటకం) గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్, హైదరాబాదు యం.యస్. చౌదరి యం.యస్. చౌదరి ఉత్తమ హాస్య నటుడు
ఉత్తమ బాల నటుడు
ఉత్తమ మేకప్
ప్రత్యేక జ్యూరి బహుమతి
22.05.2015 సా. 5 గం. లకు అమ్మకో ముద్దు (సాంఘిక నాటిక) అభినయ ఆర్ట్స్, గుంటూరు జీడిగుంట రామచంద్రమూర్తి యన్. రవీంద్రరెడ్డి తృతీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ నటి
22.05.2015 రా. 7 గం. లకు అగ్నిపుష్పం (సాంఘిక నాటిక) శ్రీ సద్గురు కళానిలయం, గుంటూరు కావూరి సత్యనారాయణ కావూరి సత్యనారాయణ తృతీయ ఉత్తమ రచయిత
24.05.2015 ఉ. గం. 9.30 ని.లకు దేశమును ప్రేమించుమన్నా (పద్య నాటకం) ది యంగ్ మెన్స్ హ్యాప్పి క్లబ్, కాకినాడ శారద ప్రసన్న కె. పుల్లారావు ఉత్తమ తొలి ప్రదర్శన
ఉత్తమ దర్శకుడు
ప్రథమ ఉత్తమ రచయిత
ఉత్తమ నటుడు
24.05.2015 మ. గం. 12.30 ని.లకు నిన్న-నేడు-రేపు (బాలల సాంఘిక నాటిక) గిరిజన కళా స్రవంతి, పాణ్యం వి. లక్ష్మీ వై. వెంకటేశ్వర్లు
24.05.2015 మ. గం. 2.30 ని.లకు డొక్కా సీతమ్మ (సాంఘిక నాటకం) గంగోత్రి, పెదకాకాని రామకృష్ణ నాయుడు గోపి ఉత్తమ తొలి ప్రదర్శన
ఉత్తమ దర్శకుడు
ఉత్తమ నటి
ఉత్తమ బాల నటి
ఉత్తమ సెటింగ్
ఉత్తమ లైటింగ్
24.05.2015 సా. 5గం.లకు మేము సైతం (బాలల సాంఘిక నాటిక) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజంపల్లి కె.వి. రంగారావు కె.వి. రంగారావు ప్రథమ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ దర్శకుడు
ఉత్తమ బాల నటి
24.05.2015 రా. 7 గం.లకు కన్నీటి కథ (సాంఘిక నాటిక) మిత్ర క్రియేషన్స్, హైదరాబాదు శిష్టా చంద్రశేఖర్ ఎస్.ఎం. బాషా ప్రథమ ఉత్తమ ప్రదర్శన
ప్రథమ ఉత్తమ రచయిత
ఉత్తమ సహాయ నటి
ఉత్తమ బాల నటుడు
24.05.2015 రా. గం. 8.30 ని.లకు మాతృ దేవోభవ (పద్య నాటకం) శ్రీ తోట సాంస్కృతిక సేవా సంస్థ, హైదరాబాదు విద్వాన్ వేంకటగిరి వీర మల్లయ్య భాగవతుడు తోట సాంబమూర్తి ఉత్తమ లైటింగ్
26.05.2015 ఉ. గం. 9.30 ని.లకు స్వామి వివేకనంద (పద్య నాటకం) శ్రీ శ్రీ పల్లెలాంబ నాటక కళా సమితి, కోడుమూరు కె.వి. రామచంద్ర ఆచారి వి. పద్మనాభాచారి ద్వితీయ ఉత్తమ రచయిత
26.05.2015 మ. గం. 12.30 ని.లకు నిమజ్జనం (బాలల సాంఘిక నాటిక) కళారాధన, శ్రీ గురురాజ కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల బి. కమలాకర్ జి. రవికృష్ణ ద్వితీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ రచయిత
ఉత్తమ సహాయ నటులు
26.05.2015 మ. గం. 2.30 ని.లకు బొమ్మా-బొరుసా (సాంఘిక నాటకం) అరవింద ఆర్ట్స్ డెవలప్ మెంట్ సొసైటి, తాడేపల్లి ఆకెళ్ల గంగోత్రి సాయి ఉత్తమ నటుడు[2]
26.05.2015 సా. 5 గం. లకు పాఠ్య పుస్తకం (బాలల సాంఘిక నాటిక) న్యూస్టార్ మోడ్రన్ థియేటర్, విజయవాడ యం.యస్. చౌదరి యం.యస్. చౌదరి
26.05.2015 రా. 7 గం. లకు మస్తిష్కం మేడ్ బై సొసైటి (సాంఘిక నాటిక) వి.టి.పి.యస్. కల్చరల్ అసోసియేషన్, ఇబ్రహీంపట్నం కవి పి.యన్.యం కవి పి.యన్.యం ప్రత్యేక జ్యూరి బహుమతి
28.05.2015 ఉ. గం. 9.30 ని.లకు మహాజ్ఙాని మార్కండేయ (పద్య నాటకం) సవేర ఆర్ట్స్, కడప పల్లేటి లక్ష్మీకులశేఖర్ ఆళ్లూరి వెంకటయ్య ఉత్తమ సహాయ నటుడు
ఉత్తమ బాల నటుడు
28.05.2015 మ. గం. 12.30 ని.లకు పిల్లి వచ్చే ఎలుకా బద్రం (బాలల సాంఘిక నాటిక) కుమార్ (ఇ.యం) పబ్లిక్ స్కూల్, నూజివీడు కె. తిరుపతమ్మ కె. తిరుపతమ్మ
28.05.2015 మ. గం. 2.30 ని.లకు ప్రేమకు పద్దెనిమిదేళ్లేనా (సాంఘిక నాటకం) భానూదయ, ఒంగోలు కందుల వెంకట్ కందుల వెంకట్
28.05.2015 సా. 5 గం. లకు ఉగ్గుపాలు (బాలల సాంఘిక నాటిక) నిర్మల్ విద్యానికేతన్, కందలూరు ఇండ్ల యేసుపాదం ఇండ్ల యేసుపాదం తృతీయ ఉత్తమ ప్రదర్శన
ఉత్తమ సంగీతం
ఉత్తమ సెటింగ్
28.05.2015 రా. 7 గం. లకు నిర్ణయం (సాంఘిక నాటిక) పండు క్రియేషన్స్, ఒంగోలు పరుచూరి గోపాలకృష్ణ పాటిబండ్ల ఆనందరావు
30.05.2015 ఉ. గం. 9.30 ని.లకు మహాభక్త శబరి (పద్య నాటకం) సావేరి సాంస్కృతిక సంస్థ, హైదరాబాదు యం. పురుషోత్తమాచార్య జి. సత్యనారాయణ ఉత్తమ నటి
30.05.2015 మ. గం. 12.30 ని.లకు వికసిత మందారాలు (బాలల సాంఘిక నాటిక) శశి కళాలయం, చెరుకుపల్లి సోమాశి శ్రీనివాసమూర్తి సోమాశి ఛత్రపతి సాయి కౌశిక్
30.05.2015 మ. గం. 2.30 ని.లకు ఖుర్భాని (సాంఘిక నాటకం) మాధురి క్రియేషన్స్, హైదరాబాదు లక్కాప్రగడ ప్రమోద్ లక్కాప్రగడ ప్రమోద్ ఉత్తమ తృతీయ ప్రదర్శన
ఉత్తమ సంగీతం
30.05.2015 సా. 5 గం. లకు బతుకు వాసన (బాలల సాంఘిక నాటిక) మానవతా కల్చరల్ అసోసియేషన్, కన్నాపూర్ చొప్పదండి సుధాకర్ తుపాకుల మొగిలయ్య
30.05.2015 రా. 7 గం. లకు పొద్దు పొడిచింది (సాంఘిక నాటిక) మురళికృష్ణ కళానిలయం, నిజామాబాద్ చల్లా మధుకర్ చల్లా మధుకర్ ఉత్తమ ప్రతినాయకుడు
ఉత్తమ లైటింగ్

చిత్రమాలిక

[మార్చు]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ప్రజాశక్తి, జిల్లాలు (16 May 2015). "రంగరంగ వైభవంగా రంగస్థల పండుగ". www.prajasakti.com. Archived from the original on 21 ఏప్రిల్ 2020. Retrieved 21 April 2020.
  2. యడవల్లి, శ్రీనివాసరావు (2024-08-11). "రంగస్థలంపై బహుముఖ పాత్రధారి". prajasakti.com. Archived from the original on 2024-08-11. Retrieved 2024-08-20.