మంచాల రమేష్
మంచాల రమేష్ | |
---|---|
జననం | ఆగష్టు 22, 1970 వంగర, భీమదేవరపల్లి మండలం, కరీంనగర్ జిల్లా |
వృత్తి | విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ |
ప్రసిద్ధి | రంగస్థల నటులు, దర్శకులు |
తండ్రి | రామచంద్రం |
తల్లి | కనకలక్ష్మి |
మంచాల రమేష్ కరీంనగర్ జిల్లాకు చెందిన నాటకరంగ నటుడు, దర్శకుడు.[1] దొంగలు, ఈ లెక్క ఇంతే, చీకటి పువ్వు[2] మొదలైన నాటికలకు వివిధ విభాగాల్లో బహుమతులు అందుకున్నాడు.
జననం
[మార్చు]1970, ఆగస్టు 22న రామచంద్రం, కనకలక్ష్మి దంపతులకు కరీంనగర్ జిల్లా, భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో మంచాల రమేష్ జన్మించాడు.[1]
ఉద్యోగం
[మార్చు]కరీంనగర్ జిల్లాలో విద్యుత్ శాఖ ఇ.ఆర్.ఓ రూరల్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]10 సంవత్సరాల వయసులో 1980 సంవత్సరంలో 'బడిపంతులు' నాటకం ద్వారా బాలనటునిగా ప్రప్రథమంగా రంగప్రవేశం చేశాడు.[1]
ప్రదర్శించిన నాటకాలు, నాటికలు
[మార్చు]బడిపంతులు, సంసారంలో సరాగాలు, ప్రేమగోల, చదవా, బంగారు గుడ్లు, నాకు ఇల్లొచ్చింది, సతిన్మ, ప్రేమ ఈక్వల్ట్, చెల్లనిపైసలు (60 ప్రదర్శనలు),[3] దొంగలు (96 ప్రదర్శనలు), ఈలెక్క ఇంతే (35 ప్రదర్శనలు)[4][5] మనిషి, ఆడది, ఈతరం మారాలి, పామరులు, నిరసన, ఆకలివేట, కాలచక్రం, విధాత, నేనుపట్నం పోతనే, ప్రేమపిచ్చోళ్ళు, ఇతిహాసం, క్షతగాత్రుడు, ఆశాపాశం, నగరం ప్రశాంతంగా ఉంది, లాలలీల, క్లిక్, పెన్‌కౌంటర్, గర్భగుడి, మార్గదర్శి, సన్మతి, ఎవరో ఒకరు, గారడి, ఈ లెక్క ఇంతే,[6] మా ప్రేమకు న్యాయం కావాలి, చీకటిపువ్వు,[7] స్వప్నం రాల్చిన అమృతం మొదలైనవి.
గురువులు
[మార్చు]శ్రీరాముల సత్యనారాయణ, బండారి దేవరాజ్, గద్దె ఉదయ్‌కుమార్, అల్లకొండ కిషన్‌రెడ్డి, తిప్పర్తి ప్రభాకర్, కె.సత్యనారాయణ, వడ్నాల కిషన్, రంగు వెంకటనారాయణ, రచయిత శివరామ్ లు.
బహుమతులు
[మార్చు]- నంది ఉత్తమ నటుడు - సతిన్మ (2002 నందినాటకోత్సవం)
- ఉత్తమ నటుడు - ఈ లెక్క ఇంతే (2015)[5]
- ఉత్తమ ప్రతినాయకుడు - చీకటిపువ్వు (వీణా అవార్డ్స్ 2021, పేరిట కళల కాణాచి, వేదగంగోత్రి ఫౌండేషన్-తెనాలి)[8]
- ఉత్తమ దర్శకుడు - చీకటిపువ్వు - కొండవీటి కళాపరిషత్ 27వ జాతీయస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఏప్రిల్ 21-23, 2023), లింగారావుపాలెం)[9]
సన్మానాలు - సత్కారాలు
[మార్చు]- గ్రామీణ కళాజ్యోతి అవార్డు (ఫోక్ ఆర్ట్ అకాడమీ, కరీంనగర్, 1996)
- తుమ్మల రంగస్థల పురస్కారం వారిచే సత్కారం (1999)
- ఉత్తమ రంగస్థల నటనా పురస్కారం (చైతన్యకళాభారతి, కరీంనగర్)
- జిల్లా కళాకారుల సమాఖ్య వారిచే సత్కారం
- మానవత కల్చరల్ అకాడమి వారిచే సత్కారం
- రసరమ్య కళారంజని, నల్గొండవారిచే సన్మానం (చెల్లనిపైసలు నాటికకు దర్శకత్వం వహించి, నటించి నందినాటకోత్సవాలలో తృతీయ బహుమతి పొందిన సందర్భంలో)
- వల్లం నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (విఎన్‌ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్, 2017)[10]
- వైకే నాగేశ్వరరావు రంగస్థల పురస్కారం (2023)
- పాలకుర్తిలో సోమనాథ రంగస్థల పురస్కారం (2023)
బిరుదులు
[మార్చు]- కళాజగతి, నాటకరంగ పత్రిక వారిచే విశాఖపట్నంలో కళాశ్రేష్ఠ బిరుదుసత్కారం
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "రంగస్థలం రమేశ్". Sakshi. 2024-01-29. Archived from the original on 2024-02-06. Retrieved 2024-02-06.
- ↑ telugu, NT News (2023-04-07). "సమాజాన్ని ప్రశ్నించేది నాటకం". www.ntnews.com. Archived from the original on 2023-04-07. Retrieved 2023-04-15.
- ↑ ఈనాడు, కరీంనగర్ (16 April 2019). "సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్యానికి కృషి". Archived from the original on 16 April 2019. Retrieved 16 April 2019.
- ↑ నమస్తే తెలంగాణ, ఖమ్మం. "ప్రారంభమైన తెలుగు నాటకోత్సవాలు". Retrieved 17 January 2017.[permanent dead link]
- ↑ 5.0 5.1 సాక్షి. "ఉత్తమ నాటిక 'ఎవరిని ఎవరు క్షమించాలి?'". Retrieved 17 January 2017.
- ↑ ప్రజాశక్తి, కర్నూలు కల్చరల్ (17 May 2016). "యానాది జాతుల యదార్థగాథ 'చివరి గుడిసె'". www.prajasakti.com. Archived from the original on 7 ఆగస్టు 2019. Retrieved 7 August 2019.
- ↑ "ఘనంగా ముగిసిన 13 వ జాతీయ స్థాయి నాటిక పోటీలు." Prajasakti (in ఇంగ్లీష్). Archived from the original on 2022-05-18. Retrieved 2023-05-19.
- ↑ ఆంధ్రజ్యోతి, గుంటూరు (15 October 2021). "వీధి నాటకాలు పునరుజ్జీవం పొందాలి". andhrajyothy. Archived from the original on 27 October 2021. Retrieved 27 October 2021.
- ↑ "ఉత్తమ ప్రదర్శనగా 'నాన్న నేనొచ్చేస్తా'". EENADU. Archived from the original on 2024-01-20. Retrieved 2024-01-20.
- ↑ నవతెలంగాణ. "సినీరంగానికి రంగస్థలం పునాది". Archived from the original on 19 ఏప్రిల్ 2023. Retrieved 17 January 2017.