దొంగలు (నాటిక)
దొంగలు | |
---|---|
రచయిత | పి. శివరాం |
దర్శకుడు | మంచాల రమేష్ |
తారాగణం | అమ్మ - శ్రీమతి కె. విజయలక్ష్మీ, నంది (పెద్దోడు) - మంచాల రమేష్, సాయి (చిన్నోడు) - కె. సత్యనారాయణ |
ఒరిజినల్ భాష | తెలుగు |
విషయం | సాంఘిక నాటిక |
నిర్వహణ | చైతన్య కళా భారతి, కరీంనగర్ |
దొంగలు (సాంఘిక నాటిక) చైతన్య కళా భారతి, కరీంనగర్ వారు ప్రదర్శించిన సాంఘిక నాటిక. ఈ నాటికను ప్రముఖ రచయిత పి. శివరాం రచించగా, నటుడు దర్శకుడైన మంచాల రమేష్ దర్శకత్వం వహించాడు.[1]
కథాసాంరాంశం
[మార్చు]దొంగలు ఇంట్లోకి చొరబడితే- లైటు వేసి తాళాలందించి దొంగతనం చేసుకోమంటుంది ఓ తల్లి. దానికంటేముందు, బతికున్నకాలంలో ఎందరికో అన్నం పెట్టిన ఆమె భర్త ఆత్మశాంతికై భోజనం చేయాలనే షరతు విదిస్తుంది. దీనికి దొంగలు అంగీకరిస్తారు. ఆ వృద్ధురాలి కన్న కొడుకులు.. వారి తండ్రి ఆఖరి క్షణాల్లో దగ్గరుండరు, చనిపోయినా రారు. సంవత్సరీకం నాడు సైతం తల్లిని పట్టించుకోకపోవడం ఆ మాతృ హృదయాన్ని కలచివేస్తుంది. ఆమె మైకంతో సొమ్మసిల్లిపోతే- మరణించినట్లు భావిస్తారు దొంగలు. ఆకలి తీర్చిన ఆమెను అనాథ శవంలా వదిలేయకుండా తలకొరివి పెట్టే కొడుకులుగా మారబోతారు. బిడ్డలను చూడాలన్న బలీయమైన కోరికతో బతికున్నప్పటికీ చనిపోయినట్లుగా అంతకుముందే ఆ తల్లి చేయించిన ఫోన్‌కాల్‌తో అసలు బిడ్డలిద్దరూ వస్తారు. తల్లి మరణం వారిని బాధించదు. ఆస్తిని దోచుకోవడానికి వచ్చిన కరెన్సీ దొంగలపై గొడవపడి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. విచారణ క్రమంలో తెప్పరిల్లిన తల్లి, తన సొంత బిడ్డలను గుర్తించనట్లు ప్రవర్తిస్తుంది. మొత్తం ఈ ఉదంతం తన తల్లిని వృద్ధాశ్రమంలో వదిలిన ఎస్‌ఐలో సైతం మార్పు తెస్తుంది. ఆస్తి కోసం బతికున్న తల్లిని చంపడానికి సిద్ధపడ్డ కొడుకులకు ఆస్తుల్ని వదిలేసి, ఆత్మాభిమానంతో కొద్దిక్షణాలైనా కొడుకుల ప్రేమను చూపించిన కరెన్సీ దొంగలతో శేషజీవితం గడపడానికి వెల్లిపోతుంది ఆ తల్లి.[2][3]
నటవర్గం
[మార్చు]అమ్మ - శ్రీమతి కె. విజయలక్ష్మీ, నంది (పెద్దోడు) - మంచాల రమేష్, సాయి (చిన్నోడు) - కె. సత్యనారాయణ, చక్రి (పెద్దకొడుకు) - గద్దె ఉదయకుమార్, సతీశ్ (చిన్నకొడుకు) - రంగు వెంకటనారాయణ, యస్.ఐ. అల్లంకొండ కిషన్ రెడ్డి.
సాంకేతిక వర్గం
[మార్చు]సంగీతం - కె.ఎస్.ఎన్. శర్మ, ఆహార్యం - గద్దె ఉదయకుమార్, రంగాలంకరణ - తిప్పర్తి ప్రభాకర్, యం. మల్లేష్.
బహుమతులు
[మార్చు]- ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటి (కె. విజయలక్ష్మీ) - బుచ్చిరెడ్డిపాలెం, నెల్లూరు జిల్లా
- ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ నటి (కె. విజయలక్ష్మీ), ఉత్తమ నటుడు (మంచాల రమేష్), ప్రత్యేక బహుమతి (కిషన్ రెడ్డి) - చిలకలూరిపేట కళాపరిషత్, 16,17,18 ఫిబ్రవరి, 2014 (చిలకలూరిపేట, గుంటూరు జిల్లా)[4]
మూలాలు
[మార్చు]- ↑ "రంగస్థలం రమేశ్". Sakshi. 2024-01-29. Archived from the original on 2024-02-06. Retrieved 2024-02-06.
- ↑ ప్రజాశక్తి. "ఎవరు 'దొంగలు'?". Retrieved 21 May 2017.
- ↑ నవతెలంగాణ. "నాటక రంగంపై ఓ మాట". Retrieved 21 May 2017.
- ↑ Chilakaluripet. "Prize distribution". chilakaluripet1.blogspot.in. Retrieved 21 May 2017.[permanent dead link]