నంది నాటక పరిషత్తు - 2017

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. దీనినే నంది నాటక పరిషత్తు అంటారు.

ప్రజలకోసం నాటకం-నాటకం కోసం సమాజం అన్న సరికొత్త నినాదంతో దరఖాస్తు చేసుకున్న అన్ని నాటకాలను ప్రజలు కూడా తిలకించేలా ప్రజల మధ్యే ప్రదర్శించే అవకాశం కల్పించడంతో పాటు ప్రతి నాటక సమాజానికి ప్రదర్శనా పారితోషికం రూపంలో మొత్తం రూ. 80 లక్షల వరకు అందిస్తున్నారు. వివిధ సమాజాల నుంచి వచ్చిన ప్రదర్శనలకు ప్రదర్శనా పారితోషికంగా పద్య నాటకానికి రూ.30 వేలు, సాంఘిక నాటకానికి రూ. 20 వేలు, సాంఘిక నాటికకు రూ. 15 వేలు, బాలల నాటికకు రూ.15 వేలు, కళాశాల, విశ్వవిద్యాలయం నాటికకు రూ.15 వేలు ఇచ్చారు. 2017 నంది నాటకోత్సవాలకు మొత్తం 360 దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల తెలుగు నాటక సమాజాల నుంచి కూడా దరఖాస్తులు రావడం విశేషంగా నిలిచింది.[1][2]

ప్రదర్శనలు[మార్చు]

2017 నంది నాటకోత్సవం ఐదు వేరువేరు ప్రాంతాలు (తెనాలి, కాకినాడ, రాజమహేంద్రవరం, కర్నూలు, నంద్యాల) లో నిర్వహించారు.[3]

 1. నంది నాటక పరిషత్తు - 2017 తెనాలి ప్రదర్శనలు
 2. నంది నాటక పరిషత్తు - 2017 కాకినాడ ప్రదర్శనలు
 3. నంది నాటక పరిషత్తు - 2017 రాజమహేంద్రవరం ప్రదర్శనలు (శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రం, మార్చి 14-22)
 4. నంది నాటక పరిషత్తు - 2017 కర్నూలు ప్రదర్శనలు
 5. నంది నాటక పరిషత్తు - 2017 నంద్యాల ప్రదర్శనలు

బహుమతులు[మార్చు]

నంది నాటక పరిషత్తు - 2017 బహుమతుల వివరాలు కింద ఇవ్వడమైనది.[4]

పద్యనాటకం[మార్చు]

 • ఉత్తమ ప్రదర్శన: ఇంద్ర సింహాసనం (హేలాపురి కల్చరల్ అసోసియేషన్, ఏలూరు - రూ. 80వేలు, బంగారు నంది, ప్రశంసా పత్రము)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: సైసై నరసింహరెడ్డి (టి.జి.వి. కళాక్షేత్రం, కర్నూలు - రూ. 60వేలు, వెండి నంది, ప్రశంసా పత్రము)
 • తృతీయ ఉత్తమ ప్రదర్శన: రక్తపాశం (జే.యం.జే. నాట్యమండలి, విజయవాడ - రూ. 40వేలు, కాంస్య నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ దర్శకుడు: యం.డి. ఖాజావలి (ఇంద్ర సింహాసనం - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ నాటక రచయిత: పల్లేటి లక్ష్మీకుల శేఖర్ (సైసై నరసింహరెడ్డి - రూ. 30వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ద్వితీయ నాటక రచయిత: శారద ప్రసన్న (యయాతి - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ నటుడు: పి. విజయ్ కుమార్ (ఇంద్ర సింహాసనం - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ నటి: కె. విజయలక్ష్మీ (అరుణ కిరణాలు - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ సంగీత దర్శకుడు: బి. యజ్ఞనారాయణ (రక్తపాశం - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ సహాయ నటుడు: మున్నంగి జగన్ కుమార్ (రామభక్త హనుమాన్ - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ హాస్య నటుడు: ఆర్. శామ్యూల్ (సైసై నరసింహరెడ్డి - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ బాల నటుడు: రజిత్ రాజీవ్, సుమిత్ (ఆంధ్ర మహా విష్ణు - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ ప్రతి నాయకుడు: డి. తిరుపతి నాయుడు (మోహిని భస్మాసుర - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ రంగాలంకరణ: యస్.వి.రాజు (ఆంధ్ర మహా విష్ణు - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ రంగోద్దీపనం: సురభి సంతోష్ (యయాతి - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ఉత్తమ ఆహార్యం: జి. వెంకటస్వామి (పాండవోద్యోగం - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)
 • ప్రత్యేక బహుమతి: వై. గోపాలరావు (మోహిని భస్మాసుర - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రము)

సాంఘీక నాటకం[మార్చు]

 • ఉత్తమ ప్రదర్శన: గుప్పెడంత గుండెలో (అభినయ ఆర్ట్స్, గుంటూరు - రూ. 70వేలు, బంగారు నంది, ప్రశంసా పత్రం)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: ఇంటింటి భాగోతం (అరవింద ఆర్ట్స్, తాడేపల్లి - రూ. 50వేలు, వెండి నంది, ప్రశంసా పత్రం)
 • తృతీయ ఉత్తమ ప్రదర్శన: అంబేద్కర్ రాజగృహ ప్రవేశం (గోవాడ క్రియేషన్స్ అసోసియేషన్స్, హైదరాబాద్ - రూ. 30వేలు, కాంస్య నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ దర్శకుడు: ఎన్. రవీంద్రరెడ్డి (గుప్పెడంత గుండెలో - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ నాటక రచయిత: శిష్ట్ల చంద్రశేఖర్ (గుప్పెడంత గుండెలో - రూ. 25వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ద్వితీయ ఉత్తమ నాటక రచయిత: వల్లూరు శివప్రసాద్ (ఇంటింటి భాగోతం - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ నటులు: గంగోత్రి సాయి (ఇంటింటి భాగోతం), యం.డి. సెహేన్ష (ప్రస్థానం) - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ నటి: జ్యోతిరాణి సాలూరి (తెగారం - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ సంగీతం: కందుల అంజయ్య, కె. వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు (అంబేద్కర్ రాజగృహ ప్రవేశం - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ సహాయ నటులు: పదాల కవీశ్వరరావు (తూర్పురేఖలు), కె. వినయ్ కుమార్ (మనం మనుషులం కావాలి) - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ హాస్య నటుడు: పి. రామారావు (ఈ సూర్యుడు సామాన్యుడు - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ బాల నటుడు: యు. గణేష్ (అంబేద్కర్ రాజగృహ ప్రవేశం - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ ప్రతి నాయకుడు: శాసపు సత్యనారాయణ (తూర్పురేఖలు - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ రంగాలంకరణ: పి. దివాకర్, ఫణీంద్ర, రత్నబాబు, శ్రీకాంత్, శ్రీరాం (భారతావనిలో బలిపసువులు - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ రంగోద్దీపనం: పి.వి. రమణామూర్తి (మనం మనుషులం కావాలి - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ ఆహార్యం: యం. దినేష్ బాబు, పి. మోహనేశ్వరరావు, యల్. మణి, సి.హెచ్. సుదర్శన్ (భారతావనిలో బలిపసువులు - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ప్రత్యేక బహుమతి: ప్రస్థానం (రసవాహిని, అమలాపురం- రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)

సాంఘీక నాటిక[మార్చు]

 • ఉత్తమ ప్రదర్శన: గుర్తు తెలియని శవం (జనశ్రేణి, విజయవాడ - రూ. 40వేలు, బంగారు నంది, ప్రశంసా పత్రం)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: గర్భగుడి (బహురూప నట సమాఖ్య, విశాఖపట్టణం - రూ. 30వేలు, వెండి నంది, ప్రశంసా పత్రం)
 • తృతీయ ఉత్తమ ప్రదర్శన: మధుపర్కాలు (అరవింద ఆర్ట్స్, తాడేపల్లి - రూ. 20వేలు, కాంస్య నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ దర్శకుడు: ఎస్.కె. మిశ్రో (గర్భగుడి - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ నాటక రచయిత: డా. సి.హెచ్. శ్రీనివాసరావు (గర్భగుడి - రూ. 20వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ద్వితీయ ఉత్తమ నాటక రచయిత: పి.వి. భవాని ప్రసాద్ (శ్రీకారం - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • తృతీయ ఉత్తమ నాటక రచయిత: వల్లూరు శివప్రసాద్ (మధు పర్కాలు - రూ. 10వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ నటుడు: వై.ఎస్. కృష్ణేశ్వరరావు (గుర్తు తెలియని శవం - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ నటి: ఎస్. జ్యోతి (భేతాళ ప్రశ్న - రూ. 15వేలు, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ సంగీతం: సత్యనారాయణమూర్తి (మధు పర్కాలు - రూ. 12,500/-, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ సహాయ నటుడు: కె. శ్రీనివాసరావు (బంధాల బరువెంత - రూ. 12,500/-, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ హాస్య నటుడు: ఎస్.వి. రమణ (భూమిదుఃఖం - రూ. 12,500/-, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ బాల నటి: నరహరిసెట్టి సుస్మిత (పిపాస - రూ. 12,500/-, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ ప్రతి నాయకుడు: వై. హరిబాబు (భూమిదుఃఖం - రూ. 12,500/-, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ రంగాలంకరణ: మధు, శివ (మధు పర్కాలు - రూ. 12,500/-, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ రంగోద్దీపనం: (ఫాడోలెస్ మాన్ - రూ. 12,500/-, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ఉత్తమ ఆహార్యం: పి. మోహనేశ్వరరావు (భేతాళ ప్రశ్న - రూ. 12,500/-, తామ్ర నంది, ప్రశంసా పత్రం)
 • ప్రత్యేక బహుమతి: శ్రీకారం (శ్రీ సాయి ఆర్ట్స్, కొలకలూరు - రూ. 12,500/-, తామ్ర నంది, ప్రశంసా పత్రం)

బాలల నాటిక[మార్చు]

 • ఉత్తమ ప్రదర్శన: శ్రీరామ రక్ష (ఆంధ్ర నలంద మున్సిపల్ ఉన్నత పాఠశాల, గుడివాడ - రూ. 40వేలు, బంగారు నంది, ప్రశంసా పత్రం)
 • ద్వితీయ ఉత్తమ ప్రదర్శన: భళా డింగరి (కళారాధన శ్రీ గురురాజ కాన్సెప్ట్ స్కూల్, నంద్యాల - రూ. 30వేలు, వెండి నంది, ప్రశంసా పత్రం)
 • తృతీయ ఉత్తమ ప్రదర్శన: అర్థం చేసుకోండి (ప్రశాంతి ఆర్ట్స్ క్రియేషన్స్, హైదరాబాద్ - రూ. 20వేలు, కాంస్య నంది, ప్రశంసా పత్రం)

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. ఆంధ్రభూమి, తూర్పుగోదావరి (14 March 2018). "'నంది'కి రంగం సిద్ధం". Archived from the original on 7 May 2018. Retrieved 7 May 2018.
 2. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "కాకినాడలో నంది నాటకోత్సవాలు శుభారంభం (పత్రికా ప్రకటన)" (PDF). cdn.s3waas.gov.in. Archived from the original on 7 May 2018. Retrieved 7 May 2018.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)
 3. The Hindu, Andhra Pradesh (15 March 2018). "Nandi drama fest gets under way". Special Correspondent. Retrieved 7 May 2018.
 4. వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది బహుమతులు - 2017" (PDF). web.archive.org. Archived from the original on 7 May 2018. Retrieved 7 May 2018.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) CS1 maint: multiple names: authors list (link)

ఇతర లంకెలు[మార్చు]