తెగారం (సాంఘీక నాటకం)
Appearance
తెగారం | |
---|---|
రచయిత | పెద్దింటి అశోక్ కుమార్ |
దర్శకుడు | మల్లేశ్ బలష్టు |
ఒరిజినల్ భాష | తెలుగు |
విషయం | సాంఘిక నాటకం |
నిర్వహణ | జాబిల్లి కల్చరల్ సొసైటీ (నిజామాబాదు) |
తెగారం శివ సత్తుల జీవిత నేపథ్యంతో వచ్చిన సాంఘిక నాటిక. ఈ నాటికను రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించగా జాబిల్లి కల్చరల్ సొసైటీ (నిజామాబాదు) నిర్వహణలో నటుడు దర్శకుడైన మల్లేశ్ బలష్టు దర్శకత్వం వహించాడు. ఈ నాటకం నంది నాటక పరిషత్తు - 2017లో ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి) విభాగంలో బహుమతిని అందుకుంది.
కథ
[మార్చు]ఎల్లవ్వ ఒక శివసత్తి, కానీ తన కూతురు లలిత శివసత్తిగా మారడాన్ని వ్యతిరేకిస్తుంది. తల్లికి ఊర్లో జరిగే మన్నన చూసి లలిత దొరైన్ట్లో పూనకాలు ఊగుతుంది. విషయం తెలిసిన ఊరిపెద్దలు ఈ ఏడూ బోనాలు లలిత చేత జరపనిర్ణయిస్తారు. ఆమెను బలవంతంగా శివసత్తినిజేసి ఊరేగింపుగా వస్తుంటే ఆ మూఢాచారాన్ని ఆపడానికి ఎల్లవ్వ ఏం చేసింది అన్నదే ఈ నాటకం కథాంశం.[1]
నట సాంకేతిక వర్గం
[మార్చు]- జ్యోతిరాణి సాలూరి
- సునయన
- వాణి
- నిహారిక
- ఇంద్ర
- త్రైలోక్య
- సి.హెచ్. నటరాజగోపాలమూర్తి
- రమణామూర్తి
- సత్యనారాయణ
- వెంకటకృష్ణ
- మధు గుర్రం
- చేగొండి చంద్రశేఖర్
- గిరిబాబు
- జబర్దస్త్ లక్ష్మీ కిరణ్
- యశ్వంత్
- సతీష్
- ఇందిర
- అరుణ్ కుమార్
- నాగరాజు (సంగీతం)
- ఉమాశంకర్ (రంగాలంకరణ)
- సుభాష్ (రంగాలంకరణ)
- జయవర్థన్ (రంగోద్దీపనం)
ప్రదర్శనలు (కొన్ని)
[మార్చు]- అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ - వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు - 2018 జనవరి 3
- నంది నాటక పరిషత్తు - 2017 - ఎన్.టి.ఆర్. సెంటెనరి మున్సిపల్ టౌన్ హాల్, నంద్యాల - 2018 ఏప్రిల్ 4
- పంతం పద్మనాభ కళా పరిషత్, 19వ రాష్ట్రస్థాయి నాటక పోటీలు, కాకినాడ - 2018 అక్టోబరు 28
- నటకులమ్ నాటక పరిషత్తు, ఘంటసాల సంగీత కళాశాల, విజయవాడ - 2018 డిసెంబరు 18[1]
- తెలంగాణ యువ నాటకోత్సవం - 4 - రవీంద్రభారతి, హైదరాబాదు - 2018 డిసెంబరు 30
- పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2019 - రవీంద్రభారతి, హైదరాబాదు - 2019 మే 1[2]
- డి.ఎల్. కాంతారావు తపాల ఉద్యోగుల కళా పరిషత్, 13వ జాతీయస్థాయి నాటక పోటీలు, తెనాలి - 2019 జూన్ 10-16
బహుమతులు
[మార్చు]- ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి) - నంది నాటక పరిషత్తు - 2017[3]
- ఉత్తమ ద్వితీయ ప్రదర్శన, ఉత్తమ నాటక రచన (పెద్దింటి అశోక్ కుమార్), ఉత్తమ ఆహార్యము (డా. మల్లేశ్ బలాస్ట్), ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి), ఉత్తమ సహాయ నటి (సునయన), ఉత్తమ ప్రతినాయకుడు (రమణమూర్తి వంగల) - పంతం పద్మనాభ కళా పరిషత్, కాకినాడ.
- ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు (డా. మల్లేశ్ బలాస్ట్), ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి), ఉత్తమ ప్రతినాయకుడు (రమణమూర్తి వంగల), ఉత్తమ జ్యూరీ నటి (సునయన), ఉత్తమ రంగాలంకరణ (ఉమాశంకర్ సురభి) - పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2019, ఏప్రిల్ 27 నుండి మే 3 వరకు, 2019[4]
- ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ దర్శకుడు (డా. మల్లేశ్ బలాస్ట్), ఉత్తమ నటి (జ్యోతిరాణి సాలూరి), ఉత్తమ ప్రతినాయకుడు (రమణమూర్తి వంగల), ఉత్తమ హాస్య నటుడు(చేగో), ఉత్తమ ఆహార్యం (డా. మల్లేశ్ బలాస్ట్), ఉత్తమ రంగాలంకరణ (ఉమాశంకర్ సురభి) - డి.ఎల్. కాంతారావు తపాల ఉద్యోగుల కళా పరిషత్, 13వ జాతీయస్థాయి నాటక పోటీలు, జూన్ 10 నుండి 16 వరకు, 2019[5]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 ప్రజాశక్తి (28 December 2018). "మూఢత్వాన్ని ఎండగట్టిన 'నటకులం' నాటకాలు". Archived from the original on 28 December 2018. Retrieved 28 December 2018.
- ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (2 May 2019). "నాటక పోటీలు ప్రారంభం". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.
- ↑ వెబ్ ఆర్కైవ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ జాలగూడు. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది బహుమతులు - 2017" (PDF). web.archive.org. Archived from the original (PDF) on 7 May 2018.
{{cite web}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు (4 May 2019). "ముగిసిన 'పరుచూరి రఘుబాబు' నాటకోత్సవం". Archived from the original on 4 May 2019. Retrieved 4 May 2019.
- ↑ ఈనాడు, నిజామాబాదు (18 June 2019). "ఉత్తమ ప్రదర్శనగా 'తెగారం'". www.eenadu.net. Archived from the original on 17 September 2019. Retrieved 17 September 2019.