Jump to content

అంబాజీపేట మ్యారేజి బ్యాండు

వికీపీడియా నుండి
అంబాజీపేట మ్యారేజి బ్యాండు
దర్శకత్వందుశ్యంత్‌ కటికినేని
స్క్రీన్ ప్లేదుశ్యంత్‌ కటికినేని
కథదుశ్యంత్‌ కటికినేని
నిర్మాతధీరజ్ మోగిలినేని
తారాగణం
ఛాయాగ్రహణంవాజిద్ బేగ్
కూర్పుకొదాటి పవన్ కల్యాణ్
సంగీతంశేఖర్ చంద్ర
నిర్మాణ
సంస్థలు
గీతా ఆర్ట్స్‌ 2
మహాయణ మోషన్ పిక్చర్స్‌
ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌
విడుదల తేదీs
2 ఫిబ్రవరి 2024 (2024-02-02)(థియేటర్)
1 మార్చి 2024 (2024-03-01)( ఆహా ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

అంబాజీపేట మ్యారేజి బ్యాండు 2024లో విడుదలైన తెలుగు సినిమా. వెంకటేశ్ మహా సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ధీరజ్ మోగిలినేని నిర్మించిన ఈ సినిమాకు దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహించాడు. సుహాస్, శివానీ నగరం, జగదీష్ ప్రతాప్ బండారి, గోపరాజు రమణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబరు 09న విడుదల చేసి[1], సినిమాను ఫిబ్రవరి 24న విడుదలైంది.[2]

అంబాజిపేటలో ఊరులోని పెద్ద మనిషిగా చెలామ‌ణి అవుతోన్న వెంక‌ట్‌బాబు (నితిన్ ప్ర‌స‌న్న‌) దగ్గర ఊర్లో సగం మంది వెంకట్ దగ్గర అప్పులు తీసుకుని వడ్డీలు కట్టుకుంటూ బతుకుతూనే ఉంటారు. ఆ గ్రామంలో మల్లి (సుహాస్) తన కులవృత్తిని చేసుకుంటూనే మ్యారేజి బ్యాండులో పని చేస్తుంటాడు. మల్లి అక్క పద్మ (శరణ్య) అదే ఊర్లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంటుంది. పద్మకు వెంకట్‌కు అక్రమ సంబంధం ఉందని ఊరిలో పుకార్లు నడుస్తుంటాయి. వెంకట్ చెల్లి లక్ష్మీ (శివానీ), మల్లి ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులం, డబ్బుని చూసుకుని అహంకారంతో రెచ్చిపోయే వెంకట్ ఆత్మాభిమానంతో ఉండే మల్లి, పద్మలకు వైరం ఎలా మొదలవుతుంది? ఆ గొడవకు తోడు చెల్లెలు లక్ష్మి (శివాని నాగరం), మల్లి ప్రేమలో ఉన్న సంగతి వెంకట బాబుకు తెలుస్తుంది. ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏమిటి ? చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌
  • నిర్మాత: ధీరజ్ మోగిలినేని
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:దుశ్యంత్‌ కటికినేని
  • సంగీతం: శేఖర్ చంద్ర
  • సినిమాటోగ్రఫీ: వాజిద్ బేగ్
  • ఎడిటింగ్: కొదాటి పవన్ కల్యాణ్

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."గుమ్మా గుమ్మా"రెహమాన్శేఖర్ చంద్ర3:50
2."మా ఊరు అంబాజీపేట"రెహమాన్3:16
3."చీకటి వేకువగా" 3:59
4."గుండె గానీ మందిందంటే" 2:39
మొత్తం నిడివి:13.04

మూలాలు

[మార్చు]
  1. Mana Telangana (10 October 2023). "'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' టీజర్ విడుదల." Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  2. Namaste Telangana (26 December 2023). "అంబాజీపేట మ్యారేజి బ్యాండు రిలీజ్‌ టైం ఫిక్స్.. సుహాస్ న్యూ లుక్ వైరల్". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  3. Eenadu. "రివ్యూ: అంబాజీపేట మ్యారేజి బ్యాండు". Archived from the original on 2 April 2024. Retrieved 2 April 2024.
  4. Andhrajyothy (26 August 2023). "అంబాజీపేట అమ్మాయి". Archived from the original on 27 December 2023. Retrieved 27 December 2023.
  5. Namaste Telangana (8 February 2024). "విల్లామేరీ కాలేజ్‌ అందించిన మరో అందగత్తె.. ఇండస్ట్రీకి దొరికిన గ్లామర్‌ తార". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
  6. V6 Velugu (30 January 2024). "ఫ్రెండ్ రోల్ కోసం వెళ్తే హీరోయిన్ అవకాశం వచ్చింది: శివాని నాగరం". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. A. B. P. Desam (18 February 2024). "ఫిదా త‌ర్వాత బ్రేక్ ఇచ్చింది 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు': నటి శ‌ర‌ణ్య‌". Archived from the original on 2 April 2024. Retrieved 2 April 2024.
  8. NTV Telugu (2 February 2024). "అంబాజీపేటలో హీరో సూహాస్ కాదు.. శరణ్యనే.. అసలు ఏమన్నా యాక్టింగా?". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.