జగదీష్ ప్రతాప్ బండారి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జగదీష్
జననం
జగదీష్ ప్రతాప్ బండారి

18 జనవరి 1993
జాతీయత భారతదేశం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2018- ప్రస్తుతం
తల్లిదండ్రులుచంద్రమౌళి, లలిత

జగదీష్ ప్రతాప్ బండారి తెలుగు సినిమారంగానికి చెందిన నటుడు. 2019లో విడుదలైన మల్లేశం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 2021లో విడుదలైన పుష్ప సినిమాతో కేశవ పాత్రకు మంచి గుర్తింపునందుకున్నాడు.[1]

జననం, విద్యాభాస్యం[మార్చు]

జగదీష్ తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండలం, చిన్నకోడెపాక గ్రామంలో చంద్రమౌళి, లలిత దంపతులకు జన్మించాడు. ఆయన 6వ తరగతి వరకు చిన్నకోడెపాక గ్రామంలో, నుండి వరకు పెంబర్తిలోని ఏకశిల పాఠశాలలో పూర్తి చేసి, హనుమకొండలోని వాగ్దేవి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ (బైపీసీ), ఎల్.బి. కళాశాలో బీఎస్సీ (పౌల్ట్రీ సైన్స్) పూర్తి చేశాడు.[2]

సినీ జీవితం[మార్చు]

జగదీష్ సినీరంగంలోకి రాకముందు పలు లఘు చిత్రాల్లో నటించాడు. ఆయన నటించిన నిరుద్యోగ నటులు, కొత్త పోరడు లఘు చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. జగదీష్ 2019లో ప్రియదర్శి హీరోగా వచ్చిన మల్లేశం సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరో స్నేహితుడిగా చిన్న పాత్రలో నటించాడు. ఆయన 2020లో కరుణ కుమార్ దర్శకత్వంలో వచ్చిన పలాస 1978 సినిమాలో నటించిన అనంతరం 2021లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పుష్పరాజ్ స్నేహితుడు కేశవ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[3][4]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర పేరు ఇతర విషయాలు
2019 మల్లేశం అంజి
జార్జ్ రెడ్డి భీమ్ నాయక్
2020 పలాస 1978 ముత్యాలు
2021 పుష్ప కేశవ [5][6]
2022 పిక్ పాకెట్ [7]
విరాట పర్వం
వాంటెడ్ పండుగాడ్
2023 పుష్ప 2: ది రూల్ కేశవ "మొండేలు" [8]
TBA చివరకు మిగిలేది

లఘు చిత్రం \ వెబ్ సిరీస్[మార్చు]

సంవత్సరం లఘు చిత్రం \ వెబ్ సిరీస్ పాత్ర ఇతర విషయాలు
2018 నిరుద్యోగ నటులు జగదీశ్ మైక్ టీవీ యూ ట్యూబ్ షో
2019 గాడ్స్ అఫ్ ధర్మపురి చలపతి జీ5 వెబ్ సిరీస్
2020 కొత్త పోరడు అడ్డగుట్ట మల్లేష్ ఆహా వెబ్ సిరీస్ [9]

పురస్కారాలు[మార్చు]

సైమా అవార్డులు

మూలాలు[మార్చు]

  1. TV5 News (18 December 2021). "పుష్పలో అల్లు అర్జున్ పక్కన చేసిన ఈ కేశవ ఎవరో తెలుసా?" (in ఇంగ్లీష్). Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Eenadu (22 January 2022). "కేశవుడు మనోడే.. మచ్చా". Archived from the original on 22 January 2022. Retrieved 22 January 2022.
  3. TV5 News (20 December 2021). "పక్కా తెలంగాణ కుర్రాడే.. చిత్తూరు యాసలో అదరగొట్టాడు.. ఎవరీ పుష్ప కేశవ?" (in ఇంగ్లీష్). Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Namasthe Telangana (18 December 2021). "పుష్పలో అల్లు అర్జున్ పక్కనే ఉండే ఆ నటుడు ఎవరో తెలుసా..?". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  5. The Telugu News (25 December 2021). "పుష్పలో అల్లు అర్జున్ ఫ్రెండ్ కేశవ బ్యాక్ గ్రౌండ్ తెలుసా… ఎగతాళి చేసేవారంటూ ఏమోషనలైన వరంగల్ కుర్రాడు..!". Archived from the original on 13 January 2022. Retrieved 13 January 2022.
  6. News18 Telugu (18 December 2021). "'పుష్ప'లో అల్లు అర్జున్ వెన్నంటే ఉండే కేశవ ఎవరు.. ఆ నటుడు బ్యాగ్రౌండ్ ఏంటి..?". Retrieved 13 January 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)CS1 maint: numeric names: authors list (link)
  7. "Pushpa 2: The Rule".
  8. "Pushpa 2: The Rule".
  9. "Best Telugu Web Series of 2020 | Top Rated Telugu Web Series 2020 to Watch Online | Etimes". timesofindia.indiatimes.com. Retrieved 2021-12-26.

బయటి లింకులు[మార్చు]