కరుణ కుమార్
కరుణ కుమార్ | |
---|---|
జననం | ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2020–ప్రస్తుతం |
కరుణ కుమార్ భారతీయ చలనచిత్ర దర్శకుడు. కథారచయిత కూడా అయిన ఆయన ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు.[1] 2020లో వచ్చిన పలాస 1978 చిత్రానికి దర్శకత్వం వహించినందుకు ప్రసిద్ధిచెందాడు.[2]
ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన 2024లో సంక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్న నా సామిరంగలో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇది నాగార్జున హీరోగా కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ తెరకెక్కిస్తున్న చిత్రం.[3]
కెరీర్
[మార్చు]కరుణ కుమార్ తొలి చిత్రం పలాస 1978 మార్చి 2020లో విడుదలై విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. కుల వివక్ష, అంటరానితనానికి సంబంధించిన సంఘటనల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.[4] ఫిల్మ్ కంపానియన్, ది టైమ్స్ ఆఫ్ ఇండియాలతో సహా సంవత్సరాంతపు ఉత్తమ చిత్రాల చార్ట్‌లలో ఇది చోటుదక్కించుకుంది.[5] ఆ తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన మెట్రో కథలు స్ట్రీమింగ్ సర్వీస్ ఆహాలో విడుదలైంది.[6] సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రలలో 2021లో వచ్చిన శ్రీదేవి సోడా సెంటర్‌కి దర్శకత్వం వహించాడు.[7]
ఈ చిత్రం విడుదలకు ముందు, జూలై 2021లో, ఆయన చేతిలో ఎనిమిది చిత్రాలు ఉన్నాయని ది హన్స్ ఇండియా కథనం ప్రచురించింది. అయితే, నవంబరు 2021లో, సృజనాత్మక విభేదాల కారణంగా ఆయన మలయాళ చిత్రం నాయట్టు తెలుగు రీమేక్ నుండి వైదొలిగాడు.[8][9]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకత్వం | స్క్రీన్ ప్లే | కథ | నటుడు | నోట్స్ |
2020 | పలాస 1978 | అవును | అవును | అవును | కాదు | |
ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య | కాదు | కాదు | కాదు | అవును | కరుణ | |
మెట్రో కథలు | అవును | అవును | అవును | కాదు | ||
2021 | శ్రీదేవి సోడా సెంటర్ | అవును | అవును | కాదు | కాదు | |
2022 | కళాపురం | అవును | అవును | కాదు | కాదు | |
TBA | మట్కా | అవును | అవును | అవును | కాదు | [3] |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | పురస్కారం | విభాగం | సినిమా | ఫలితం | మూలం |
---|---|---|---|---|---|
2021 | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ నూతన దర్శకుడు - తెలుగు | పలాస 1978 | విజేత | [10] |
2021 | సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ | బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ | విజేత | [11] |
మూలాలు
[మార్చు]- ↑ Bureau, ABP News (2021-08-27). "Sridevi Soda Center Maker Karuna Kumar Will Only Cast Telugu Actors In His Films, Here Is Why". news.abplive.com (in ఇంగ్లీష్). Retrieved 2022-01-05.
- ↑ ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: పలాస 1978". Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
- ↑ 3.0 3.1 "Directors turns Villains: దర్శకులు విలన్లుగా కనిపిస్తే.. 'నా సామిరంగ' | directors turns villains in tollywood srikanth addala karuna kumar sj suryah". web.archive.org. 2023-10-08. Archived from the original on 2023-10-08. Retrieved 2023-10-08.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "From Palasa 1978 to Orey Bujjiga, here're 5 highly anticipated Telugu movies set to release in March". The Times of India (in ఇంగ్లీష్). 2020-03-02. Retrieved 2021-01-08.
- ↑ "Best Telugu Movies of 2020 | Top Rated Telugu Films of 2020 | Top 30 Best Telugu Movies of 2020 | Etimes". timesofindia.indiatimes.com. Retrieved 2022-01-05.
- ↑ Metro Kathalu Review: An incomplete anthology that doesn't offer what it promises, retrieved 2022-01-05
- ↑ Dundoo, Sangeetha Devi (2021-08-27). "'Sridevi Soda Center' movie review: Succumbing to mainstream masala". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-01-05.
- ↑ "Sridevi Soda Center Movie Review: Predictable screenplay kills the game". Cinema Express. 2021-08-27.
- ↑ "Karuna Kumar quits Nayattu Telugu remake?". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2022-01-05.
- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
- ↑ Naresh. "Suman TV - South Indian Film Awards: సంతోషం - సుమన్ టివి సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ ప్రమోషన్స్ కి సూపర్ రెస్పాన్స్ - Suman TV" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-11-14. Retrieved 2021-11-14.
- ఆంధ్రప్రదేశ్ సినిమా దర్శకులు
- భారతీయ సినిమా దర్శకులు
- తెలుగు సినిమా దర్శకులు
- ఆంధ్రప్రదేశ్ స్క్రీన్ రైటర్స్
- తెలుగు సినిమా స్క్రీన్ రైటర్స్
- ఇండియన్ స్క్రీన్ రైటర్స్
- సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ విజేతలు
- సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ విజేతలు
- CS1 Indian English-language sources (en-in)
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)