సంతోషం ఫిల్మ్ అవార్డ్స్
సంతోషం ఫిల్మ్ అవార్డ్స్, అనేవి ‘సంతోషం’ సినీ వారపత్రిక ఆధ్వర్యంలో ప్రతి ఏటా తెలుగు సినిమా, సంగీత కళాకారులకు అందించే అత్యంత ప్రజాదరణ పొందిన పురస్కారాలు. ప్రస్తుతం ఇవి సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ అని పిలువబడుతున్నాయి.[1]
ముందు తెలుగు సినిమాలకు మాత్రమే అవార్డులు ఇచ్చేవారు కానీ గత కొన్నేళ్లుగా సౌత్ ఇండియా లోని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల సినిమాలకు అవార్డులు అందిస్తూ వస్తున్నారు. ఈ అవార్డుల కార్యక్రమాలు సంతోషం పత్రికాధినేత, సినిమా నిర్మాత సురేష్ కొండేటి నిర్వహిస్తాడు.
ఈ ఏడాది జరగనున్న 22వ సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2023 వేడుకలు గోవాలో జరగనున్నాయి. ఎప్పుడూ హైదరాబాదు కేంద్రంగా జరిగే ఈ వేడుకలు గతంలో ఒకసారి దుబాయ్ లోనూ నిర్వహించారు.[2]
చరిత్ర
[మార్చు]2003లో సినిమా జర్నలిస్ట్, సినిమా నిర్మాత సురేష్ కొండేటి ప్రారంభించిన సినీ వార పత్రిక సంతోషం 2004లో తొలిసారిగా ఈ పురస్కారాలను ప్రారంభించింది. టాలీవుడ్, సంగీత పరిశ్రమకు చేసిన సేవలకు గాను సాంకేతిక నిపుణులు, నటీనటులందరినీ ఈ పురస్కారాలతో ప్రతియేటా సత్కరిస్తారు.
విభాగాలు
[మార్చు]- ఉత్తమ చిత్రం
- ఉత్తమ దర్శకుడు
- ఉత్తమ నిర్మాత
- ఉత్తమ నటుడు
- ఉత్తమ నటి
- ఉత్తమ సహాయ నటుడు
- ఉత్తమ సహాయ నటి
- ఉత్తమ విలన్
- ఉత్తమ యంగ్ పెర్ఫార్మర్స్
- ఉత్తమ హాస్యనటుడు
- ఉత్తమ సంగీత దర్శకుడు
- ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్
- ఉత్తమ గీత రచయిత
- ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్
- ఉత్తమ నేపథ్య గాయని
- ఉత్తమ కళా దర్శకత్వం
- బెస్ట్ యాక్షన్
- ఉత్తమ సినిమాటోగ్రాఫర్
- బెస్ట్ ఎడిటింగ్
- ఉత్తమ కొరియోగ్రఫీ
- ఉత్తమ కథ
- ఉత్తమ స్క్రీన్ ప్లే
- బెస్ట్ డైలాగ్
- ఉత్తమ సౌండ్ రికార్డింగ్
గౌరవ పురస్కారాలు
[మార్చు]క్రమ సంఖ్య | పురస్కారం | 2022లో | 2021లో | 2020లో | 2019లో | మూలాలు |
1 | లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు | పి. సుశీల | భారతీరాజా, మురళీ మోహన్ | - | - | [3][4][5] |
2 | సంతోషం అల్లు రామలింగయ్య స్మారక అవార్డు | రాజేంద్ర ప్రసాద్ | - | ఎల్. బి. శ్రీరామ్ | మురళీ మోహన్ | [6] |
3 | సంతోషం ఎన్టీఆర్ స్మారక అవార్డు | సి.కృష్ణవేణి, వాణిశ్రీ, లత, రోజా రమణి, ప్రభ, | - | - | - | |
4 | సంతోషం కృష్ణం రాజు స్మారక అవార్డు | మురళీ మోహన్ | - | - | - | |
5 | సంతోషం సిరివెన్నెల సీతారామశాస్త్రి స్మారక పురస్కారం | ఆర్. పి. పట్నాయక్ | - | - | - | |
6 | సంతోషం అక్కినేని స్మారక అవార్డు | - | - | గిరిబాబు | సుమన్ | |
7 | సంతోషం దగ్గుబాటి రామానాయుడు స్మారక అవార్డు | - | ఆదిశేషగిరిరావు | - | - | |
8 | సంతోషం ఈవీవీ స్మారక అవార్డు | - | విజయ్ కనకమేడల (నాంది) | - | - | |
9 | సంతోషం దాసరి స్మారక అవార్డు | - | బొమ్మరిల్లు భాస్కర్ | - | - | |
10 | సంతోషం రాము స్మారక అవార్డు | - | మాలాశ్రీ | - | - |
మూలాలు
[మార్చు]- ↑ "Santosham Awards: 21 ఏళ్లు పూర్తి.. త్వరలో 2022 సంతోషం అవార్డ్స్..!". News18 Telugu. Retrieved 2023-03-20.
- ↑ https://web.archive.org/web/20231011041116/https://www.chitrajyothy.com/2023/cinema-news/this-time-in-goa-48010.html. Archived from the original on 2023-10-11. Retrieved 2023-10-11.
{{cite web}}
: Missing or empty|title=
(help)CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Santosham South Indian Film Awards 2022: Date, venue revealed!". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 2023-03-20.
- ↑ Telugu, ntv (2022-12-04). "Santosham Film Awards: 'సంతోషం'లో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ". NTV Telugu. Retrieved 2023-03-20.
- ↑ "Santosham Awards: 21 ఏళ్లు పూర్తి.. త్వరలో 2022 సంతోషం అవార్డ్స్..!". News18 Telugu. Retrieved 2023-03-20.
- ↑ "Santosham-Suman TV South Indian Film Awards 2021 Curtain Raiser". www.ragalahari.com (in ఇంగ్లీష్). Retrieved 2021-11-14.