ఘట్టమనేని ఆదిశేషగిరిరావు
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలుగు సినిమా నిర్మాత, రాజకీయ నాయకుడు.[1] సూపర్ స్టార్ కృష్ణ తమ్ముళ్లు ఆదిశేషగిరిరావు, హనుమంతరావు కలిసి పద్మాలయ ప్రొడక్షన్స్ నిర్మాణ వ్యవహారాలు, స్టూడియో నిర్వహణ చూసుకునేవారు. అతను 30 సంవత్సరాలుగా చిత్రాలను నిర్మిస్తున్నాడు.
జీవిత విశేషాలు
[మార్చు]అతను ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు రెండవ కుమారునిగా జన్మించాడు. అతని సోదరులు ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని కృష్ణ కూడా సినిమా నేపధ్యం కలిగి ఉన్నారు. అతను గత 30 సంవత్సరాలుగా చిత్రాలను నిర్మిస్తున్నాడు. నిర్మాతగా అతను గుర్తించదగిన సినిమాలలో మోసగాళ్లకు మోసగాడు (1971) ఒకటి. అల్లూరి సీతారామ రాజు (1974) , వంశీ (2000) వంటి సినిమాలను కూడా నిర్మించాడు. అతను పద్మాలయ మువీస్ లేదా పద్మాలయ స్టూడియోస్ పతాకంపై సినిమాలు నిర్మిస్తాడు. ఇది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఉన్న బాగా స్థిరపడిన చిత్ర నిర్మాణ సంస్థ.
రాజకీయ జీవితం
[మార్చు]అతను సినిమా జీవితం నుండి క్రియాశీల రాజకీయాలకు మారాడు. 25 సంవత్సరాలుగా భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా ఉన్నాడు. అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికలలో పోటీ చేయడం ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. అతను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పదవిలో ఉన్నాడు. గుంటూరు నియోజకవర్గానికి టికెట్ కోసం అతని పేరును పరిగణనలోకి తీసుకున్నందున కాంగ్రెస్ ల్ రెండు గ్రూపులు ఏర్పడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ అతనికి మద్దతునిచ్చింది. అతని మేనల్లుడు రాయపాటి మోహన సాయి కృష్ణ గుంటూరు నగరపాలక సంస్థకు మేయర్ పదవిని కలిగి ఉండగా, అతని స్వంత సోదరుడు శ్రీనివాస రావు శాసనమండలిలో చురుకైన సభ్యునిగా ఉన్నాడు. ఘట్టమనేని ఆది శేషగిరి రావు చలన చిత్ర అభివృద్ధి సంస్థలో చాలా కీలక పదవులను నిర్వహించాడు.[2]
తరువాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించాడు. పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే కొందరిలో ఆయన కూడా ఒకడు. పార్టీకి కూడా ఆర్థికంగానూ చాలా అండగా నిలిచారనే ప్రచారం కూడా ఉంది. ఒకవైపు కృష్ణ దంపతులు వైఎస్ జగన్‌కు అనుకూలంగా ఉండటం, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఏకంగా వైసీపీలో కీలక స్థానంలో ఉండటంతో ఘట్టమనేని అభిమానులు కూడా వైసీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపేవారు. 2019 ఎన్నికల సమయంలో అనూహ్యంగా ఆదిశేషగిరిరావు అనూహ్యంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాడు. తనకు ఎంపీ సీటు విషయంలో వైసీపీ నుంచి ఎటువంటి హామీ దక్కలేదని అసంతృప్తితోనే ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరారనే ప్రచారం ఉంది[3]. 2019 ఎన్నికలలో వై.ఎస్.ఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టింది.
కుటుంబ నేపథ్యం
[మార్చు]ఘట్టమనేని ఆదిశేషగిరిరావు సూపర్ స్టార్ కృష్ణ చిన్న తమ్ముడు. అతని కుమారుడు సాయి రాఘవ రత్నబాబు (బాబీ)
మూలాలు
[మార్చు]- ↑ "వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆదిశేషగిరిరావు". ఆంధ్రజ్యోతి. 24 May 2015.[permanent dead link]
- ↑ "Tollywood Producer G Adiseshagiri Rao Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2020-06-07. Retrieved 2020-06-07.
- ↑ "మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు ఘట్టమనేని చూపు..?". newssting. Archived from the original on 2020-06-07. Retrieved 2020-06-07.