ఘట్టమనేని మహేశ్ ‌బాబు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మహేశ్ ‌బాబు(ఘట్టమనేని)సూపర్ స్టార్,ప్రిన్స్ మహేష్ బిరుదాందుడు
విజయవాడలో మహేష్ బాబు.jpg
విజయవాడలో రెయిన్బో ఆసుపత్రి ప్రారంభోత్సవంలో మహేష్ బాబు
జన్మ నామం ఘట్టమనేని మహేశ్ ‌బాబు
జననం (1975-08-09) ఆగస్టు 9, 1975 (వయస్సు: 42  సంవత్సరాలు) ఆగస్టు 9, 1976
భారతదేశం చెన్నై, భారతదేశం
ఇతర పేరు(లు) ప్రిన్స్,సూపర్ స్టార్ (పోకిరి సినిమా నుండి)
భార్య/భర్త నమ్రతా శిరోద్కర్
ప్రముఖ పాత్రలు ఒక్కడు (2003)లో అజయ్
నిజం(2003)లో సీతారాం
అతడు (2005)లో నందగోపాల్
పోకిరి (2006)లో పండు,కృష్ణ మనొహర్మూస:దూకుడు(2011)లోమూస:సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు(2013)లోమూస:శ్రీమంతుడు (2015)లో

ఘట్టమనేని మహేశ్ బాబు (ఆగష్టు 9, 1975) తెలుగు సినీ నటుడు మరియు ప్రఖ్యాత నటుడు ఘట్టమనేని కృష్ణ కుమారుడు. ఈయన 1975 ఆగష్టు 9చెన్నైలో జన్మించాడు.

పూర్వరంగం[మార్చు]

మహేష్ కు ఒక అన్నయ్య రమేశ్ బాబు, ఇద్దరు అక్కలు (పద్మావతి మరియు మంజుల) మరియు ఒక చెల్లెలు ప్రియదర్శిని గలరు. మహేష్ బాబు చిన్నతనంలో తన అమ్మమ్మ అయిన దుర్గమ్మ గారి దగ్గర పెరిగాడు. తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తన పిల్లలకు తగిన సమయం కేటాయించేవాడు. మహేష్ బాబు తన నాలుగవ ఏట ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు. మహేష్ బాబు మద్రాసులో చదివాడు. చదువుకుంటూనే సెలవులలో తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా నటించాడు. మహేష్ బాబు సినిమాల నుండి కొంత కాలం విరామం తీసుకుని లయోలా కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందాడు. బాలనటుడిగా తన తండ్రితో కలసి ఏడు చిత్రాలలో నటించాడు. హీరోగా నటించిన తొలిచిత్రం రాజకుమారుడు. వంశీ సినిమాలో తనతో కలసి నటించిన హిందీ నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ. వీరికి 2012 జూలై 20 న కుమార్తె జన్మిచింది. పేరు " సితార".

సినీ జీవితం[మార్చు]

బాలనటుడు (1989 నుండి 1990 వరకు)[మార్చు]

మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టాడు.[1] 1983 లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించాడు.[2] ప్రముఖ దర్శక-నిర్మాత డూండీ ఆ చిత్రంలో మహేశ్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చాడు. అయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందినాడు. 1987 లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించాడు.[3] 1988 లో విడుదలైన మరియు కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్ తో కలిసి నటించాడు.[4] 1988 లో మరల తన తండ్రి మరియు అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించాడు. 1989 లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన గూడచారి 117 చిత్రంలో నటించాడు.[5] 1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్రభినయం చేసాడు.[6] 1990 లో విడుదలైన బాలచంద్రుడు మరియు అన్న - తమ్ముడు సినిమాతో బాలనటుడిగా తన తొలిఇన్నింగ్స్ ని ముగించాడు.[7]

1999 నుండి ఇప్పటి వరకు[మార్చు]

మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ఆరంభమయ్యింది. ఆ తరువాత చదువు మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలనుండి విరామం తీసుకున్నాడు. డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమారంగానికి వచ్చాడు. హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు వ్యాపార పరంగా పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది. 2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. కానీ 2002 మహేష్ కు సంతృప్తిని ఇవ్వలేదు. ఆ సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి.

2003లో మహేష్ కు తను ఎదురుచూస్తున్న విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి అతి పెద్ద హిట్ చిత్రంగా నిలచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ ప్రతినాయకునిగా తయారయిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది. 2003లోనే విడుదల అయిన నిజం చిత్రం పరాజయం పాలయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఈ చిత్రంలోని నటనకుగానూ మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు బంనంది పురస్కారాన్ని అందుకున్నాడు. 2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో నానిగా పునర్నిర్మితమయ్యింది. మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది. అదే యేడాది విడుదలైన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. 18కోట్ల ఖర్చుతో నిర్మితమయిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది.

అటు పిమ్మట మహేష్ ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్నీ అంగీకరించలేదు. అతడు చిత్ర నిర్మాణంలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. 2005లో విడుదల అయ్యిన అతడు చిత్రం తెలుగునాట మాత్రమే కాక, విదేశాలలోని తెలుగువారి మన్ననలను అందుకుంది. స్వతహాగా మంచివాడయినప్పటికీ పరిస్థితుల వలన కిరాయిహంతకుడై, తోటివారి ద్రోహం వలన ఇంకొకరి ఇంట్లో మారుపేరుతో తలదాచుకునే నందగోపాల్ పాత్రలో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాయి. ఈ సినిమాలో నటనకు మహేష్ కు మరొకసారి బంనంది లభించింది. 2006లో మహేష్ నటించిన చిత్రం పోకిరి విడుదల అయ్యింది. వ్యాపార పరంగా ఈ చిత్రం అమోఘమయిన విజయాన్ని నమోదుచేసింది. దక్షిణ భారత సినీ చరిత్రలో ఈ చిత్రం అతి పెద్ద హిట్ గా నిలచింది. ఈ చిత్రంలో మహేష్ నటనకు ఆశేషాంధ్ర ప్రజానీకం నీరాజనాలు పలికింది. భారతీయ సినీదిగ్గజాలుగా పేరెన్నికగన్న అమితాబ్ బచ్చన్, రాంగోపాల్ వర్మ తదితరులెందరో మహేష్ నటనను శ్లాఘించారు[8] . ఈ చిత్రానికి గాను మహేష్ ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని సైతం గెలుకున్నాడు.

పోకిరీ తరువాత నిర్మాణమయిన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది. ఆ తరువాత వచ్చిన [అతిథి]చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది. అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదనే చెప్పాలి. కానీ, ఆ తర్వాత వచ్చిన 'దూకుడు' చిత్రం మహేశ్ కెరియర్ లోనే ఇంకొక భారీ విజయంగా నిలబడింది. అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో మంచి విజయం నమోదు చేసుకుంది. ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే మల్టీస్టారర్ సినిమా చేసారు,ఈ సినిమా ఈ మధ్యనే విడుదలై అశేష ప్రేక్షకాదరణ పొందింది మరియు భారీ వసూళ్ళను రాబట్టింది, ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'ONE' అనే సినిమా చేసాడు. అది ఒక అద్భుతమైన సినిమాగా జనాలా నీరాజనాలు అందుకుంది. ఆగడు సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ తరువాత వచ్చిన శ్రీమంతుడు భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. తరువాత ఎన్నో అంచనాల మద్య విడుదలైన బ్రహ్మోత్సవం సినిమా ఆకట్టుకోలేకపోయింది. మహేశ్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్నాడు. 2017 ఆగస్టు నాటికి మహేష్ బాబు "స్పైడర్", "భరత్ అనే నేను" చిత్రాలలో నటిస్తున్నారు. ఆ తరువాతి చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు.

2017 లోనే మహేష్ బాబు ప్రఖ్యాత సామూహిక సంభాషణ వెబ్ సైటు అయిన ట్విట్టర్ లో సభ్యుడయ్యాడు.[9]

పురస్కారాలు[మార్చు]

నటునిగా మహేష్ వయసు తక్కువే అయినా ఇతని నటనా పటిమకు అది అడ్డంకి కాలేదు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా తొలి చిత్రం నుండి మహేష్ నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

  • ఉత్తమ నూతన నటుడు: రాజకుమారుడు (1999)
  • ఉత్తమ నటుడు బంనంది : నిజం (2002)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: ఒక్కడు (2002)
  • ఉత్తమ నటుడు బంనంది : అతడు (2005)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు : అతడు (2005)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: పోకిరీ (2006)
  • ఉత్తమ నటుడు బంనంది : దూకుడు (2011)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: దూకుడు (2011)
  • ఫిల్మ్ ఫేర్ ఉత్తమ తెలుగు నటుడు: సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు (2013)

సినీ జాబితా[మార్చు]

బాల నటునిగా[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర విశేషాలు
1979 నీడ బాలనటుడిగా తొలి సినిమా
1983 పోరాటం బాలనటుడు
1987 శంఖారావం రాజా బాలనటుడు
1988 బజారు రౌడీ మహేశ్ బాలనటుడు
1989 గూఢచారి 117 చిన్న బాలనటుడు
1989 కొడుకు దిద్దిన కాపురం వినోద్,
ప్రమోద్
బాలనటుడు
ద్విపాత్రాభినయం
1990 బాలచంద్రుడు చందు బాలనటుడు
1990 అన్న-తమ్ముడు మురళి బాలనటుడు

నటునిగా[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర విశేషాలు
1999 రాజకుమారుడు రాజా నంది ఉత్తమ నూతన నటుడు పురస్కారం
2000 యువరాజు శ్రీనివాస్
2000 వంశీ వంశీ
2001 మురారి మురారి నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
2002 టక్కరి దొంగ రాజు నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
2002 బాబీ బాబీ
2003 ఒక్కడు అజయ్ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
2003 నిజం సీతారామ్ నంది ఉత్తమ నటుడు పురస్కారం
2004 నాని నాని
2004 అర్జున్ అర్జున్ నంది స్పెషల్ జ్యూరీ పురస్కారం
2005 అతడు నందగోపాల్ (నందు) / పార్థు నంది ఉత్తమ నటుడు పురస్కారం
2006 పోకిరి కృష్ణ మనోహర్ (పండు) దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
2006 సైనికుడు సిద్ధార్థ
2007 అతిథి అతిథి
2010 ఖలేజా సీతారామరాజు
2011 దూకుడు అజయ్ నంది ఉత్తమ నటుడు పురస్కారం
దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
2012 బిజినెస్ మేన్ సూర్య పేర్కొనబడ్డాడు-దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం
2013 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిన్నోడు
2014 1 గౌతం
2014 ఆగడు శంకర్
2015 శ్రీమంతుడు హర్ష
2016 బ్రహ్మోత్సవం
2017 "స్పైడర్"

వ్యాఖ్యాత గా/ ప్రత్యేక పాత్రలో[మార్చు]

సంవత్సరం చిత్రం పాత్ర విశేషాలు
2008 జల్సా వ్యాఖ్యాత వాయిస్-ఓవర్
2013 బాద్‍షా వ్యాఖ్యాత వాయిస్-ఓవర్

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]