స్పైడర్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్పైడర్
దర్శకత్వంఎ.ఆర్.మురగదాస్
రచనఎ.ఆర్.మురగదాస్
నిర్మాతమధు బి, నల్లమలపు శ్రీనివాస్
తారాగణంమహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్
ఛాయాగ్రహణంసంతోష్ శివన్
కూర్పుశ్రీకర్ ప్రసాద్
సంగీతంహారీష్ జయరాజ్
నిర్మాణ
సంస్థ
NVR Cinema
పంపిణీదార్లుReliance Entertainment
Lyca Productions (Tamil Nadu)
విడుదల తేదీ
27 సెప్టెంబరు 2017 (2017-09-27)
సినిమా నిడివి
134 minutes
దేశంIndia
భాషలుతెలుగు, తమిళ్

మహేష్ బాబు, మురగదాసు దర్శకత్వంలో నటించిన ద్విభాష చిత్రం.[1]

ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్ 51 కోట్లు సాధించిన మొదటి సాంఘిక చిత్రం సినీ చరిత్ర లో ఇదే అని ఇప్పటి వరకు  చెప్పుకోవాలి. శివ (మ‌హేశ్‌) ఇంట‌లిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. షూటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ త‌ప్పులు జ‌ర‌గ‌క‌ముందే తెలుసుకుని వారిని కాపాడ‌టంలో ఆత్మసంతృప్తి ఉంద‌ని న‌మ్ముతాడు. ఆ ప్రకారం త‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ప్రజలు మాట్లాడే వ్యక్తిగత ఫోన్ల ద్వారా కొన్ని ప‌దాలు వినిపిస్తే త‌న‌కు సమాచారం వ‌చ్చేలా రెండు సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ఆ ప్రకార‌మే కొంద‌రిని కాపాడుతుంటాడు. ఈ ప‌నిలో అత‌నికి మ‌రో ముగ్గురు స్నేహితులు సాయం చేస్తుంటారు. ఓ సారి ఇత‌నికి సాయం చేయ‌బోయి పోలీస్ ఉద్యోగం చేస్తున్న స్నేహితురాలు ప్రాణాల‌ను పోగొట్టుకుంటుంది. దాంతో దానికి కార‌కులెవ‌ర‌నే విష‌యాన్ని ఆరాతీస్తాడు.

భైర‌వుడు (ఎస్‌.జె.సూర్య‌), అత‌ని త‌మ్ముడు (భ‌ర‌త్‌) గురించిన విష‌యాలు అప్పుడే వెలుగులోకి వ‌స్తాయి. ఇత‌రుల ఏడుపు విని ఆనందాన్ని అనుభ‌వించే ఆ సోద‌రుల నేపధ్యం ఏంటి? జ‌నాల ఏడుపులు విన‌డానికి వాళ్లు ఎంత దూరానికైనా తెగిస్తారా? ఆసుపత్రిలో ఉన్న రోగుల ప్రాణాల‌తో భైర‌వుడు ఎలా ఆడుకున్నాడు. ఆ ఆట నుంచి జ‌నాల‌ను కాపాడ‌టానికి శివ‌కు చార్లీ (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ఎలా సాయం చేసింది? ఇంత‌కూ శివ‌కు, చార్లీకి ప‌రిచ‌యం ఎలా జ‌రిగింది? వ‌ంటివ‌న్నీ కథలో భాగం.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు : ఎ ఆర్ మురుగదాస్
  • సంగీత దర్శకత్వం : హారీష్ జయరాజ్
  • ఛాయ గ్రహణం: సంతోష్ శివన్
  • నిర్మాత : మధు బి, నల్లమలపు శ్రీనివాస్

విడుదల

[మార్చు]

సెప్టెంబర్ 27 2017 రోజున తెలుగు, తమిళ భాషల్లో విడుదల అయ్యింది .

మూలాలు

[మార్చు]
  1. స్పైడర్. "స్పైడర్". telugu.filmibeat.com. Retrieved 18 September 2017.